మొండి జగమొండి - పైసా ఇవ్వక నే ప్రభుత్వాన్ని తెరిపించిన పెలోసి, 21 రోజుల తర్వాత చూడు అన్న ట్రంప్ - America/ NRI
           
     
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

Feb 15 update :

సరిహద్దు భద్రతా నిధులకు 1.3 బిలియన్ డాలర్లకు పైగా ఇచ్చిన ఖర్చు బిల్లుపై సంతకం చేస్తూ, జాతీయ అత్యవసరతను ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సరిహద్దు గోడకు అవసరమైనట్లుగా పేర్కొన్న $ 5.7 బిలియన్ల కంటే, తక్కువ సొమ్మును, కాంగ్రెస్స్ ఆమోదించింది.

ట్రంప్, శుక్రవారం(Feb 15, Fri) మధ్యాహ్నం బిల్లుపై సంతకం చేశారు. కనీసం అక్టోబర్ వరకు మరొక ప్రభుత్వ మూతను(shutdown) ను తొలగించించారు.

రోజ్ గార్డెన్లో మాట్లాడుతూ, అధ్యక్షుడు ట్రంప్, జాతీయ అత్యవసరతను ప్రకటించింది ఎందుకంటే, దేశంలో మాదక ద్రవ్యాలతో, మానవ అక్రమ రవాణాదారులతో, అన్ని రకాల నేరస్తులతో మరియు ముఠాలతో దాడులను ఎదురుకొనాలంటే ఇది తప్పనిసరి అని అన్నారు.

ఇది అన్యాయము, అనవసరము, కాంగ్రెస్స్ ప్రతినిధులను కాదని ఇలా చెయ్యడం తప్పు అని, కోర్టుకు వెళతాము అని, తమకున్న ఆప్షన్స్ తో ఢీకొన బోతున్న విపక్షం.

Feb 14 update :

ఇరుపక్షాల చర్చలతో, మధ్యేమార్గము గా, కొంత డబ్బును, గోడ కోసము ఇవ్వడానికి అంగీకరించారు. సరిహద్దు బిల్లు ను కాంగ్రెస్స్ లో ప్రవేశ పెట్టారు.

సరిహద్దు బిల్లుపై సంతకం చేస్తూ మరియు జాతీయ అత్యవసరతను ప్రకటించడానికి సిద్దమవుతున్న అధ్యక్షుడు ట్రంప్. ఎందుకంటే మిగతా డబ్బును కూడా సమీకరించాలి అంటే, అదొక్కటే తేలికైన మార్గము ప్రభుత్వాన్ని, మూయకుండా మరలా, జనాన్ని ఇబ్బంది పెట్టకుండా.

మీరు అలా చేస్తే కోర్టుకు వెళతాము అంటున్న విపక్షం, భవిష్యత్తు లో విపక్ష డెమోక్రట్ అధ్యక్షుడు కూడా ఇలాగే చేయల్సి వస్తుందని హెచ్చరించారు.

Original Story :

అమెరికా చరిత్రలోనే, అతి పెద్ద ప్రభుత్వ మూత ముగిసింది, గడచిన 35 రోజులు( డిసెంబర్ 22 నుంచి జనవరి 25, 2019). సరిహద్దు గోడ కట్టాలని అధ్యక్షుడు, దానికి పైసా కూడా ఇవ్వమని డెమోక్రాట్లు గత 5 వారాలుగా నిరంతర చర్చలు జరుగుతున్నాయి.

ప్రజలకు ఇబ్బంది కలగ కూడదు అని అంగీకరించి ప్రభుత్వాన్ని తెరిచారు. అలాగే 8 లక్షల ఫెడరల్/కేంద్ర ఉద్యోగులకు జీతాలు లేక ఇబ్బంది పడ్డారు. విమాన రాకపొకలకు ఇబ్బంది తగినంత సెక్యురిటి సిబ్బంది లేక, వారికి జీతాలు కట్టలేక. ఇంకా చాల చాలా ఇబ్బందులు వచ్చాయి.

డెమోక్రాట్ స్పీకర్ నాన్సి పెలోసి, గట్టిగా తన మాట మీద నిలబడి, ట్రంప్ ని ఎదుర్కోని, తను అనుకున్నది సాధించారు - సరిహద్దు గోడకు ,పైసా ఇవ్వకుండా ప్రభుత్వాన్ని తెరిపించారు. అంతేగాక కాంగ్రెస్స్ లో, సాంప్రదాయ అధ్యక్ష ప్రసంగాన్ని వాయిదా వేసారు.

జనవరి 25 న, అధ్యక్షులు ట్రంప్, మూడు వారాలపాటు ప్రభుత్వాన్ని పునఃప్రారంభించడానికి అంగీకరించి, ఖర్చు బిల్లును ఆమోదించడానికి అంగీకరించారు. రెండు పార్టీలు చర్చలు కొనసాగించడానికి అంగీకరించాయి . ఫిబ్రవరి 15 నాటికి, కాంగ్రెస్ లో ఇరు పార్టీలు, ఒప్పందంలోకి రాలేక పోయినట్లయితే, మళ్ళీ ప్రభుత్వాన్ని మూసివేస్తానని లేదా ప్రత్యేక హక్కును ప్రయోగించి జాతీయ అత్యవసరతను ప్రకటించి, గోడను నిర్మించడానికి సైనిక నిధులను ఉపయోగించుకుంటానని, అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.

21 రోజులూ త్వరగా అయిపొతాయి, మరలా నాకు పని పెట్టకుండా, గోడ పనికి నిధులు ఇవ్వండి త్వరగా తేల్చి. అన్ని విధాలుగా ప్రయత్నించాను, తర్వాత మీదే బాధ్యత అంటున్న అధ్యక్షులు. నేను ఎప్పుడో వివరము గా చెప్పాను, గోడ కోసం పైసా ఇవ్వము, మిగతా వాటి గురించి మాట్లాడదాము ఇరు పక్షాల సమావేశంలో, అని నొక్కి వక్కాణిస్తున్న స్పీకరమ్మ. దేవుడా, మొండి జగమొండిలకు 5 వారాలలో తేలని విషయము, రాబోయే 3 వారాలలో తేలుద్దా, అని ఆందొళన చెందుతున్న ప్రజలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1017 General Articles, 46 Tatvaalu
Dt : 27-Jan-2019, Upd Dt : 10-Apr-2019, Category : America
Views : 654 ( + More Social Media views ), Id : 42 , Country : USA
Tags : america , 35 days , President Trump , Wall , Republican , Democrats , Govt Shutdown , USA , national emergency , Pelosi

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content