వైరస్ చెల్లీ, సాంప్రదాయం కట్టుబాట్లు నేర్పుతున్నావో, బాధ పెడుతున్నావో, చిత్ర విచిత్ర పరిస్థితి - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1195 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1225 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మటన్ లేదా నీసు లేదా బయట తిండి తింటేనే వస్తుంది, బయట తిరిగితే వస్తుంది అని అంటున్నారు. అందుకే బస్సు, ఆటో, రైలు జాగ్రత్తలు చెప్పినది అందరూ, నెల ముందే. కొంతమంది కి కష్టం నష్టం అయినా తప్పదు కదా, జీవితం ప్రాణాలు ముఖ్యము. వ్యాపారం పోయింది అని కొంత మంది వేదన, ఖర్చు మిగిలింది అని ఇంకొంతమంది సంతృప్తి.

కల్తీ లు తగ్గాయి, మోసాలు తగ్గాయి, చిన్న ఇల్లు పోకలు తగ్గాయి, సినిమా లు తగ్గాయి, చెడు బయట తిండి మరియు తిరుగుళ్ళు తగ్గాయి, చుట్టాల రాకపోకలు ప్రయాణ ఖర్చులు తగ్గాయి, క్యూలైన్లు రికమెండేషన్ లు దూకడాలు తగ్గాయి, రాసుకు పూసుకోవడం తగ్గాయి, సభలు సమావేశాలు తగ్గాయి, మత్తు మందు తగ్గాయి. వైరస్ చెల్లి దేవతా శక్తి తో మంచా, చెడా మనకు?

మొక్క చనిపోతే కుళ్లిన వాసన వస్తుందా? కానీ పిల్లి ఎలక మేక పొట్టేలు మనిషి పోతే? ముక్కులు పగిలే వాసన వస్తుంది కదా? అంటే వైరస్ చేరడానికి ఇది, మొదటి అవకాశం వాహకం, ఎక్కువ అనే కదా? కోడి ని మేక ను తెచ్చి నేరుగా కోసినా, దానికి వైరస్ ఉందో లేదో మనకు తెలీదు. దోమలు ఈగలు వైరస్లు, ఎక్కువగా కుట్టేది తాకేది ముద్దాడేదీ, మనిషి, జంతువులు, పక్షులు నే కదా.

మనకు రోగం వచ్చినా, వెంటనే బయట పడదు అంటున్నారు. చిన్నగా ప్రభావం చూపుతుంది, ఈలోపు ఇంకా కొంత మంది కి అంటిస్తారు, వారు ఇంకొంత మందికి అని అంటున్నారు. ఠాకూర్ సినిమా లో ఉన్నట్లు, ఒకరు ముగ్గురు కు, మరలా ఒక్కొక్కరు ఇంకో ముగ్గురు కు.

ఢిల్లీలో సినిమా హాళ్ళు అన్ని మూసారు అంట. ఇంకెక్కడో స్కూల్, కాలేజీలు మూత అంట. సమూహం గా ఉండవద్దు అని హెచ్చరికలు. ఎందుకంటే చదువుకున్న మరియు ఉద్యోగము చేసే వారు, ముందు జాగ్రత్తలు భద్రత, ఎక్కువ తీసుకుంటారు కాబట్టి.

మన ఊళ్ళో ఏమైనా కూడా, అవి ముయ్యరు, ముయ్యనీయం. ఎందుకంటే ఎవరు పోయినా, ఇబ్బంది లేదు, బాధ్యత లేదు కాబట్టి, మన ప్రాణాలు కు విలువ లేదు.

వాళ్ళు మూసినా, మనము తెరిపించి మరీ సినిమా చూస్తాము, తింటాము, భయం భక్తి బాధ్యత లేకుండా, కుటుంబం పిల్లలు మీద ప్రేమ ఉండదు కాబట్టి, పచ్చి అవకాశ వాదులం కాబట్టి.

ఫారం కోళ్లు ఊరక ఇస్తామని అన్నా, తీసుకోవడం లేదు జనాలు. చికెన్ కేజీ 10 నుంచి 40 రూపాయలు కు కూడా కొనడం లేదు అంట. మంత్రులు చెపుతారు, ఏదైనా తినమని పర్లేదు అని, వారికి కార్పోరేట్ లేదా విదేశాల్లో వైద్యం ఉంటుంది. మరి మనకు దిక్కు, వీధి వైద్యం కాదా? కనీసము ఇప్పుడైనా రోజూ పేపర్లు, టీవీ వార్తలు చదవండి, లోకం తెలుస్తోంది.

దేశాల మధ్యలో రాకపోకలు కూడా బంద్. అటు ఇటు రావద్దని, అన్ని దేశాల ప్రకటనలు. బ్రిటన్ యువరాజు కూడా నమస్తే అన్నారు, షేక్ హాండ్ వదలి, వైరస్ భయముతో. విమానం ఎక్క నీయడం లేదు. విమానం ఎక్కి దిగితే, ఆరోగ్య పరీక్షలు, 14 రోజులు విడిగా ఉంచుతున్నారు. ఇల్లు ఎప్పుడు చేరతామో తెలీదు. చైనా, యూరప్, ఇరాన్ చుట్టూ దేశాలు లో చాలా ఇబ్బందులు.

ముందు జాగ్రత్తలు మంచిది. వచ్చిన తర్వాత ఏమీ చేయలేము. ఎండలో బతకదు, వేడి లో ఉండదు, ఇవన్నీ ఋజువు లేని మాటలు. మన దగ్గర తొందరగా, ఆసుపత్రికి వెళ్లి, పరీక్షలు చేయించరు. కాబట్టి తొందరగా బయట పడదు, లేదని భ్రమ వద్దు.

మనషులమే, ఇన్ని నక్క జిత్తుల ఊసరవెల్లి వేషాలు వేస్తుంటే గంట గంటకు, వెండితెర సినిమా తారల కన్నా, వైరస్ చెల్లి కూడా వివిధ అవతారాల లో, తన శక్తి యుక్తులను పెంచుకోదా?

మనకు సవాల్ విసరదా? ఇవి భయపెడటానికి కాదు, ముందు జాగ్రత్తలు కోసం. నిన్న మా అధ్యక్షుల వారూ, గవర్నర్ గారూ అదే నొక్కి వక్కాణించారు టీవీల్లో.

ఓ వైరస్ చెల్లీ, మా అందరికీ సాంప్రదాయం నీతి నియమం కట్టుబాట్లు నేర్పుతున్నావో, బాధ్యత నేర్పుతున్నావో, బాధ పెడుతున్నావో తెలియని, చిత్ర విచిత్ర మైన పరిస్థితి. అందరూ బుద్ధి మంతులు గా, నిన్ను అనుకరిస్తూ ఉన్నారు, నీకు మోకరిల్లుతున్నారు తల్లి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1225 General Articles, 47 Tatvaalu
Dt : 12-Mar-2020, Upd Dt : 12-Mar-2020, Category : General
Views : 315 ( + More Social Media views ), Id : 401 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : country precautions , covid 19 , corona virus
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content