శక్తి తో పాటుగా యుక్తి జ్ఞానం ఉండాలి. అప్పుడే రాణిస్తాము. గణపతి, శివ పార్వతుల, శక్తి జ్ఞానం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1537 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1572 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

దేశ విదేశాల నుంచి, తమ ఇంట్లో తమ లేదా పిల్లల పూజ ఫోటోలు, పంపిన గురువు లందరికీ ధన్యవాదాలు. అది మీ మంచి మనసు మరియు మీ కుటుంబ క్రమశిక్షణ. పూజ ఫోటోలు పంపడం పబ్లిసిటీ కాదు. పబ్లిసిటీ అంటే పుట్టినరోజు, పెళ్లి రోజు, పర్యటన లు అవి.

గణేష్ పూజ మన ఇంట్లో ఎంత సింపుల్ గా చేసామో, ఇతరులకు చూపిస్తే, వాళ్ళు తర్వాత పూజలు అంత సింపుల్ గా చేయవచ్చు. ఇంకా మీ ఇంటి గణపతి ఉంటే, ఫోటోలు నిర్మొహమాటంగా పంపగలరు.

21 రకాల పత్రి, ఔషధ గుణాలు సమాహారం. అవి అందరం పెంచాలని, పూజలో భాగం చేశారు. మనం, అపార్టమెంట్ లు ఎక్కి , గాలిలో తేలుతూ ఉన్నాము నేల విడిచి. ఇంకా ఘోరం ఏమిటి అంటే, అందరూ పైన ఉంటా, కింద వినాయకుని పెడుతున్నారు, కారులతో పాటు గా. అక్కడ పెడితే, మనం అన్ని రోజులు అష్ట వ్యసనాలకు దూరంగా ఉండి, రాత్రి విగ్రహాలు దగ్గర నే, అందరూ కాపలాగా నిద్ర చేయాలి, నిష్టతో. లేదా ఆవరణ బయట పందిరి వేసి, పెట్టడం ఉత్తమం.

విగ్రహాలు రకరకాలుగా, వేషధారణలతో భంగిమలో విగ్రహాలు చేస్తున్నారు. అది మోహం. మన తాత లేదా నాన్న గారి ఫోటోలు, అలా ఇష్టం వచ్చిన విధంగా చేస్తున్న, ఊరుకుంటామా? తప్పు, అలా చేయకూడదు అని కూడా చెపుతాము, చెప్పాలి.

శివయ్య, గణేష్ ని సంహరించి, గజ ముఖాన్ని పెట్టడం లో మర్మం, చాలా మందికి అర్థం కాదు. కధ వేరు, అందులో ఉండే జ్ఞానం అంతరార్ధం వేరు.

ఆదిశక్తి తయారు చేసిన గణపతి, అమిత శక్తి శాలి. కానీ జ్ఞానం లేదు, శివుడు జ్ఞాన మూర్తి, మేధా దక్షిణామూర్తి. అందుకే గణపతి తన అమిత బలంతో జ్ఞాన శూన్యుడై, శివుని మీదకి యుద్ధం కు వెళ్ళారు. అతనికి జ్ఞానం, కలిగించడం కోసమే, అలా చేసి, గజ ముఖాన్ని తగిలించి, జ్ఞాన శక్తి గణపతి గా, సిద్ది బుద్దిని పొంది, విఘ్నాలు ఆపే శక్తి యుక్తులను, అన్నిటిని ఇచ్చారు. శివ పార్వతుల, శక్తి జ్ఞానం ల ను ఇచ్చారు.

గుర్తు ఉందా, తెలివిగా, రావణుడు శివలింగం ను లంకకు తీసుకుని వెళ్ళకుండా ఆపింది, బుజ్జి గణపతే. అంటే కధ పరమార్ధం ఏమిటి? శక్తి తో పాటుగా యుక్తి జ్ఞానం ఉండాలి. అప్పుడే రాణిస్తాము.

ఇది మనకైనా , నాయకులు, అధికారులు అందరికీ వర్తిస్తుంది. ధన్యవాదాలు, శ్రీ గణేష్ మహరాజ్ కీ జై.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1572 General Articles, 54 Tatvaalu
Dt : 22-Aug-2020, Upd Dt : 22-Aug-2020, Category : General
Views : 653 ( + More Social Media views ), Id : 656 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : wisdom , power , excel , ganesh , shiv , parvati
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content