APLatestNews.com top Banner

Social Media links
ప్రదక్షిణ - భూమి ఆత్మ ప్రదక్షిణ మరియు సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 920 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ప్రదక్షిణంలో, ప్ర అనే అక్షరము పాపాలకి నాశనము, ద అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, ణ అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో, ఇంత అర్థం ఉంది అర్దమైంది కదూ.

పూర్వం వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి, విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణము, విశ్వ ప్రదక్షిణమవుతుంది కదా. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది కూడా. భగవంతుడా! నేను అన్నీ వైపుల నుంచి, నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం వస్తుంది కదూ.

భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది తెలియకపోయినా, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఉన్న మరుక్షణం ఏ విపత్తు అయినా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు.

అలాగే సూర్యుని చుట్టూ కూడా, భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది. అలాగే చీకటి వెలుగులు కూడా వస్తున్నాయి.

ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని, దేవుని నుంచి పొందుతారు. ఇలా మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది.. తద్వారా మనిషికి ప్రశాంతత, జ్ఞానం పెరుగుతాయని అంటారు. గుడిలో లేదా విగ్రహాల కింది ఉన్న మంత్రించిన రాగి రేకుల నుంచి పాజిటివ్ కిరణాలు మన మీద పడి, ఆత్మ విశ్వాసాన్ని దైవ బలాన్ని పెంపొదిస్తాయి.

గుడికి వెళ్ళిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం - ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. ప్రదక్షిణ ఎన్నిసార్లు చేయాలి అనే విషయంపై ఖచ్చితమైన నిర్ణయం ఎవ్వరూ చేయలేదు.

ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో మాత్రమే వుంటాయి. 3,5,11, . . . ,108 ఇలా అన్నమాట! మంచి రక్షణతో అనువైన శుభప్రదమైన ప్రదేశములో, వ్యాయామము కూడా దైవ బలముతో. కరమాల తో 108 లెక్కించిన, వేళ్ళకు మైండ్ కు కూడా మంచిది. కొంతమంది జపమాల కూడా వాడుతారు.

ఏ దేవుడి గుడికి వెళితే, ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం లేదా మంత్రము పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయటం చాలా ముఖ్యం! ఇతర ఆలోచనలతో ప్రదక్షిణలు చేసినా ఒకటే, రోడ్డు మీద జాగింగ్ చేసినా ఒక్కటే! అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి, మనశ్శాంతి తో మనస్సుకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 948 General Articles, 46 Tatvaalu
Dt : 06-Dec-2019, Upd Dt : 06-Dec-2019, Category : Devotional
Views : 512 ( + More Social Media views ), Id : 243 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : pradikshana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content