Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. మా దగ్గర ఆలయాలు కూడా మూసేస్తున్నారు, ఈ వైరస్ దెబ్బకు లేదా ప్రభుత్వ నిర్ణయాలు నియంత్రణ ల తో , అది కొంత బాధ గా ఉంది. మామూలు దేవుని సేవలు, దీప నైవేద్యాలు జరగాలి, లేదంటే తర్వాత అరిష్టము.
తక్కువ జనం మాత్రమే రావాలని చెప్పుకుంటే చాలు, ఎటూ మామూలు జనం రారు. దేవుని కంటే వైరస్ గొప్పది అని ఒప్పుకుంటే ఎలా?
ఏ మతమైనా, ఆలయాలు, కేవలం వ్యాపారం కోసం మాత్రమే, కొంత మంది పెద్దలు కలసి పెట్టారో లేదో ఇప్పుడు తెలుస్తుంది.
మీకు తెలుసు కదా, పేరుకు బాబా బొమ్మ పెట్టి గుడి కట్టి, హారతులు 4 చేయరు లేదా హారతి సమయం పాటించరు, కొంతమంది.
సాంప్రదాయ గుడి మూయకూడదు. తిరుపతి, శ్రీశైలం ఆలయాలు తీసే ఉంటుంది, తక్కువ జనం తో అయినా.
మిగతా ఆలయాలలో తక్కువ జనాన్ని, రానీయవచ్చు లేదా రానీయకపోవచ్చు అక్కడ పరిస్తితులను బట్టి. కానీ ఆలయంలో దైవానికి, దీప నైవేద్యాలు, హారతులు ఆగకూడదు, పూజారులు తప్పనిసరిగా నిర్వర్తించాలి కదా.
చాలా ఆలయాలలో, పూజారులు అక్కడే పక్కన ఇళ్ళు లో, ఉంటున్నారు కదా. మరి దేవుని సేవలు అత్యవసరం కాదా?
మామూలు భక్తులు ఎటూ రారు. అయినా దేవాలయం పూర్తిగా ఆపారు అంటే కొంతమంది, రేపు మామూలు పరిస్థితి వచ్చాక కూడా, ఆ దేవాలయం కు వెళ్లడం అవసరమా? ఆలోచన చేయండి.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,091; 104 తత్వాలు (Tatvaalu) and views 226,134 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments