వరలక్ష్మి హారతి - జయ జయ హారతి, సౌభాగ్య వర మహాలక్ష్మీ, దండాలు దండాలు, శ్రీలక్ష్మి నీ మహిమ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,816; 104 తత్వాలు (Tatvaalu) and views 226,203.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Varalakshmi Harati Satsang - Jaya jaya harati, Soubhagya lakshmi, Vara maha lakshmi, Dandalu dandalu, Srilakshmi ni mahima

*పాటతో పరమార్ధం - వరలక్ష్మి హారతి సత్సంగము - జయ జయ హారతి, సౌభాగ్య వర మహాలక్ష్మీ, దండాలు దండాలు, శ్రీలక్ష్మి నీ మహిమ*

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

తాత్పర్యం - మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు.

నిండుగా వరలక్ష్మి వ్రతము చేస్తే చాలంట, నిండు వరముల వర్షం కురిసే పండుగలేనంట,
శుక్రవారం లక్ష్మీ దేవి వందనమిదిగోమ్మా అంటూ, అన్ని ఇళ్ళలో శ్రావణ లేదా మామూలు శుక్రవారము నాడు, సంసార సంస్కార మహిళలు గొంతు ఎత్తి పాడుతూ, తమ కుటుంబ సంక్షేమము కోసము, ఈ వ్రతము/ పూజ చేస్తారు.

నోటితో మంత్రాలు చదువుతూ, కుటుంబ మనశ్శాంతిని ఆరోగ్యమును ఇవ్వమని, అణుకువగా క్రుతజ్ఞతలు తో తప్పక పూజ చేయాలి, ప్రతి వారం వాక్సుద్ది సాధన చెయ్యాలి. మంత్రం మన మనసు మీద పనిచేస్తుంది, మనకు ఉపయోగం దేవుని కన్నా. కోట్లు ఉన్నా, హోదా ఉన్నా, వయసులో లేదా ముదుసలి తనములో, అందరూ వదిలేసి, మనశ్శాంతి లేక అల్లాడుతూ ఉన్నవారు, లక్షల మంది ఉన్నారు. ఒక్కసారి, ఇసక వేస్తే రాలనంత మంది, ఆసుపత్రుల చుట్టూ, తిరుగుతున్న జనాన్ని చూడండి.

మూర్ఖుల మాదిరిగా, ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా, అహంకారముతో మేము ఉచితముగా లాభం లేకుండా, మా స్థాయికి గొంతు ఎత్తి పాడేదేమిటి అని, ఎంపీ3 ఆడియో నోటి నటన పూజ ల ద్వారా, మనల్ని మనం కించపరచుకుంటూ, మన తల్లి దండ్రుల కుసంస్కార పెంపకమును చాటుకుంటూ, అందరిముందు తక్కువ చేసుకుంటూ, మీ అరిషడ్వర్గాల బానిసత్వాన్ని నిరూపించుకుంటూ, మనకు గొంతు ఇచ్చిన దేవుని, కన్నతల్లి భాషా ను, దయచేసి అవమానపరచవద్దు, పాపాన్ని మూటగట్టుకోవద్దు సుమీ.

మనకు అనడం రాకపోతే, వచ్చిన వారినో లేదా పంతులు గారినో పిలిచి చేపించుకోవాలి, లేదా నేర్చుకోవాలి, కనీసం 7 వ తరగతి చదివి ఉంటే. అసలు పాటలు మంత్రాలకు చదువుతో పని లేదు, కేవలం విని కూడా బ్రహ్మాండముగా పాడే వారు, చదువురాని వారిలో ఉన్నారు కదా? ఇంటి మహిళలు ముందుకు రాకపోతే పూజలకు, ఆ ఇంటి పురుషులైనా, కుటుంబ క్షేమం కోసం ఇవి ఆచరించాలి, తమ ఆత్మను గతములో చంపుకున్నందుకు, పాప పరిహారానికి.

ఎంపీ3 ఆడియోల ద్వారా పూజ చేసినట్లు అయితే, వాటికే ప్రసాదము పెట్టాలి, ఫలితాలు కూడా వాటికే, మనము ఆరోజు ఇంక ఏమీ తినకూడదు కదా? ఫలితాలు ఎటూ మనకు ఎటూ రావు కదా? ఉన్న పుణ్యం పూర్తి అయ్యాక, అంతా కష్టాలే, మన అహంకారానికి సుమీ.

వ్రతము చేసే ఓపిక లేకపోయినా, కనీసం పూజ చేయాలి. 7 వ తరగతి కూడా చదువు రాని వారు, కనీసం చిత్తశుద్దితో పాటలు అయినా పాడాలి. మనము ముందు కధనములలో, గౌరీ దేవి పాటలు సత్సంగములో పంచుకున్నాము.

ఇప్పుడు లక్ష్మీ దేవి పాటలు నేర్చుకుందాము. ఆడ మగ తేడా లేకుండా, అందరూ పాడాలి, ఎందుకంటే, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

1) జయ జయ హా..రతి, జయ వరలక్ష్మి
జయ శుభ హా..రతి, శ్రీ వరలక్ష్మి

శ్రీకరి శుభకరి, మంజుల హాసిని 2
శాంభవి మాధవి, చంద్ర సహోదరి ||జయ జయ||

మంగళదాయిని, పంకజ వాసిని 2
క్షీర సముద్భవ మంత్ర నివాసిని ||జయ జయ||

మణిమయ భూషిత, మునిగణ వందిత 2
మంగళ రూపిణి, సిద్ది ప్రదాయిని ||జయ జయ||

Jaya Varalakshmi Harati, Varalakshmi Devi Harati
జయ వరలక్ష్మీ హారతి, వరలక్ష్మీ దేవి హారతి

2) సౌభా..గ్య లక్ష్మి రా.వమ్మా. అమ్మా. ఆ, సౌభా.గ్య లక్ష్మి రా.వమ్మా… 2

నుదుట కుంకుమ రవిబింబముగా
కన్నుల నిండుగా… కాటుక వెలుగా
కాంచన హారము… గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండుగా…2 ||సౌభాగ్య లక్ష్మి||

నిండుగ కరముల… బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు
గల గల గలమని… సవ్వడి చేయగా
సౌభాగ్య వతుల… సేవలు నందగా 2 ||సౌభాగ్య లక్ష్మి||

నిత్యసుమంగళి నిత్యకళ్యాణి, భక్త జనులకూ కల్పవల్లి
కమలాసనవై కరుణనిండగా, కనక వృష్టి కురిపించే తల్లి 2||సౌభాగ్య లక్ష్మి||

జనకరాజుని ముద్దుల కొమరిత, రవి కులసోముని రమణీమణివై
సాథుసజ్జనుల పూజలందుకొని, శుభములనిచ్చెడి దీవనలీయగ 2||సౌభాగ్య లక్ష్మి||

కుంకుమ శోభిత పంకజ లోచని, వెంకట రమణుని పట్టపురాణి
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే, పుణ్యమూర్తి మాయింట వెలసిన 2 ||సౌభాగ్య లక్ష్మి||

సౌభాగ్యమ్ముల బంగరుతల్లి, పురందర విఠలుని పట్టపురాణి
శుక్రవారంబు పూజలందుకొన… సాయంసంధ్యా శుభ ఘడియలుగా 2 ||సౌభాగ్య లక్ష్మి||

సౌభా..గ్య లక్ష్మి రా.వమ్మా. అమ్మా. ఆ, సౌభా.గ్య లక్ష్మి రా.వమ్మా… 2
Sowbhagya Lakshmi Ravamma

3) ఓం నమో శరణ్యే సుకారిణ్యమూర్తే వరేణ్యే
హిరణ్యో దరాజే రగణ్యే సుకన్యే
మాం పాహి మాం పాహి మాతా నమస్తే

వర మహాలక్ష్మీ, కరుణించ వమ్మా.. 2
చరణాలే శరణంటినమ్మా…
పతిదేవు బాసితి, వెతలంది రోసితి
నుతియింతు పతినీయవమ్మా
వర మహాలక్ష్మీ వర మీయవమ్మా
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి, మాం పాహి, మాం పాహి మాతా

పాలకడలిన పుట్టి శ్రీహరిని చేపట్టి
వైకుంఠ లోకాన లక్ష్మి వైనావే..
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
సత్వగుణమూర్తివే ఆ…, సంపత్స్వరూపివే ఆ…
సత్వగుణమూర్తివే… సంపత్స్వరూపివే…, సర్వసిద్ధివి నీవే సుమ్మా
నావేదనను బాప, నీ దేవుతో గూడి, నైవేద్యమందుకోవమ్మా
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి, మాం పాహి, మాం పాహి మాతా

వాగీశు రాణివై, వరవీణ పాణివై,
బ్రహ్మ లోకమ్మున, వాణి వైనావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
కల్యాణదాయిని, కళల స్వరూపిణి
ఇల సకల విద్యలకు, తల్లి వీవమ్మా
నావేదనను బాప, నీ దేవుతో గూడి, నైవేద్యమందుకోవమ్మా
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి, మాం పాహి, మాం పాహి మాతా

గిరిరాజ తనయవై, పరమేశు తరుణివై
కైలాస లోకాన, గౌరివై నావే
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
శక్తి స్వరూపిణి మాం పాహి మాతా
భక్త జనపాలిని మాం పాహి మాతా
భక్త జనపాలిని మాం పాహి మాతా
సుఖ సౌఖ్య సౌభాగ్యదాయి వీవమ్మా
నావేదనను బాప, నీ దేవుతో గూడి, నైవేద్యమందుకోవమ్మా
మాం పాహి మాతా… మాం పాహి మాతా…
మాం పాహి, మాం పాహి, మాం పాహి మాతా, పతినీయవమ్మా…3

Varalakshmi Vratam Songs - Vara Mahalakshmi - Kantha Rao, KrishnaKumari
వరలక్ష్మీ వ్రతం సినిమా పాటలు సాహిత్యం వర మహాలక్ష్మి తెలుగు, కాంత రావు, కృష్ణకుమారి
చిత్రం : వరలక్ష్మీ వ్రతం (1971), సంగీతం : రాజన్ నాగేంద్ర, సాహిత్యం : జి.కృష్ణమూర్తి, గానం : జానకి, లీల, పి.బి.శ్రీనివాస్ బృందం

4) మాయమర్మమెరగనోళ్ళం, మట్టి పిసికి బతికెటోళ్ళం
ఊరి దేవతైన నిన్నే, ఊపిరిగా కొలిసెటోళ్ళం
గండవరం నెయ్యి పోసి, గారెలొండి తెచ్చినాము
బుజ్జిముండ పాల కుండ, వెంటబెట్టుకొచ్చినాము

దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో
బోనాలు తెచ్చాము అమ్మోరు తల్లో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో
ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లో . . . ||దండాలు దండాలు||

ఆదిశక్తిని నేనే, అన్నపూర్ణను నేనే, ఏయ్
సకల లోకాలేలు, సర్వమంగళి నేనే
బెజవాడ దుర్గమ్మ, తెలంగాణ ఎల్లమ్మ
నిడదవోలు, సత్తమ్మ నేనే, ఏయ్
అల్లూరు కల్లూరు ఆలేరు సీలేరు, అన్నూళ్ళ దేవతను నేనే, ఆ
మీ బాధలను తీర్చి, మీ కోర్కె లీడేర్చి, అలరించి పాలించు, అమ్మోరు నేనే...

దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో

పాదులేని తీగకు, పందిరేసిన తల్లివి
మోడుబారిన రెమ్మకు, పూలు తొడిగిన అమ్మవి
ఆపదలు పోగొట్టి, కాపురము నిలబెట్టి, కరుణించి కాపాడినావు
అరుదైన వరములను, అనుకోని శుభములను, నా బ్రతుకుపై చల్లినావు
ఈలాగే నీ అండే ఎప్పటికీ నాకుంటే, లోకంలో మనశ్శాంతి నా వశమౌతుంది

దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో
కరుణించి మమ్మేలు అమ్మోరు తల్లో, చల్లగా ఏలుకో మాయమ్మ తల్లో

చిత్రం: అమ్మోరు (1995), సంగీతం: శ్రీ ( కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి), సాహిత్యం: మల్లెమాల టీం, గానం: మాధవపెద్ది రమేష్, నాగూర్ బాబు, లలితాసాగరి, కోరస్
Ammoru, Ramya Krishna, Soundarya, Suresh, Rami Reddy, Baby Sunaina, Vadivukkarasi, Kallu Chidambaram, Babu Mohan

5) శ్రీ లక్ష్మి నీ మహిమలో గౌరమ్మ, చిత్రమై తోచునమ్మా, గౌరమ్మ చిత్రమై తోచునమ్మా

Srilaxmi Nee Mahimalu Gowramma - Chillara Devullu
కాంచన, సావిత్రి, రమాప్రభ, ఉమాభారతి, భానుప్రకాష్, వినయ్ కుమార్,త్యాగరాజు, చిల్లర దేవుళ్ళు
Kanchana, Savitri, Ramaprabha, Uma Bharati, Bhanu Prakash, Vinay Kumar, Thyagaraju, Chillara Devas

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.

varalakshmi harati jaya jaya harati soubhagya lakshmi vara mahalakshmi dandalu dandalu srilakshmi ni mahima  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,816; 104 తత్వాలు (Tatvaalu) and views 226,203
Dt : 09-Aug-2022, Upd Dt : 09-Aug-2022, Category : Songs
Views : 825 ( + More Social Media views ), Id : 1489 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : varalakshmi , harati , jaya , harathi , soubhagya , vara , maha , lakshmi , dandalu , srilakshmi , mahima
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content