Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఆకాశం నీలం రంగులో ఉండును, మనం భూగ్రహం పై ఉన్నాము, ఉదయించే సూర్యుని కిరణాలు ఆపే శక్తి ఎవరికీ లేదు. ఇప్పుడు అదంతా గతం.
ఆకాశం ఆరెంజ్ రంగులో ఉండును. మనం అరుణ గ్రహం అంటే మార్స్ పై ఉన్నాము. సూర్యుని కాంతి ని, కిరణాలు ను, ఆఖరికి సూర్యుని దాచేసే శక్తి, తగలబడిన కొండ ల పై అడవి, పొగకు ఉంది. మా సూర్యుడు మాయం, ఇప్పుడు మధ్యాహ్నం, సూరీడు రాడు ఇక మాకు. ఓ యుద్ధ వాతావరణం లాగా ఉంది, ప్రాణ వాయువు శాతం తగ్గుతుంది.
సూర్య రస్మి లేకపోతే, అన్ని జీవ జాలాలలో మానసిక శారీరక మార్పులు సుమా. సన్నగిల్లిపోతుంది మనోధైర్యం చాలా మందికి. పట్టపగలు ఇంట్లో చీకట్లు, రాత్రి లాగా లైట్లు.
ఆకాశం అంతా గోల్డ్ స్పాట్ కలర్ అంటే ఆరంజ్ రంగులో ఉంది. రాష్ట్ర బిరుదులోనే గోల్డ్ ఉంది. ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది. సూర్యుని కప్పేసిన పొగ. మరి ఆక్సిజన్ లెవల్స్ పరిస్థితి ఏమిటో, మా పుణ్య భూమిలో. రోజంతా ఇలా, మరి ఎన్ని రోజులు ఉంటుందో ఇలా.
అడవులు తగలబడుతున్నాయి. గత వారం గా విపరీతమైన ఎండలు. ఉక్కబోతతో జనమంతా ఫాన్లు ఏసీలు. ట్రాన్స్ ఫారమ్ పేలుతుంది బాబోయ్, వాడకం తగ్గించండి అని కరెంటు కంపెనీలు మెసేజ్ ఈమెయిలు గగ్గోలు.
ఓ పక్కన కరోనా గురువు. బయట గాలి పీల్చుకుందామని పోతే, అక్కడ పొగ లేదా ఎండ సెగ లేదా కరోనా వ్యధ. పక్కన మనిషి నడుస్తున్న చాలు భయం, ఏ కీటకం మన పైన వాలుతుంది ఏమో అని. అయినా మాస్క్ వేసుకోకుండా, నడిచే ధైర్య తెలివి ఎక్కువైన జనం.
వారానికోసారి కింద భూమి కంపిస్తుంది, వార్నింగ్ ఇస్తున్నట్టు గా. భవిష్యత్తు లో పెద్ద భూకంపం సంకేతం గా. ఇది ఎప్పుడూ, వేళాడే కత్తే, అని అందరి భావన, పట్టించుకోరు.
ఇంకోవైపు నీళ్ళు తగ్గిపోతుంటాయి, భూమి లో, పొదుపు గా వాడండి, అని ఇంకో సమాచారం ప్రతి ఎండాకాలం లో.
మరలా అన్నటికీ మించి రాబోతున్న ఎలక్షన్ లు. ఓటు వచ్చి వేస్తారా లేక గుద్ది పోస్ట్ చేస్తారా అని రెండు వైపులా విజ్ఞప్తులు బెదిరింపులు. ఈయన రావద్దని వాళ్ళు, ఆయన రావద్దని వీళ్ళు, ఏంచేయాలో తెలియని అయోమయములో ప్రజలు.
దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు, మాకు సరిగ్గా సరిపోతుంది.
ఇప్పుడు చెప్పండి, విదేశం లో ఆ రాష్ట్రం పేరు? ప్రపంచంలో ప్రతి కంప్యూటర్ కీబోర్డ్, నొక్కే వాడి నోటిలో ఆ మాటే, ఆ పాటే, ఆ సాఫ్ట్వేరే.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,507; 104 తత్వాలు (Tatvaalu) and views 226,083 Dt : 09-Sep-2020, Upd Dt : 09-Sep-2020, Category : America
Views : 783
( + More Social Media views ), Id : 687 , State : CA , Country : USA
Tags :
sky ,
orange ,
planet ,
mars ,
power ,
hide ,
sun ,
ca ,
usa ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments