ఇతర నాయకుల నాటకాలు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ధైర్యంగా అమిత్షాని కలసిన పవన్ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2135 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2170 General Articles and views 2,200,973; 104 తత్వాలు (Tatvaalu) and views 243,935.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని, గతము లో ఉద్యమాలు చేసి, 32 మంది దాకా ప్రాణ త్యాగాలు చేసి, విశాఖ ఉక్కు ఫాక్టరీని సాధించారు అని అంటున్నారు.

ఉద్యోగులు ఆవేదనతో ఉద్యమాలు చేస్తారు, వారిని తప్పుపట్టడానికి ఏమీ లేదు.

మరి ఇప్పుడు కంటితుడుపు ఉద్యమాలు, ఉపయోగం లేని దూర లేఖలు, చెల్లని రాజీనామాల డ్రామాలు, విలువ లేని వారితో అధికారము పలుకుబడి లేని వారికి విన్నపాలు, అబ్బో ప్రతి పార్టీ నుంచి, ఎన్నో వింతలు విడ్డూరాలు నాటకాలు, మొదలు అయ్యాయి. ఇంకా కొనసాగిస్తారు.

ఇంకొకరు ఏమో, పర్లేదు, వేలాం పాటలో మేము కొనేస్తాము, ఏం పర్లేదు, ఇన్ని కోట్లు మా కుటుంబ పేర్ల పాలన పంచుడు పధకాలకు, అప్పులు ఇచ్చిన ఆ పెద్ద పిచ్చి వారు, ఈ చిన్న ఉక్కు కర్మా గారం కొంటాము అంటే, మనకు ధన భిక్ష ఇంకా వేయరా? అని ఇంకా జనాలను, మరీ పిచ్చి వారిగా చేసి మాట్లాడుతున్నారు.

వేలం పాట లేదా ప్రైవేటీకరణ అంటే, దేశం లోని, అన్ని పెద్ద సంస్థలు పొటీకి వస్తాయి. వాటి ముందు మన అప్పుల నాయకులు పోటీ పడగలరా? ఇన్నాళ్ళు 2017 నుంచి నష్టాలలో ఉంటే, ఎందుకు గనులు కేటాయించమని, గత మరియు ఇప్పటి ప్రభుత్వాలు అడగలేదు?

అసలు ఆ ప్రవేట్ కంపనీ వారికి, దగ్గర ఉండి ఇప్పించింది, వీరే నని, వారి వాదన. నిజము దేవుడి కి ఎరుక.

దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంస్థ, విశాఖపట్నంలో నెలకొల్పాలనుకున్న ప్లాంట్ కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో 2019 అక్టోబర్‌లో ఒప్పందం కుదుర్చుకుందని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నాడు ఒప్పందం కుదిరిన, వెంటనే పోస్కో సంస్థ ప్రతినిధుల బృందం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుసుకుందని, కేంద్ర మంత్రి పేర్కొన్నారు - Feb 10th update.

ఎందుకంటే, అభివ్రుద్ది చెందిన విశాఖ రాజధాని గా అన్న దగ్గర నుంచే, ఏవో కుట్రలు కుతంత్రాలు మొదలు అయ్యాయని, అక్కడి ఆస్తులు పరాధీనమని, ప్రజల మరియు ప్రతిపక్షాల సందేహము.

కాకపోతే, ఒక మంచి ఏమిటి అంటే, తెదేపా అక్రమాలు కూడా బయటకు రావడము. లేకపోతే, విశ్వ విద్యాలయము కూడా, ప్రభుత్వ స్థలము కబ్జా చేసి, క్రమబద్దీకరణకు కాగితము పెట్టడము ఏమిటి? మనము అలా చేస్తే, ఊరుకుంటారా?

ఇది, ఆపకపోతే, మొదటి నష్టము జగనన్న ప్రభుత్వానిదే, అధికారములో ఉన్న వారిదే మొదటి బాధ్యత, సలహాదారులు నిదానముగా ఉండి, తప్పుదోవ పట్టిస్తున్నారు. జగనన్న కు ఇది అగ్ని పరీక్ష.

ధైర్యముగా పశ్చిమ బెంగాల్ లేదా తెలంగాణా ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో, తమ రాష్ట్రము లో ఏదైనా ఇలా జరిగితే, తెలిసిందే కదా.

ఆ తర్వాత 2017 నుంచి గమ్ముగా ఉన్న, నేటి ప్రతిపక్ష నేత, అనుభవజ్ఞుడైన చంద్రన్నదే. రాష్ట్ర బీజేపీ నాయకులు గట్టిగా అడిగే వారు ఒకరూ లేరు.

ఎంపీలు పార్లమెంట్ జరుగుతూ ఉంటే ధర్నాలు, అరుపులు నిరసనలు, రాజీనామాలు లేవు. ఆసెంబ్లీని సమావేశ పరచి, కేంద్రానికి తీర్మానము లేదు. ప్రభుత్వ ప్రతి పక్ష నాయకులు, ప్రధానిని వ్యక్తిగతము గా కలవడం లేదు, లేఖలు సలహాలతో పంపడము తప్ప. మన సలహాలు ఎవరన్నా పాటిస్తున్నారా?

అఖిలపక్షము డిల్లీ వెళ్ళడము లేదు. ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయడం లేదు. ప్రత్యేక హోదాకు, జరిగిన నాటకాలే, ఇప్పుడు జరుగుతున్నాయి.

శభాష్ పవన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వెంటనే ఆఘమేఘాల మీద, 151 ఎమ్మెల్యేలు ఉన్న నాయకుడు లేదా ప్రతిపక్షంలో 23 ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రి నాయకుడు, ఎంపీలు ఉండి కూడా, హోం మంత్రిని కేంద్ర లో పలుకుబడి ఉన్న 2 వ పెద్ద మనిషిని, ధైర్యముతో ప్రయత్న లోపం లేకుండా కలవలేదు, కలిసే సాహసం చేయలేదు.

ఒక్క వెళ్ళిన ఎమ్మెల్యే తో, 2 చోట్ల ఓడి, పార్టీని ఓడించినా, గమ్ముగా సినిమాలు చేసుకోకుండా, తన మీద అవినీతి కోర్టు కేసులు లేవని, ధైర్యంగా న్యాయం కోసం ఢిల్లీ వెళ్ళారు. పని జరిగినా జరగకపోయినా, తన వంతు ప్రయత్నము తను చేసారు, డ్రామాలు లేకుండా, అని జనం ముక్కున వేలేసుకున్నారు.

అదే అమిత్షాకి లేదా మోదీకి, జగనన్న మరియు చంద్రన్న వ్యక్తి గతము గా కలసి, విన్నపము చేయవచ్చు, అధికారములో మరియు ప్రతి పక్షములో ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు అయినా, వ్యక్తిగతము గా కలుస్తారా? లేక మీన మేషాలు లెక్క పెడతారో చూడాలి మరి.

పవన్, మీ లాంటి వారు, మా తప్పుడు బానిస కుటుంబ పాలన ఆలోచన లకు నచ్చరు, మాకు వద్దు, గెలిపించము. మీకు ఏమి ఉన్నాయి, కుట్రలు మోసాలు వెన్నుపోటు చరిత్ర ఉందా? కేసులు ఉన్నాయా? జైలుకు వెళ్ళారా, అవినీతి కేసుల మీద? సూట్కేస్ కంపనీల వ్యాపారం, పక్క రాష్ట్రాలలో దేశాలలో ఉందా?

మామయ్యలు మరియు తండ్రులు, ప్రజల ధనముతో ప్రభుత్వ పధకాలకు పేర్లు పెట్టుకుని, స్వార్ధపూరిత కుటుంబ పరిపాలన చెసారా? ఇలాంటి ఏమీ అర్హత లేకుండా, మీ ధైర్యం ఏమిటి?

మాకు మీలాంటి నిజాయితీ పరులు, కొత్త వారు నచ్చరు, అందుకే బీజేపీని రానీయము. మంచి వారికి, మంచి నాయకులు కావాలి కానీ, మాకెందుకు? దయచేసి, మాకోసం, సమయం వ్రుధా వద్దు.

20 ఏళ్ళు గా గుంటూర్ ఆసుపత్రి చూట్టు తిరిగే, మంచి వైద్యానికి హైదరాబాద్ పోయే, ఇప్పుడున్న కాన రాని అభివ్రుద్ది చాలు.

మా నాయకులు, బయట రాష్ట్రాలలో మంచి చదువు వైద్యం పొందితే చాలు, అని వెటకారముగా కొందరు అంటున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2170 General Articles and views 2,200,973; 104 తత్వాలు (Tatvaalu) and views 243,935
Dt : 09-Feb-2021, Upd Dt : 09-Feb-2021, Category : Politics
Views : 1009 ( + More Social Media views ), Id : 967 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : plays , drama , games , political , leaders , visakha ukku andhrula hakku , pawan , amit shah , vijag steal plant issue
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content