చిన్న ఊరుకు చిన్న సమస్యలు, పెద్ద నగరానికి? వైజాగ్ రాంక్, ఎన్నికలు, స్టీల్ ప్లాంట్, బంద్ - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1097 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1125 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

ఇంత నిజాయితీగా ఏ పార్టీ పత్రిక రాయదు, తమ వారిని తప్ప, అవతల పార్టీని మాత్రమే విమర్శలు చేస్తూ రాస్తారు. మనము జగనన్న, చంద్రన్న, వీరన్న, పవనన్న అందరి క్షేమం కావాలి, అందరికీ విమర్శలు అభినందనలు సమానముగా.

ఎంత చెట్టుకు అంత గాలి అంటారు, పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి. చిన్న ఊరుకు చిన్న సమస్యలు, పెద్ద నగరానికి పెద్ద బాధలు.

మన ప్రాంతానికి జిల్లా ఇస్తే చాలు, చేనేత పార్క్ ఇస్తే చాలు, ఫిషింగ్ హార్బర్ ఇస్తే చాలు అని మన అల్ప సంతోషం. వార్డులు వారీగా రెబెల్ కాండిడేట్లను నిలిపి, ఆమంచి మరియు కరణం, ఎవరి గేం వారు ఆడుతున్నారు. జిల్లా రాకపోతే, జనం వీరిని, హీనం గా చూస్తారని, భవిష్యత్ లో అభివ్రుద్ది గురించి, చెప్పుకోవడానికి ఏమీ ఉండదు అని కూడా వీరి భయం. వాటితో పాటు ఈ ఎన్నికలు ఓ కొత్త తలనొప్పి, కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.

ఎన్నికలు అయ్యాక అన్ని పన్నులు పెరగడానికి సిద్దం అని చంద్రన్న అంటున్నారు, గతము లో కూడా తెదేపా ప్రభుత్వం లో అదే పని జరిగింది కదా. వచ్చే మే నాటికి, రద్దు చేసిన మండలిలో, వైయస్ఆర్ సీపీకి ఆధిక్యం వస్తుంది అని వీరు ఆనందముగా ఉన్నారు.

ఇప్పుడు వైజాగ్ సంగతి మాట్లాడుదాం. పెద్ద నగరానికి పెద్ద కష్టాలు. దేశం లో మంచి గా నివసించగలిగిన పట్టణాలలో 9 వ రాంక్ పొందింది. హైదరాబాద్ కి 24 వ రాంక్ వచ్చింది, మొన్న వరదల దెబ్బకి ఏమో మరి.

రాజధాని వద్దు కొత్త భూ కబ్జాలు వద్దు శని గ్రహం బాధ వద్దు బాబోయి అని ఓ వర్గం. చంద్రన్న, లోకెష్, అచ్చెమ్నాయుడు, రామ్మోహన్ తదితరులు కష్టపడుతూ, తెదేపా తమ్ముళ్ళను ఉత్సాహపరుస్తున్నారు. నిన్నటిదాకా ఎటు దూకుతారో ఏ పార్టీలో ఉన్నారో తెలియని గంటా కూడ, ప్రస్తుతానికి చంద్రన్న తో కలిసారు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఓడిపోతే, ఉత్తరాంధ్ర తెదేపా తమ్ముళ్ళకు నాయకులకు కష్టం. సీపీయెం తో పొత్తు కుదిరింది. అవసరాన్ని బట్టి మిగతా వారి సహాయం తీసుకుంటున్నారు ఎలాగైనా వైసీపీని అడ్డుకోవాలని.

ఉన్న కబ్జాలు వదిలిస్తాం, రాష్ట్ర రాజధాని గా చేసి పాలిస్తాం, ఇక్కడే అందరము అందుబాటులో ఉంటాము, ఇంకా ఎక్కువ గుర్తింపు తెస్తాం అని ఇంకో వర్గ నినాదాలతో మారు మోగుతుంది. అన్ని తానై, వైసీపీ విజయ్ సాయి, ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గెలుపు లో తేడా వస్తే, ఆయన పరిస్థితి కష్టం.

అన్ని పార్టీలు, పార్లమెంట్ లో అస్సెంబ్లీ లో రాజీనామాలు చేసి ధర్నాలు చేయకుండా, ఎప్పటిలాగే తమ నాటకాలను కొనసాగిస్తూ కార్మికులను ప్రజలను మభ్యపెడుతూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను కొనసాగిస్తున్నారు. నిన్న బంద్ కూడా చేసారు గా. అదొక పెద్ద తల నొప్పి అయ్యింది నాయకులు అందరికీ.

నిన్న, ఒక వ్యక్తి విజయ్ సాయి ని అడిగారు, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు కదా అని, రాజీనామాలు ఎందుకు చేయరు అని. సాయి, అసహనము గా జవాబు ఇచ్చారు.

బీజేపీ తరపున మాధవ్, జీవీయెల్, వీరన్న విస్త్రుతము గా పర్యటిస్తూ, కేంద్రం ఇన్ని పధకాలు అభివ్రుద్ది ఇస్తే, మాకు ఎందుకు ఓట్లు వేయరు అని, అభివ్రుద్ది గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు.

జనసేన నాయకులు కూడా, తమ పట్టు నిరూపించుకోవడానికి విస్త్రుతము గా పర్యటిస్తున్నారు. పవన్ పర్యటన కూడా 8 లోపు ఉంటుంది అంటున్నారు.

మరి వైజాగ్ ఓటర్లు, జగనన్న ను గెలిపిస్తారో చంద్రన్న ను గెలిపిస్తారో ఇక్కడ అని అందరూ ఉత్కంఠముగా ఎదురు చూస్తున్నారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1125 General Articles, 47 Tatvaalu
Dt : 05-Mar-2021, Upd Dt : 05-Mar-2021, Category : Politics
Views : 118 ( + More Social Media views ), Id : 1005 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : small , problems , town , big city , vizag , rank , elections , steel , plant , bandh , political , campaign , vijay sai , chandranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content