Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. చేతిలో అధికారం ఉంది అని, ఇన్నాళ్ళు స్వార్ధం అంగబలం ఆడంబరం ఆర్భాటాలతో, పక్షపాతం తో కళ్ళు మూసుకు పోయిన పచ్చ బులుగు మీడియాల అండతో, విర్రవీగిన గత నాయకులు, చతికిల బడి కూర్చున్నారు ఇప్పుడు. మర్యాదకు, ఒక పార్టీ నుంచి ఒకరిని పిలవడం, పర్లేదు, కానీ ఇంత మందా?
కాలం ఎప్పుడూ మనదే కాదు, అందుకే మన ప్రతి పనిలో నీతి నిజాయితీ నిస్వార్ధం ఉండాలి. కొంత మంది అయినా మారుతారు అన్న సదుద్దేశము తో, మన్నిస్తారని ఆశిస్తూ -
*సూరన్న* - వీరన్నా, ఏమిటి మన పక్క జిల్లా ప్రజా ప్రతినిధి అమెరికా పోతున్నారు అంటగా, 3 రోజులు తిరణాలే అంటా, విందులు వినోదాలు? 10 కోట్లు పైన అఫ్ఫిడవిట్ ఆస్తులు లెక్కలేనన్ని బినామీ ఆస్తులు ఉన్న, మన నిరు పేద నాయకుల కు, అన్ని వారే సమకూరుస్తారు అంట గదా, వీసా, విమాన ఖర్చులు, 3 రోజులు హోటళ్ళు, భోజనాలు, అటు ఇటు తిప్పడము, ఇతర సరదాలు, సంతోషాలు, చాటు వ్యవహారాలు?
మరి మన ఎమ్మెల్యే ఎంపీని ఎందుకు పిలవలేదు, ఏం పాపం చేసారు? వీళ్ళు నిరు పేదవారే కదా? ఇంట్లో ఉండి జనాన్ని కలవకుండా, 3 ఏళ్ళు గా ఎంతో సేవ చేసారు కదా?
ఓ 40 మంది సినిమా మరియు నాయకులను పిలిచి, ఇంకో 40 మందిని వదిలితే ఎలా? డాలర్లు సంపాదించే మహారాజులు తలచుకుంటే, ఓ 200 మంది ని అయినా పిలవలేరా?
*వీరన్న* - సూరన్నా, మన తెలుగు తేజాలు వారి నాయకులు ఎక్కడ ఉన్నా, మన మంచి అలవాట్లు పోవుగదా. అవకాశ, అవసర, వర్గ, అధికారం, ఇవి బేరీజు వేసి, దేనికి ఎవరు పనికి వస్తారో, వారిని మాత్రమే పిలుస్తారు. అంతే గానీ ఉపయోగం లేని, మన ఇతర నాయకులను పిలువరు.
అక్కడ వీసాల లెక్క గొడవ ఒకటుంది, లేకపోతే 1000 మంది నైనా మనవారు పట్టుకొచ్చేస్తారు.
షుమారు విమానం కు ఓ లక్ష వేసుకో, హోటల్ ఓ 20 వేలు వేసుకో, భోజనం ఓ 20 వేసుకో, తిప్పడం ఓ 20 వేసుకో, వీసా 20 వేసుకో, షుమారు ఒక్కొక్కరికి ఓ 2 లక్షలు. అంటే కనీసం షుమారు 50 లక్షల పై మాట.
ఆ సినిమా మరియు రాజకీయ పిచ్చి అవసరం ఉన్న, ఆ ఉత్తమ దాతలు కోటి పైనే ఇస్తారు, వారితో ఫోటోలు దిగి, ప్రచారం కు సోషల్ మీడియాలో పెడతారు. మంచి పనికి చందాలు అంటే కష్టం కానీ, దుబారా ల తో స్వార్ధ సొంత పనులకు మాత్రం డబ్బులు విపరీతం గా రాలుతాయి, మరలా అక్కడ వ్యాపారం లో వెనక్కు వస్తాయి. అంతా ధన మాయ.
ఎక్కువ మంది విదేశీ తెలుగు నాయకులు వీసా పచ్చ కార్డు వారు కాబట్టి, వీరికి తెలుగు నేల పై వ్యాపార, రాజకీయ, ఇతర బంధాల పరముగా, చాలా అవసరాలు ఉంటాయి. అందుకే పైకి కనపడే సేవ వేరు, లోన జరిగే అసలు చాటు సేవ వేరు.
ఎక్కడైనా అంతే కదా? సొంత లాభం స్వార్ధం లేకుండా, మన సేవ ఉంటుందా? 10 కోట్ల తో వచ్చిన రాజకీయ నాయకులు, 1000 కోట్లు అయిన దాకా, ప్రజా సేవ వదలరు గాక వదలరు. మన జనం కూడా, ఓటుకు నోటుకు 100 కోట్లు ఉన్న నాయకులనే ఎన్నుకుంటారు, రాష్ట్ర రధ సారధిగా. నాయకులకు వైద్యం హైదరాబాద్ లో, మనకు వీలైతే ఊళ్ళో లేదా స్మశానం లో, మన కక్కుర్తి కి మనకే శిక్ష. పాము పులు ల చేతిలో చచ్చినా పర్లేదు కానీ, ఆవును మాత్రం ఎన్నుకోము, ఎందుకంటే మనకే ఆవు లక్షణాలు లేవు కదా?
*సూరన్న* - వీరన్నా, మన రాజకీయ నాయకులను చూసి, విదేశీ తెలుగు పెద్ద చదువు వారు, నేర్చుకునేది ఏముంటుంది? అక్కడ స్థానిక భారత/ తెలుగు రాజకీయ నాయకులను కదా పిలవాల్సింది? వాళ్ళు ఇంకా తెలుగు మరువలేదు, రాయగలము కూడా, మా పిల్లలకు తెలుగు తో పాటు గా నాట్య కళలు నేర్పాము, మా ముదుసలి తల్లి దండ్రులకు కూడా విదేశీ వైద్యం ఇప్పిస్తున్నాము అని, అక్కడి గొప్పలు మనకు చెప్పి చూపించాలి గానీ.
వారసత్వ బానిసత్వములో, మన్ను తిన్న పాములా ఉండే, మన వారి నుంచి ఏమి నేర్చుకోవాలి? వెన్నుపోటు, పన్నుపోటు, 3 పంటల మాగాణీ సిమెంట్ చేయడం, మాట తప్పు మడమ తిప్పు, కేసులు, స్టేలు, కుటుంబ పాలన, అధికారం ఉంటే ఈ రాష్ట్రం లో - పోతే పక్క రాష్ట్రం లో, పచ్చ/ బులుగు మీడియా తో దోస్తీ వాస్తవం నాస్తి, చేయి చాపు కడుపు నింపు, పాత బస్తీ కొత్త బస్తీ ఏనాటికీ, అధికారులు నాయకులు ఫాం హౌస్ లోనే, ప్రజా పధకాలకు కుటుంబ పేర్లు, అప్పుచేసి పప్పుకూడు, రాష్ట్రాన్ని అమ్ము జనానికి పంచు, ఇలాంటి నీచమైనవా?
*వీరన్నా* - ప్రతి రోజూ దైవస్మరణ లాగా, మన తెలుగు తేజాలు, మన బుద్దులు మరుస్తారేమో అన్న భావనతో, మరలా మరలా గుర్తు చేస్తుకోవడానికి వీరిని తీసుకు వెళతారు. తెలుగు నేల పై రాజకీయ అవసరాలు తీరాలంటే, వీరి పాద సేవ కూడా మరువకూడదు కదా. కొంతమంది, అక్కడ సంఘ పదవులు వెలగపెట్టి, వ్యాపారాలను వ్రుద్ది చేసి, ధన ప్రవాహము వివిధ పద్దతుల ద్వారా ఇక్కడకు చేస్తూ, ఇక్కడ తమ కోసం లేదా బంధువుల కోసం, పైరవీలు నడుపుతారు.
రేపు విదేశం లో నాయకులు గా చెలామణి అయితే, ఇవే (వక్ర) నీతి నియమాలు పాటిస్తారు, అక్కడి మంచి సాంప్రదాయాలను పక్కనబెట్టి. తాచెడ్డ కోతి వనమెల్లా చెరచింది అంటే ఇదే కదా. రాబోయే రోజుల్లో విదేశాలను కూడా, అవినీతిలో మన పక్కనే నిలబెడతారు. మన దేశాన్ని పైకి తీసుకెళ్ళ లేకపోయినా, ఆ దేశాల్ని కిందకు దించారు అంటే, మన తేజాల గొప్పే కదా.
ఇంక వీరు తెలుగు రాయడం, బిడ్డలకు తెలుగు రాయడం నేర్పడం, సొంత ముదుసలి పెద్దలకు చివరిదశలో ఇంట్లో ఉంచి విదేశీ వైద్యం లాంటి, తప్పుడు మాటలు వారి డిక్షనరీ లో నే లేవు. వారు చేయరు, ఇతరులను ప్రొత్సాహం చేయరు. ఇంకా తక్కువగా చూస్తారు చీ చీ విలువలున్న మనిషి తో, మనకు పనేమిటి అని, వాడు బాగు పడడు, మనల్ని బాగుపడనీయడు అంటారు. సొంత వారికి సేవ చేస్తే, బయట వారికి ధన వ్యాపార సేవ చేయలేమేమోనని కూడా సదుద్దేశం కావచ్చు.
ఏరు దాటాక తెప్ప ఎలా తగలెయ్యాలి అంటే, మన విదేశీ తెలుగు నాయకులను చూసి నేర్చుకోవచ్చు. అక్కడ కూడా, ముఠాలు కట్టి, మన సంస్క్రుతిని కొనసాగిస్తున్నారు. ఒక ముఠాను బహిషకరిస్తారు, లేదా కొత్త కుంపటి లేదా కోర్ట్ కు మన వారి మీదనే, అధికారం ముఖ్యం అంతే.
*సూరన్న* - మరి కోట్లు తీసుకునే నిరు పేద సినిమా నటీనటులను, వారి అభిమానులు ఖర్చులు భరించి ఎటూ పిలుస్తారు. పాటగాళ్ళు, సంగీత వాయిద్యగాళ్ళు, గెంతేవాళ్ళు, ఎవరికి వారే విడిగా జట్టులు గా, ప్రోగ్రాములు చేసుకుంటూ, వ్యాపారం చేస్తున్నారు. మరి వీరందరికీ, ఎగష్టా వ్యాపారం ఇవ్వడానికి, ఈ సేవా ముసుగు వీరులు, ఇంకో దోవ ఇస్తున్నారా, ఇలా పిలిచి?
*వీరన్నా* - వాళ్ళు విడిగా వస్తే వ్యాపారానికి, మన తెలుగు సంఘ నాయకుల మొఖాలు ఎవరు చూస్తారు. అక్కడి తెలుగు నాయకులు, వారిని కార్లలో తిప్పి, ఊళ్ళు ప్రదేశాలు క్లబ్ లు చూపించి, తిండి పెట్టి, ఓ 10 ఫోటోలు పెడితే కదా, మన పిల్లలు ఇక్కడ కడుపు నిండి చప్పట్లు కొట్టేది.
మరి వారి ఇల్లాళ్ళు లోన ఎంత కుమిలి పోతున్నారో, తమ భర్తల భాగోతం చూసి. లేదు ఇక్కడ ఇదే కామన్ అని సర్ధుకుంటున్నారో, దేవుడి కే తెలియాలి. వ్యాపారములో రోం లో రోమన్ గా ఉండమన్నారు, కానీ ఇంట్లో మరియు ఒంట్లో మాత్రం సాంప్రదాయం సంస్కారం మరువకూడదు సుమీ.
మన అన్న హీరో హీరోయిన్ తో, అక్కడ ఇక్కడ తిరిగాడురో, ఇంట్లో భోజనం పెట్టాడు రోయ్. ఎంత అద్రుష్టవంతులు, మనకు లేకపోయినా మన అన్న కు ఉంది, అనే శిష్యులు వీరికి మెండుగా ఉన్నారు. ఫోటో పెట్టడం ఆలస్యం, వందల లైక్ లు షేర్ లు.
పేపర్లో పోలీసు కేసులు కూడా చూసాము, హీరోయిన్ల మీ టూ తో, పక్క దోవలతో, మన వారు తెలివిగా తప్పించుకున్నారు ఏమో, ఇంకా తెలియ రాలేదు.
ఈ నాయకుల కోసం, చదువు ఉద్యోగం వీసా అమాయకులు త్యాగాల తో బలి, ఉచిత పిజ్జా భోజనం మందు ఉంటే చాలు అని, జే జే లు కొట్టుకుంటు వీరి వెంట, కార్లలో తిరుగుతారు.
- - -
సినిమా రాజకీయ నటుల వలన, ప్రతి సారి వచ్చిన లాభాలు ఏమిటి? ఇంత దుబారా ఖర్చు ఎవరు భరించడం? ఎవరికి ఉపయోగం? ఈ ధనం తెలుగు నేల పేదలకు వాడలేమా?
ఇది సేవ కిందకు వస్తుందా? ఎవరి సేవకు?
ఇలాంటి జాతరలు ఆర్భాటాలు హంగులు లేకపోతే, ధనం ఇవ్వము సేవ చేయము అండగా ఉండము, సభ్యులు గా చేరమనే, మానసిక దౌర్భాగ్యం బలహీనం, విలువ సంస్కారం లేని సభ్యులు దా లేక స్వార్ధ సంఘ నాయకుల దా?
మీ అమూల్యమైన జవాబులు సలహాలు లింకులు వీడియో లు దయచేసి. మా తప్పులు ఉంటే సరి చేసుకుంటాము.
తెలుగు నేలపై, స్థానిక తెలుగు టీవీ డిబేట్ ల లో కూడా, ఇంతమంది ని పిలవరు. మరి అమెరికా కు ఇంతమంది ఎందుకు? కరోనా వచ్చిన తర్వాత, ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, చర్యలు చర్చలు జరుగుతున్నాయి.
ఇంతమంది ని అమెరికా తీసుకుని రావడం తేలికనా, తెలుగు సంఘ మోహ స్వార్ధ నాయకులు తెలుగు రాష్ట్రాల కు వెళ్లి, వారికి నచ్చిన సినిమా మరియు రాజకీయ నటుల తో, తెలుగు నేల పై సదస్సు నిర్వహించడం తేలికనా? ఏది ఖర్చు, శ్రమ తక్కువ?
వీరి అరాచకాలు, సరసాలు, వ్యాపారాలు, తెలుగు మీడియా కు దొరుకుతాయనా? వారు మన తాను ముక్కలే కదా? చాటుగా అమెరికా లో తిరిగితే, ఎవరికీ కనపడదు అనా?
దయచేసి, తెలుగు సంఘాలను మంచి కార్యాల కోసం, విదేశాలలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం మాత్రమే వాడతారని ఆశిద్దాము.
Why foreign Telugu associations, pomp, clamor, fairs, inviting film and political actors?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,323,850; 104 తత్వాలు (Tatvaalu) and views 252,330 Dt : 04-Jul-2022, Upd Dt : 04-Jul-2022, Category : America
Views : 903
( + More Social Media views ), Id : 1451 , Country : USA
Tags :
foreign ,
telugu ,
associations ,
leaders ,
pomp ,
clamor ,
fairs ,
inviting ,
film ,
political ,
actors ,
usa తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments