Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని - వీటిని పంచ భూతాలు అంటారు. ప్రకృతి బలం ముందు, మానవ బలం ఏనాడూ గెలవదు.
కరోనా ఒక వైపు, భూమి పై ఏది తాకినా, ఆకాశ వాయువు లో కలసి వచ్చి, లేదా జల తుంపరులుగా వచ్చి, అందరినీ ఇబ్బంది పెడుతూ, మనము మిగతా జాగ్రత్తలు తీసుకుంటూ, అగ్ని చే కాగిన జలము స్వీకరిస్తే, కొంచెము శాంతినిస్తుంది. ఇంకో వైపు అడవుల్లో అగ్ని వాయుదేవుల ఆవేశము.
భూమి పైన భూకంపాలు ఎటూ ఉన్నాయి. నీళ్ళు తగినంత లేవు జాగ్రత్తలు అని హెచ్చరికలు కాలిఫోర్నియా రాష్ట్రములో.
భూమి పైన ఉన్న, కొండలలో ఉన్న అడవుల్లో, అగ్ని పుట్టి, వాయువు తోడుగా దావానంలా వ్యాపించి, ఎకరాలు ఎకరాల్లో, తగలబడుతూ ఉంటే, ఆ పొగలు ఆకాశ మంతా వ్యాపించి, నీల ఆకాశాన్ని మండే సూర్యుని కూడా తనలో దాచేసి, బంగారు (ఆరెంజ్) రంగులో మారిపోయింది ఆకాశము అంతా.
మన పురాణములలో, కృష్ణుడు అర్జునుల, ఖాండవ దహనం లో, అడవిలో అగ్ని దేవుని విందుకు, ఒక బాణం తో అగ్ని మొదలు, ఇంకో బాణం తో వరుణుడి సాయంతో, దహనం ఆగిపోయింది. అది ఆనాడు సాధ్యం, ఈనాడు ఇంకా అది సాధ్యం కాలేదు, ప్రపంచంలో నే శక్తివంతమైన దేశాలకు కూడా.
కానీ పెద్ద రాష్ట్రం కాలీఫోర్నియా, చుట్టుపక్కల ఫసిఫిక్ ప్రాంత రాష్ట్రాలలో అంటే వాషింగ్టన్, ఓరగాన్ లలో, అడవులను దహనం చేస్తున్న, వాయువు ని అగ్ని ని, అదుపు చేయడం అంటే, అదో కొన్ని వారాల నిరంతర శ్రమ ప్రయత్నం.
ఊళ్ళో మంటలు ఆపడానికి ఫైరింజన్ వస్తుంది. కానీ ఇక్కడ ఆపడానికి, అన్ని రాష్ట్రాల హెలికాప్టర్ లేదా విమానాలు వచ్చి, నిరంతరం లక్షల లీటర్ల నీరు వెదజల్లి నా కూడా, ఆ మంటలు ఆగడం లేదు. పక్క దేశాల నుంచి కూడా సహాయం తెస్తున్నారు.
ఇప్పుడు ఆ పొగకు, ఆకాశం 3 వ రోజు కు, మూసుకొని పోయినా, కొత్తగా, మనం పీల్చే గాలి లోని క్వాలిటీ అంటే ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతుంది. అంటే పిల్లలు, పెద్దలు, రోగులకు చాలా ఇబ్బందులు. ఊపిరి తిత్తుల సమస్యలు ఇబ్బందులు వస్తాయి. బయట తిరగ వద్దు, ఇంట్లోనే కిటికీలు మూసి, లోన కూర్చోండి అని ప్రభుత్వ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. సోమవారము (Sep 14) దాకా, గాలి తో ఇబ్బంది అంటున్నారు.
మరి ఈ పంచభూతాల కు శాంతి ఎప్పుడు కలుగుతుందో, అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకు తున్నారు.
సెప్టెంబర్/11/2001 స్మారక దినోత్సవం, ఎంతో మంది షుమారు గా 3000 మంది ప్రాణాలు కోల్పోయారు అమెరికా లో ఆనాడు, అన్ని ప్రాంతాల దేశాల వారూ ఉన్నారు అందులో. అలాగే, ఆ తర్వాత ఇండియా ముంబై లో కూడా అటువంటిదే జరిగింది.
వారందరినీ కన్నీటితో తలుచుకుంటూ, ఇలాంటి వి, మరలా జరగరాదని, అమెరికా భారత దేశాలు ధైర్యంగా కలసి సమస్యలను ఎదుర్కొంటూ, ముందడుగు వేస్తాయని, దేవుని కోరుకుంటున్నాము.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2119 General Articles and views 1,881,432; 104 తత్వాలు (Tatvaalu) and views 226,268 Dt : 11-Sep-2020, Upd Dt : 11-Sep-2020, Category : America
Views : 941
( + More Social Media views ), Id : 691 , State : CA , Country : USA
Tags :
pancha bhutalu ,
5 elements ,
angry ,
ca ,
or ,
wa ,
usa ,
western ,
america అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments