ఆపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్, స్టాన్ ఫోర్డ్ లో చేసిన ప్రసంగం, 7 మైళ్ళు నడచి హరే కృష్ణ ఆలయం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,951; 104 తత్వాలు (Tatvaalu) and views 226,217.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఇస్కాన్ వారి ప్రధాన మందిరం అమెరికా వెస్ట్ వర్జీనియా లో ఉంది. చాలా మంది, అమెరికన్లు హైందవ మత ఆచారము స్వచ్ఛంద గా తీసుకుని, భజన కార్యక్రమంలో పాల్గొంటారు.

వీడియో లో వారిని చూడవచ్చు, గోశాల ఉంది, ఒకరోజు అక్కడ ఉండాలి అన్నా కూడా, సౌకర్యాలు ఉన్నాయి. భజనలు నృత్యాలు తో, ఉంటాయి చూడండి.

దాదాపుగా భారతీయులు కనీసం ఒకసారైనా సందర్శించడం చేస్తారు. చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఆపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్, స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో చేసిన ప్రసంగం లో చెప్పిన మాటలు ఇవి - గతంలో నేను ప్రతి ఆదివారం, 7 మైళ్ళు నడచి ఊరి దగ్గరలో ఉన్న, హరే కృష్ణ ఆలయం దగ్గరకు వెళ్ళేవాడిని, మంచి భోజనం కోసం, నాకెంతో ఇష్టం అది.

గూగుల్ లో వెతికినా ఇది కనపడుతుంది. ఈ ఆలయం శాన్ ఫ్రాన్సిస్కో లోది అనుకుంటా. ఇందులో మనకు, కొన్ని మంచి మాటలు ఉన్నాయి, మనసు తో గమనిస్తే మాత్రమే.

1. జీవుడి ఆకలి కి, ప్రసాదం కు, భోజనం కు, మతం కులం వర్గ బేధం ఉండదు. ఏ మతమైనా చెప్పేది మంచే, కానీ అందులో కొంతమంది విపరీత అర్ధము తీసి, పెడ అర్ధం చెప్పి, సామాన్య జనం ను తప్పు దోవ పట్టిస్తారు. మనం భ్రమలలో, మాయలో, అవసరం లో ఉంటే, వారి చేతిలో పడతాము, అంతా నిజమేను అనుకుని.

ఇప్పుడు మనం దేవుని ప్రార్ధన, మంచి మనసు తో చేస్తే, నారాయణుడు పలుకుతారు. ఇతర మత దైవం లేదా గురువు లేదా ప్రవక్తలు మాత్రం పలకరా? వారూ పలుకుతారు, ఆదరిస్తారు, ప్రేమిస్తారు. మనకు బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఇరుగుపొరుగు ఉంటే ఆదరించమా? గురువులు, దైవం, ప్రవక్తలు, మంచి మనుషులు అంతా ఒక్కటే.

మరి ఇప్పుడు కరోనా సమయంలో, వీరంతా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఉండేది, మన హృదయంలో నే, మంచి మార్గం చూపుతూ. అందుకే ఇష్టమైన దైవాన్ని మనలోనే మరియు మన పక్కన వారి లోనే చూడాలి. ఒకరినొకరు గౌరవం తో సహాయం చేసుకుంటూ ఉండాలి. అంతే కానీ దేవుడిని చూడాల్సింది వెతకాల్సింది, బయట ఎక్కడో, నాలుగు గోడల మధ్య కాదు.

అందరం దేవుని పుత్రులం. అందరికి ఆకలి అవుతుంది, అందరికీ రక్తం ఎర్రగానే ఉంటుంది. జబ్బు చేస్తే, ఏ డాక్టర్ దగ్గరకు అయినా వెళతాం. కరోనా సమయంలో, మన అందరికీ సేవ చేస్తున్న, అందరూ అధికారులు, అన్ని వర్గాలకు చెందిన వారే కదా.

ఇవి మన దగ్గర, అవకాశవాదం అవసరము కోసం మనం కావాలని, కల్పించుకుంటున్న అడ్డు గోడలు. జనాన్ని విడగొడటానికి మాత్రమే పనికి వస్తాయి. దేశ పరంగా, రాష్ట్ర పరంగా, భాష పరంగా, కుల ఉపకుల మత వర్గ పార్టీ పరంగా, అబ్బో వంద మార్గాలు విడగొడటానికి ఉన్నాయి.

2. రెండవది 7 మైళ్ళు, ఆయన నడిచారు. మనం కనీసం ఒక మైలు నడిచే, ఓపిక తీరిక ఉన్నాయా మనకు? కరోనా సమయంలో కూడా, ఇక్కడ దగ్గర పార్కు ల లో, నడిచే అవకాశం ఉంది. మన పేటలో కూడా, మన బజారు లో ఉదయం పూట కొంతమంది నడుస్తున్నారు. కానీ ఎక్కువ మందిమి నడవము. కరోనా సడలింపు తర్వాత, కొంత దూరం అయినా ఉదయ నడక మంచిది, అన్ని రోగాలకు.

మన అందరం ఒకటే, తల్లి దండ్రులును, ఇరుగు పొరుగు ను, ప్రజలను, ఇతర జంతు జీవులను ప్రేమిద్దాం గౌరవిద్దాం.

Steve Jobs, the co-founder and former CEO of the Apple Corporation. In his speech at Stanford University in 2005 - I would walk the 7 miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple. I loved it, said Steve Jobs.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,951; 104 తత్వాలు (Tatvaalu) and views 226,217
Dt : 30-Apr-2020, Upd Dt : 30-Apr-2020, Category : General
Views : 917 ( + More Social Media views ), Id : 524 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : steve jobs , apple ceo speech , stanford , 7 miles walk , hare krishna temple
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content