Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. సంసారం ఒక సాగరం, అందులోకి ఒక సారి దూకిన వారు, మరలా వెనక్కి రాలేరు అంటారు పెద్దలు. ఉమ్మడి కుటుంబాల నుంచి, ఒంటరి కుటుంబాలకు వచ్చినా కూడా, స్వార్ధం పెరిగిపోయి, జీవిత భాగస్వాములు కుమ్ములాడుకుంటూ, సంపాదన మోహములో ఆనందాల మత్తులో, పిల్లల సంస్కార పెంపకాన్ని గాలికి వదిలేస్తున్నారు.
దాని పర్యవసానాలు రోజూ పేపర్లో చూస్తున్నాము. ఈ రోజు ఇంకొకరి పిల్లలు లేదా కుటుంబం పతనం, ఏదో ఒకరోజు అది అలా వ్యాపిస్తూ, మన ఇంటికీ చేరుతుంది కదా?
1987 లో వచ్చిన ఈ చలన చిత్రం, మన కుటుంబాలలో జరిగే స్వార్ధపు తగువులు, తన్నులాటలను ప్రత్యక్షముగా చూపింది, ఆ ఇబ్బందులు అన్ని, ఈ ఒక్క పాటలో నే మొత్తము కళ్ళకు కట్టినట్లు చెప్పేసింది.
తల్లినీ తాళినీ, డబ్బుతో తూచు బేరం, రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం. అంతే కదా, పెళ్ళి చేసుకోవడానికి ధనం ఆస్తి వీసా హోదా ఉండాలి. చాకిరీ చేసే వయస్సు అయిపోతే, అమ్మ అయ్య మన ఇంట్లో వద్దు. చిన్నప్పుడు అమ్మ నాది నాది అని పోట్లాడుకున్న వారంతా, ముదుసలి వయసులో, అమ్మ నీది నీది, లేదా అశ్రమము ది అంటున్నారు, వారి కుసంస్కార పెంపక ఫలితము లాగా.
ధనమే తల్లి, ధనమే తండ్రి, ధనమే దైవం అయిపోయింది 80 శాతం మందికి. ఇక పంతాలు పట్టిపులు స్వార్ధానికి చెప్పనలవి కాదు.
కాలిలో ముల్లుకీ కంట నీరిచ్చు కన్ను, కంటిలో నలుసునీ కంట కనిపెట్టు చెల్లీ, అంటే ఎవరు వింటున్నారు? మంచి వారికి ఎన్నో ఇబ్బందులు తప్పవు, అన్ని మెలుకువతో ఎదుర్కోవాలి. లేదంటే పతనమే.
కౌగిలే కాపురం కాదులే పిచ్చి తల్లీ, మల్లెల మంచమే మందిరం కాదు చెల్లీ, అంటే వినేవారు ఉన్నారా? తేనెతో దాహము తీర్చదేనాడు పెళ్లి, త్యాగమే ఊపిరై ఆడదయ్యేను తల్లి అంటే నమ్ముతారా? కామానికి దాసోహం, కారాదే సంసారం అంటే, వినే నాధుడు ఉన్నారా?
నింగికే నిచ్చెన వేసుకుంటుంది బాల్యం, తారలపై కోరిక తప్పురా చిట్టి నేస్తం అంటే, పిల్లలు వినే స్తితిలో మనము పెంచుతున్నామా? రెక్కలే రానిదే ఎగరనేలేదు భ్రమరం, అంటే అనుభవము ముందుచూపు లేకుండా, మంచి దోవలో వెళ్ళ లేము అని యువకులు ఎప్పుడు తెలుసుకుంటారు?
ఎప్పుడు పెద్దలను గౌరవించి వారి మాటలు వింటారు? మరి ఇలాంటి వ్యక్తులు అందరూ, ఒకే కుటుంబములో ఉంటే, ఆ ఇల్లు రావణ కాష్టం గా ఉండదా? మనశ్శాంతి ఉంటుందా? మరి పాట విందామా, పాడుకుందామా?
సంసారం.., ఒక చదరంగం..
అనుబంధం.., ఒక రణరంగం..
స్వార్ధాల మత్తులో..
సాగేటి ఆటలో..
ఆవేశాలు..ఋణపాశాలు...తెంచే వేళలో.. ||సంసారం||
గుండెలే..,బండగా..,మారిపోయేటి స్వార్ధం
తల్లినీ.., తాళినీ.., డబ్బుతో తూచు బేరం
రక్తమే..,నీరుగా.., తెల్లబోయేటి పంతం
కంటికీ..మంటికీ..ఏకధారైన శోకం
తలపై విధి గీత..
ఇల పైనే వెలసిందా?
రాజులే.., బంటుగా.., మారు ఈ క్రీడలో..
జీవులే.. పావులైపోవు, ఈ కేళిలో
ధనమే తల్లి.., ధనమే తండ్రి..
ధనమే దైవమా..!!?? ||సంసారం||
కాలిలో..,ముల్లుకీ.., కంట నీరిచ్చు కన్ను
కంటిలో..,నలుసునీ..,కంట కనిపెట్టు చెల్లీ!
రేఖలు..,గీతలు..,చూడదీ రక్తబంధం,
ఏ పగా.., చాలదు.., ఆపగా ప్రేమ పాశం!!
గదిలో ఇమిడేనా.., మది లో.పల మమకారం??
పుణ్యమే..పాపమై..,సాగు ఈ.. పోరులో..,
పాపకే.., పాలు కరువైన పట్టింపులో..
ఏ దై.వాలు, కాదంటాయి, ఎదలో ప్రేమని
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక రణరంగం..
ప్రాణాలు తీసినా..
పాశాలు తీరునా...
అదుపు లేదు.., ఆజ్ఞ లేదు..,మమకారాలలో!!
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక రణరంగం
కౌగిలే.. కాపురం..,కాదులే పిచ్చి తల్లీ,
మల్లెల.. మంచమే..,మందిరం కాదు చెల్లీ,
తేనెతో.. దాహము.. తీర్చదేనాడు పెళ్లి
త్యాగమే.. ఊపిరై.. ఆడదయ్యేను తల్లి
కామానికి దాసోహం.., కారాదే సంసారం!
కాచుకో.. భర్తనే.. కంటి పాపాయిగా,
నేర్చుకో.. ప్రేమనే.. చంటి పాపాయిగా,
మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి!
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక గుణపాఠం
ప్రేమే సంసారము.. ప్రేమే వేదాంతము
వయసు కాదు.. వాంఛా కాదు.. మనసే జీవితం
సంసారం ఒక చదరంగం...
అనుబంధం ఒక గుణపాఠం
చుక్కలు.. జాబిలి..,చూసి నవ్వేది కావ్యం
నింగికే.. నిచ్చెన..,వేసుకుంటుంది బాల్యం
తారపై.. కోరిక.. తప్పురా చిట్టి నేస్తం
రెక్కలే.. రానిదే.. ఎగరనేలేదు భ్రమరం
వినరా ఓ సుమతీ..పోరాదు ఉన్న మతి!!
పాత పాఠాలనే దిద్దుకో ముందుగా
నేర్చుకో కొత్త పాఠాలనే ముద్దుగా
నిను పెంచేది..
గెలిపించేది.. చదువే నాయనా!!
సంసారం ఒక చదరంగం...
చెరిగిందా నీ చిరు స్వప్నం
ఈ గాలి వానలో..ఈ మేఘ మాలలో
ఉరిమే మబ్బు.. మెరిసే
బొమ్మ.. చెరిపే వేళలో
సంసారం ఒక చదరంగం...
చెరిగిందా నీ చిరుస్వప్నం
మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.
Samsaram Oka Chadarangam - game of selfishness - Sarath Babu, Suhasini, Janaki, Gollapudi
Samsaram Oka Chadarangam Story Visu; Stars - Sarath Babu, Suhasini, Shavukaru Janaki, Gollapudi Maruthi Rao, Annapurna, Rajendra Prasad, Muchcherla Aruna
కథ విసు; చిత్రానువాదం విసు; తారాగణం శరత్ బాబు, సుహాసిని, షావుకారు జానకి, గొల్లపూడి మారుతీరావు,అన్నపూర్ణ,రాజేంద్ర ప్రసాద్,ముచ్చెర్ల అరుణ
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,785; 104 తత్వాలు (Tatvaalu) and views 226,199 Dt : 01-Nov-2022, Upd Dt : 01-Nov-2022, Category : Songs
Views : 391
( + More Social Media views ), Id : 1604 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
samsaram ,
chadarangam ,
game ,
selfishness ,
sarathbabu ,
suhasini ,
janaki ,
gollapudi Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments