తానా, నాట్స్, అటా, ఏ తెలుగు సంఘము అయినా, సొంత అనుకూల వర్గ మీడియా కు మాత్రమే అండా? - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1795 General Articles and views 1,386,834; 93 తత్వాలు (Tatvaalu) and views 184,208.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఇంకా మన ప్రశ్నలకు జవాబులు రాలేదు వారి నుంచి, చూద్దాము ఇప్పుడు అయినా మారి అన్ని వర్గాల ఇతర చిన్న మీడియాను గౌరవిస్తారో లేక గాడ్ ఫాదర్ చెప్పలేదని ఆగుతారో చూద్దాము.

మనము లేదా మన మీడియా అమెరికా ప్రతినిధి, తానా, అటా, నాట్స్, మరి కొన్ని తెలుగు సంస్థల కార్యక్రమాల కు, మీడియా రిక్వెస్ట్ పంపి ఉన్నాము గతములో, ఇంకా ఈమైల్స్ ఉన్నాయి సాక్ష్యం గా మనతో. తెలుగు వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాము అని చెప్పే వీరు, ఒక్కరు కూడా తోటి తెలుగు వారిని గౌరవించి, ఒక్క మెస్సేజ్ కి కూడా జవాబు వెనక్కి పంపలేదు, వారి మీడియా ప్రతినిధి నుంచి.

తెలుగు సంస్థల కార్యక్రమాల కు, వచ్చినా రాకపోయినా, స్థానిక చిన్న పెద్ద బుల్లి తెలుగు మీడియా వారు, అందరికీ ఆహ్వానాలు పంపాలి, తారతమ్యాలు చూపకుండా.

కనీసం, మీరు మా అనుకుల మీడియా కాదు మా వర్గము కాదు అని లేదా రిజెక్ట్ చేస్తున్నాము అని, మర్యాద పూర్వక సమాధానము లేదు. అంటే, తమ వర్గ అనుకూల మీడియా కోసం ఎంత ధనమైనా తగలేసి, ఇండియా నుంచి తెస్తారు కాని, చిన్న ఇతర వర్గ తెలుగు పత్రికలు, ఆన్లైన్ మీడియా నిలబడటానికి అండగా ఉండరు, సహాయం చేయరు, తెలుగు చిన్నవారు ఎదగడానికి సహాయము చేయరు.

ఎందుకంటే, నాన్ ప్రాఫిట్ గా ప్రభుత్వ టాక్స్ మినహాయింపు లాభము పొందుతూ, ప్రజల నుంచి విరాళాలు వసూలు చేస్తూ, వీరు అటూ ఇటూ తిరిగే ప్రయాణాల మరియు సంబరాల ఖర్చులకు వాడుతూ, వీరు ఇలా వర్గాలు మీడియాలు చిన్న పెద్ద తేడాలు చూపకూడదు, దాపరికము, నిర్లక్ష్యము, అగౌరవము చేయకూడదు.

వారందరికీ మనము ఉచిత ఫోటోలు వీడియోలు చేసాము, రూపాయి తీసుకోలేదు. ఏ ఒక్క నాయకునితో తిరగలేదు, ఫోటో దిగలేదు, నిబద్దతగా ఉన్నాము ఇన్నాళ్ళు, అందరికీ దూరముగా ఉన్నాము. లో ప్రొఫైల్ గోప్యత పాటించాము.

వారు గత 11 ఏళ్ళుగా, ఎంత మందికి మీడియా పాస్ లు ఇచ్చారో, ఎంత మంది ని ఇండియా నుంచి తెచ్చారో, అసలు ఎందుకు తెచ్చారో, ఎంత ఖర్చు పెట్టారో, ఎంత మోసం జరిగిందో, అసలు ఓట్లు ఎవరు ఎందుకు ఎక్కడ నుంచి వేస్తున్నారో, మొత్తము అన్ని బయటకు వస్తాయి, అనుకూల వర్గ మీడియా ఖర్చులు బయటకు తీస్తే. నిబద్దత గలిగిన ఇతర వర్గ చిన్న తెలుగు మీడియాకు, మేము చేయూత ఇచ్చాము అని చెప్పగలరా?

అమెరికా తెలుగు సంస్థలు వారి ఖర్చు అండగా ఉండేది ఉండాల్సింది, తమ వారి వర్గ తెలుగు నేల రాజకీయ ప్రాబల్యం కోసం, ఇండియాలో ఉన్న వర్గ మీడియా సంస్థలకా? లేక అమెరికా లోని మీడియా సంస్థలు లేదా చిన్న ఆన్లైన్ మీడియా బ్లాగర్ లకా?

మనకు మన వారికి, పెద్ద పెద్ద సంస్థలే, ఉదాహరణకు, అమెరికా డెమొక్రాటిక్ పార్టీ కూడా, మీడియా పాస్ ఇచ్చింది, మీరు ఫోటొలు వెబ్సైట్ లో సాక్ష్యం చూడవచ్చు, ఇలాంటి కార్యక్రమములు బోలెడు చూడవచ్చు పాతవి మరియు ఇప్పటివి. link.

అమెరికా నాయకులు, చిన్నవి 100 మంది ఉన్న చూసే మీడియా అయినా, ఆఖరుకు బ్లాగరు అయినా, తిరస్కరించరు, గౌరవిస్తారు. అన్ని అక్కడ సౌకర్యాలు అనుభవిస్తూ, మన తెలుగు సంఘాల నాయకుల చిన్న బుద్దులు మారవు, తమ వర్గ, అనుకూల వారి సేవలో, కళ్ళు మూసుకుని పోయి ఉన్నప్పుడు.

అమెరికాలో డిస్క్రిమినేషన్ (వర్ణ, మైనారిటి, అదే తెలుగు భాషా సంస్థ పత్రిక, చిన్న పెద్ద తన మన) ఉండకూడదు. ఇప్పుడు మేము, తేడా చూపించారు అని, దాని తో పాటుగా, వీళ్ళు అందరూ చేస్తున్న పనులు ఆరోపణలు, ఫోటో సాక్షులు గా పెట్టి, తగిన విధముగా మాటలు రాస్తే, ఒక్క తెలుగు సంఘము మిగిలి ఉండదు, ఏమో? మొత్తము మూత పడతాయి లేదా, నష్ట పరిహారం కట్టాలి లేదా చిన్న ఇతర వర్గ మీడియాను నిర్లక్ష్యము చేయలేదని, నిరూపించాలి. ఎటు చూసినా తలనొప్పే.

వీళ్ళ ముఠాల కు ఉన్న సమస్యలు గాక, ఇది కొత్త పెద్ద సమస్యగా వస్తుంది, అన్ని తెలుగు సంఘాలకు.

కాని మన ఉద్దేశ్యం వారిని ఇబ్బంది పెట్టడము కాదు, ధనము కాదు, అసలు అమెరికా వైపు చూపు వద్దు, గొడవ వద్దు. అక్కడ అధికారులకు ఇలాగే పంపితే పూర్తి వివరాలు, తగ్గ సప్పోర్ట్ మాటలతో, ఫలితాలు అందరికీ తెలుసు.

కేవలము ఆంధ్రా పరిధిలో సమస్యలు చంద్రన్న, జగనన్న, పవనన్న, వీరన్న క్షేమమే వరకు ఆగుదాము. కానీ, వీళ్ళు ఇప్పుడు అయినా, తప్పులు అందరమూ చేస్తాము, జరిగింది జరిగిపోయింది, ఇక తప్పులు సరి చేసుకుని, ఇక నుంచి మంచి గా విలువలు గా, గౌరవముగా ఉందాము అంటే చాలు.

ఇది ఒక్క తానా నే కాదు, నాట్స్, అటా, ఏ ఇతర స్థానిక చిన్న తెలుగు సంఘము అయినా కూడా ఒకటే పద్దతి. తానాలో గొడవలు ఉన్నాయి, మిగతా వాటిలో లేవు అనుకోవద్దు. ఏకగ్రీవం అంటే తెలుసు కదా, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడము తో సమానం.

అంటే, మా వాడికి ఈ పదవి, 2 ఏళ్ళు ఇవ్వు. తర్వాత మీ వాడికి ఈ పదవి 2 ఏళ్ళు ఇచ్చుకో, మేము నోరు ఎత్తము మీరు నోరు ఎత్తవద్దు. మా వారికి ధనము పంచుకుందాము, తర్వాత మీ వారు. మన తెలుగు కుళ్ళు అవకాశ అవసర వర్గ ధన రాజకీయ పద్దతే, ఎక్కడ అయినా.

మీ వారు లేదా మా వారు, అంతే గానీ ఇంకొకరు రాకూడదు. ఇంకొకరు నేరుగా ప్రెసిడెంట్ గా (ట్రంప్ లాగా నేరుగా రావాలన్నా, అమెరికా రాజ్యాంగము ఒప్పుకున్నా), అత్యంత తెలివైన నమ్మదగిన, మన తెలుగు సంస్థల సొంత రాజ్యాంగము మాత్రము, చచ్చినా కూడా దీనికి ఒప్పుకోదు. కనీసము కొన్ని ఏళ్ళు కింద పదవుల్లో, వారికి బానిసత్వం చేసి, ఆ తరువాత నే, పై పదవికి పోటీ గా నిలువు అంటారు, అని పలువురూ అభిప్రాయ పడుతున్నారు.

మొత్తము గుట్లు తెలుసు, వారి అన్ని ఈవెంట్లకు వెళ్ళాము. మనము ఒకరి గోతులు ఒకరు తీసుకోకూడదు, ఒకరి చెయ్యి పట్టుకుని ఇంకొకరము, పైకి నీతి గా ఎదగాలి మిత్రులారా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1795 General Articles and views 1,386,834; 93 తత్వాలు (Tatvaalu) and views 184,208
Dt : 02-Apr-2021, Upd Dt : 02-Apr-2021, Category : America
Views : 639 ( + More Social Media views ), Id : 1068 , Country : USA
Tags : tana , nats , ata , telugu , community , supports , own class , supported media

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content