రావణుని చంపుతూ ఉంటే, తమ్ముడు విభూషణుడు గమ్ముగా ఉండవచ్చునా? బంధాల విలువ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,626; 104 తత్వాలు (Tatvaalu) and views 226,174.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మీలో ఒకరి ప్రశ్న, రామయ్య తండ్రి, రాక్షసుడైన తన సొంత అన్న రావణుని చంపుతూ ఉంటే, తమ్ముడు విభూషణుడు గమ్ముగా ఉండవచ్చునా? సొంత తల్లి బిడ్డలు, అన్న దమ్ముడు అని, కనికరం జాలి ఉండదా? ఆపవచ్చు గదా? బంధాల విలువ తెలీదా?

జవాబు - పెద్దల అయిన మీరు ఇందులో తప్పు ఉంటే, సరి చేయ వచ్చు, అందుకే మిమ్మల్ని గురువులు అంటుంది, నేను ఎప్పటికీ శిష్యుడనే. కానీ మన సనాతన ధర్మాన్ని పదిమంది కి చేర్చాలని, అందరికీ తేలిక పదాలలో చెప్పాలని మాత్రమే, ఉబలాటం కర్తవ్యం బాధ్యత.

ఇతరులు, వీధులు తిరుగుతూ, ప్రతి ఇంటికి వచ్చి తలుపు తట్టి, ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని మా సాంప్రదాయాన్ని, జీవితంలో ఈ ఒక్కసారికి నమ్మండి, మీ సనాతన సంస్కారాన్ని సాంప్రదాయాన్ని గాలికి వదిలేయండి, అని చెపుతున్నారు కదా. వారిని అలా పబ్లిసిటీ ఇవ్వవద్దు, అని గట్టిగా చెపుతున్నామా?

మన వాళ్ళుకు మాత్రమే, మరచిన మన సాంప్రదాయం బాధ్యతలను పాటిస్తూ గుర్తు చేస్తే, ప్రచారం చేస్తే, మాత్రం తప్పా? అబ్బో పబ్లిసిటీ అని, గేళి చేస్తున్నారు. తర్వాత, ఎటూ ఇబ్బందులు పడతారు, అది వేరే విషయము.

తమ మరియు పిల్లల ఇళ్ళ ఇతర విషయాలు ఫోటోలు వీడియోలు, సోషల్ మీడియాలో పెడుతూ కూడా అలాగే అంటారు. తాము హైందవానికి, మంచి చేయరు, పాటించరు, ఇతరులని చేయనివ్వరు, అలాగే ప్రోత్సహించరు.

అన్ని మనకు తెలుసు అని కాదు, పెద్దలు గురువులు అయిన మీరు, ఇంకా జ్ఞానాన్ని ఇస్తారు అని నమ్మకం. తప్పు సరి చేయకపోతే, మీదే తప్పు అవుతుంది సుమా, మన ఇంట్లో అయినా కూడా అంతే కదా.

ఇప్పుడు, జవాబు కు వద్దాం. ఇలాంటి ప్రశ్నలే, ఎక్కువగా రజో మరియు తమో గుణం వారు వేస్తారు. వారు వెనుక ముందు, మొత్తము అవగాహన మరియు ఆలోచన చేయరు. ఆ ఒక్క ముక్క వరకే పట్టుకుని, వితండ వాదం చేస్తారు. రామాయణం మీద, వింత వాదాలు చేస్తారు, పుస్తకాలు రాస్తారు.

మొదట, ధర్మం మరియు అధర్మం ముఖ్యం, ఆ తర్వాతనే బంధాల విలువ, ఆ కాలములో. ఇక బంధాల విషయానికి వద్దాము. ఇప్పుడు మాత్రం, అవసరాలకు తప్ప, బంధాలకు విలువ ఉందా?

అన్న రావణుడి తప్పులకు, తమ్ముడు కుంభకర్ణుని కి, అసలు సంబంధము ఉందా? లేదు. తాను, 6 నెలలు హాయిగా, కడుపు నిండా తిని పడుకోవడమే, తన పని. రాక్షస ప్రవ్రుత్తి తప్ప, ఎప్పుడూ రాముడి జోలికి వెళ్ళ లేదు. కేవలం, తిండి పెట్టి మేపి, మోహం లో ఉన్న, అధర్మ అన్న మాటకోసం, యుద్దానికి వెళ్ళాడు.

మరి యుద్దములో, రాముని చేతిలో తమ్ముడు చని పోతుంటే, రావణుడు వచ్చి, సొంత తమ్మునిని కాపాడాడా? లేదు కదా. మరి దాన్ని తప్పు గా చెప్పరా? చావనీయ్, అని వదిలేసాడు. ఇది, న్యాయమా? అదేమంటే, యుద్ద నీతి అంటాము కదా.

సొంత కొడుకు మేఘనాధుని కి, కోడలికి, ఈ యుద్దము కు, సంబంధం ఉందా? లేదు కదా. కేవలం మోహపు తండ్రి మాటకోసం, అధర్మం వైపు ఉండి, అకాలపు చావు, కొని తెచ్చుకున్నాడు. రావణుడు వచ్చి, సొంత కొడుకు ని కాపాడాడా? లేదు కదా. చావనీయ్, అని గమ్మున ఉన్నాడు. కోడలి బొట్టు తుడిపింది, రావణుడు కాదా?

సైన్యం లో లక్ష లాది మంది, మగవారు చనిపోతే, రావణుడు, పాపం అన్నారా? లేదే? ఎంత మంది బొట్ట్లు తుడిపాడు, కన్నీళ్ళు తెచ్చాడు?

అంటే, తన, సౌఖ్యం సంతోషము కోసం, ఎంత మంది జీవితాలనైనా, కష్టాల లోకి నెట్టి, కాల రాశాడు. తన, పర, బేధం లేదు.

ఇప్పటికీ, ఎక్కువ మంది రాజకీయ నాయకులు మరియు మన వెంట చుట్టూ ఉన్న స్వార్ధపు మనుషులు, అంతే కదా? తమ సౌఖ్యం కోసం, ఎంతమంది కైనా, కన్నీరు తెప్పిస్తారు.

కాబట్టి, ధర్మం వైపు ఉండి, తప్పుడు వాడైన, పరాయి వస్తువుని అపరించిన, సొంత అన్న దగ్గర, ఉండాల్సిన పని లేదు. చంపడం ఆపమని కోర కూడదు, కోరితే మరలా అదే తప్పులో, తనూ భాగం అయ్యినట్లే కదా. అన్న బతికితే, ఇంకొంత మంది, కన్నీళ్ళు కారుస్తారు, జీవితాలు పాడు చేస్తాడు.

పాపం పండిన, పాపాత్ముల తప్పులకు, దేవుడు శిక్ష వేసేటప్పుడు, మనం గమ్ముగానే ఉండాలి. ఆ పాపం లో భాగం కారాదు.

అదే పరాయి వారైనా కూడా, పుణ్యాత్ములకు, శిక్ష వేస్తుంటే, వీలైనంత కాపాడాలి, మనకు శక్తి అధికారం ఉంటే. సాత్వికులకే, ఈ ధర్మ సూక్షాలు అర్ధము అవుతాయి. దెబ్బ తగిలాక, అందరికీ అర్ధము అవుతాయి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,626; 104 తత్వాలు (Tatvaalu) and views 226,174
Dt : 07-Dec-2020, Upd Dt : 07-Dec-2020, Category : General
Views : 768 ( + More Social Media views ), Id : 845 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rama , killing , ravana , brother , vibhishan , quite calm , relation value
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content