అధికార అయోమయంలో వైకాపా, అనధికార మాయోపాయంలో తెదేపా - అటకెక్కిన ప్రజా క్షేమం అభివృద్ధి 2 ఏళ్ళు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,942,319; 104 తత్వాలు (Tatvaalu) and views 230,697.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మా (మన) మూడో అబ్బాయి వైకాపా, రెండో అబ్బాయి తెదేపా, వింత పరిస్థితి మీకేమయినా అర్థం అవుతుందా? అలాగే ఒకటో అబ్బాయి బాజపా, 4వ చిన్నోడు జనసేన?

మన అవసర అవకాశ రాక్షస వర్గ రాజకీయమే కదా, మనల్ని అప్పుల్లో పన్నుల్లో ముంచుతుంది, కరోనా తో ఆకాశానికి ఏగుతుంది, మరి అది మాట్లాడము అంటే, ఎలా?

వాట్సప్ స్టేటస్ చూడటం మరువద్దు, మీకు పంపనివి ఎన్నో విషయాలు అక్కడ, 24 గంటల లో మారి పాతవి పోయి కొత్తవి ఉంటాయి సుమా. కరోనా తరాల దెబ్బకు కు ముందే, సాత్వికత పెంచి, మాయకు దూరం గా ఉందాము.

తినగ తినగ వేము తియ్యగా ఉండు, వినగ వినగ మంచి ఒంట బట్టు, మురికి బట్టిన మనసు ను ప్రతి రోజు కడగలేమా, విశ్వదాభిరామ వినురవేమ

* * * కోతి కి కొబ్బరి చిప్ప దొరికితే, ఎన్ని కుప్పిగంతులు వేస్తుందో ఆనందం పట్టలేక, ఏం చేస్తోందో ఏం అరుస్తుందో, ఎక్కడ కు దూకుతుందో, కింద పడుతుందో పళ్లు ఊడగొట్టుకుంటుందో తెలీని అయోమయం, వైకాపా నాయకుల పరిస్థితి అలా ఉంది.

ఎవరంటే ఎవరికి గౌరవం ఉందో, ఎవరి మాట ఎవరు వింటున్నారో, ఎవరి క్షేమం ఎవరు కోరుతున్నారో, ఎవరికీ అంతు పట్టని, చిత్ర విచిత్ర పరిస్ధితి.

అధికారం ఉన్నప్పుడే అందినంత విందు భోజనం చేయాలి, తర్వాత అవకాశం ఉంటుందో లేదో. ఒక్క అవకాశం ఇచ్చిన పిచ్చి జనాలను, పిచ్చి వారిగానే ఉంచాలి.

ఆదాయం పెంచే మార్గం తెలీదు, అందినంత అప్పు చెయ్యి, తాకట్టు పెట్టు లేదా అమ్మకం పెట్టు, వీలైనంత నొక్కుతూ, ఎంతో కొంత పంచేయ్, రేపు మనకు అనవసరం.

తెదేపా 2 గా నే ఉండాలి, అవే పిచ్చి పనులు చేస్తూ. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామా, అనే విధముగా ఉంది?

దేవుడు ఇచ్చిన అద్భుత అవకాశం 151 తో, నేల పై ఓ 4 కట్టడాలు కట్టి, చంద్రన్న లాగా 4 తాత్కాలిక భవనాలు హైకోర్టు లాంటివి చూపెట్టి, జగనన్న ఇవి చేశారు అని చెప్పకోవడానికి, ఏమన్నా కొత్తగా ఉన్నాయా ప్రతి జిల్లాలో అంటే ఏమీ కనపడవు, వారికీ అవసరము లేదు, బానిసలు ఉన్నంత కాలం.

ప్రకాశం లో రామాయపట్నం పోర్టు అన్నారు, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అన్నారు. వేటికీ కదలిక కనపడదు.

కనీసం కలెక్టర్ తో జిల్లా అధికారులు తో, సోషల్ మీడియా లో జగనన్న పధకాల అమలు తీరు పెట్టించాలన్న, కనీసం కృతజ్ఞతలు లేని చాతగాని తనంతో అధికార మత్తులో ఎమ్మెల్యేలు ఎంపీలు తూగుతూ ఉన్నారు.

కోర్టు తో మొట్టికాయలు, జడ్జి లతో తగవులు. ఇంకో రెండు ఏళ్ళు, తీర్పులు అన్ని ఇలా వ్యతిరేకంగా ఉంటే, ఏ పని పధకం లో అయినా, అడుగు ముందుకు వేయగలరా అని అభిమానుల అనుమానం? కూల్చివేతలు, జైలు కు పంపడాలు, కక్షలు, ఇంటి కే రేషన్ అయోమయం.

మన అభివృద్ధి తో ప్రతిపక్ష రెక్కలు విరవకుండా, అభివృద్ధి ఆపి, అప్పులు తో పంచుడు కార్యక్రమంలో నిమగ్నమయ్యారు, ప్రతీకారం తీర్చుకుంటూ, వారి వెంట పడుతూ, సమయం వ్రుధా చేస్తున్నారు.

అధికార మత్తు, దుర్వినియోగం గత ప్రభుత్వం లో, చంద్రన్న ను 23 కు తెచ్చింది. మనకూ అదే పరిస్థితి దాపురిస్తుంది అని, ఒకరు కూడా ముందు చూపుతో, ఆలోచన చేయడం లేదు.

ఆవేశం కాదు, ఆలోచన కావాలి, ముందు చూపుతో అని వైకాపా నాయకులు కు ఎవరు అర్థం అయేలా చెపుతారో తెలీదు.

పర్మినెంట్ ఉద్యోగం ఉన్న పంచాయతీ, రెవెన్యూ అధికారులే, ప్రజలకు తలనొప్పి పుట్టిస్తున్నారు. లంచాలు అదుపులోకి రాలేదు. కొత్త గా సచివాలయంలో వాలంటీర్లు టెంపరరీ జాబ్ తో, అర్థం కాని అయోమయ సేవలు.

ఎమ్మెల్యేలు ఎంపీలు ఊళ్ళో ఉండరు, జగనన్న వారిని కలుస్తూ అదుపులో పెట్టరు, జనాలకు అందుబాటులో ఉంచరు. అంతా బాగుంది అని చెప్పే వారి అబద్దాలతోనే, కాలం 2 ఏళ్ళు కరిగిపోయింది.

ధర్మవరం ఎమ్మెల్యే, రాజమండ్రి ఎంపీ లను చూసి కూడా, మిగతా వైకాపా నాయకులు, గుణపాఠాలు నేర్చుకోరు.
మనకు రానిది లేనిది, ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా. లేదంటే సామూహికంగా జగనన్న ద్రోహం చేసిన వారం అవుతాం.

* * * తమకు జరిగిన ఘోర అవమానం, వైకాపా కు కూడా ఎలాగైనా అందాలని, వైకాపా చేసే తిక్క పనులు తో పాటుగా, మంచి పనులు కూడా చేయకుండా, అడుగడుగునా తమకు తెలిసిన వంకర ఆలోచనలు తో, వంకర సంబంధాలతో కోవర్టులతో, అడ్డుపడుతుంది తెదేపా నాయకత్వం.

సహజ గట్టి నాయకత్వ లక్షణాలు లేక, కలసి వచ్చిన కాలము తో కుట్ర ల తో ఎదిగి, కాలం ఎదురు తిరిగినప్పుడు, ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలీక, ఎదుటి వారి కాళ్ళను లాగే పని మాత్రమే మనకు తెలుసు, అనే రీతిలో తెదేపా నాయకత్వం కుళ్ళి పోతున్నది.

కరోనా సమయంలో కూడా, తమ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి లోపాలను, ప్రజలకు అండగా ఉంటూ, సోషల్ మీడియా ద్వారా చూపించలేదు, ఎందుకంటే తమ పాలనలో అభివృద్ధి లోపాలు కనపడతాయి అని.

కుటిల కుట్ర పూరిత ఆలోచన లతో, తమకున్న అపార అనుభవం తో, రాష్ట్ర అభివృద్ధి అప్పులు లేకుండా తాకట్టు లు లేకుండా చేయడం చాతగాకపోయినా, సరైన సలహాలు సూచనలతో అండగా ఉండక, వారు ఏదంటే మేము దానికి వ్యతిరేకంగా ఉంటామని అంటామని, అనే ఒకటే తిక్క సిద్దాంతం తో ముందుకు వెళుతున్నారు.

తమ గొప్పతనం, తమ పనులు తో జనాన్ని ఆకట్టుకోవడం వదిలేసి, కేవలం వైకాపా వైఫల్యాల పైన, తమ భవిష్యత్తు ను నిర్మించుకుంటున్నారు.

తమ 40 ఏళ్ళు అనుభవం ఎంత గొప్పది అంటే, సొంత పుత్రుడు ని గట్టి నాయకులు గా నిలబెట్టి గెలిపించుకోలేని దౌర్భాగ్యం, డమ్మీ గా ఎమ్మెల్సీ తో పదవి ఇవ్వడం, రాష్ట్రం కు భవిష్యత్తు కు ఏవిధంగా, మంచి భవిష్యత్తు ను ఇవ్వగలరు?

చీరాలలో 20 ఏళ్లుగా గట్టి నాయకుని పెట్టుకోలేక పట్టుకోలేక, కనీసం స్ధానిక సోషల్ మీడియా కూడా, స్థానిక విమర్శలు అభివృద్ధి గురించి, చెప్పుకోలేని దుస్థితి లో ఉంది.

* * * వీరన్న మాట వినే వారు అర్ధము చేసుకుని సహకరించేవారు పట్టుమని 10 మంది లేరు రాష్ట్రం మొత్తములో. ప్రజాకర్షణ కలిగిన పవనన్న ను వాడుకోవడం తెలీదు. ప్రాంతీయ పార్టీ అండ అలాగె ముందు ముఖం లేనిదే బీజేపీ ని ఆదరించరు, సొంత గట్టి నాయకులు లేనప్పుడు అన్న నిజం తెలిస్తే, తిరుపతి లో బీజేపీ పోటీ చేయదు.

పవనన్న పార్టీ పతిష్టత చూసుకోకుండా, ఇలాగే నిర్లక్ష్యం గా వదిలేస్తే, ఇంకో 20 యేళ్ళ కు కూడా గెలవరు. ఈ రెండు పార్టీల దుస్థితి చీరాల శాఖ ఫేస్బుకు చూస్తే మీకే అర్ధం అవుతుంది.

* * * ప్రజలమైన మనం - రాష్ట్రం అప్పులు పాలైనా, పన్నులు పెరిగినా, పధకాలకు నాయకులు పేర్లు పెట్టుకున్నా, ప్రభుత్వ స్ధలాలు తాకట్టు అమ్మకాలు అయినా, ఉచిత నాణ్యమైన విద్య వైద్యం లేకపోయినా, నేల కట్టడాలు లేకపోయినా, 3 పంటల మాగాణి కాంక్రీటు చేస్తున్న కూడా, మనకు రెండు కుటుంబాల బానిసత్వం లోనే మగ్గాలి, కొత్త వారిని రానీయం, మన పిల్లలకు కూడా ఉద్యోగాలు లేకపోయినా పర్లేదు. లేదంటే తాత్కాలిక వాలంటీర్ గా బతుకు ఈడిస్తే చాలు, తర్వాత ప్రభుత్వం లో ఉంటామో లేదో తెలీకుండా.

మనం మారము, మన భవిష్యత్ పతనం మారదు.

జై జగనన్న, జై చంద్రన్న, జై పవన్, జై వీరన్న , జైజై కరోనా  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,942,319; 104 తత్వాలు (Tatvaalu) and views 230,697
Dt : 27-Jun-2021, Upd Dt : 27-Jun-2021, Category : Politics
Views : 934 ( + More Social Media views ), Id : 1217 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ycp , power , confusion , tdp , unofficial , machinations , develop , public , welfare , money , distribution , jagan , chandranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content