ధర్మ దాత - ఓ నాన్న నీ మనసే, ఎవ్వడికోసం ఎవడున్నాడు, లాలి నా చిట్టి తల్లి, ఎవరూ నీవారు కారు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,628; 104 తత్వాలు (Tatvaalu) and views 226,093.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

ఫాదర్స్ డే అంటే తండ్రుల రోజు, జూన్ 19 న వస్తుంది. మరి మీ తండ్రి గారికి కూడా, ఇలా పాడి వినిపించి లేదా నివాళులు అర్పించి, క్రుతజ్ఞతలు తెలుపుతారు కదూ. రాగం ముఖ్యం కాదు, అనురాగం మాత్రమే ముఖ్యం.

కలియుగం లో 1 పాదం ధర్మం అంటే, నాడు 75 శాతం పాపం/ అధర్మం, నేడు 80 శాతం పాపం, మాలాంటి వారి మంచి మాటలను గేళిచేస్తారు, వారు ధర్మానికి దైవానికి దూరం. అంటే కేవలం 20 మంది మంచివారు మాత్రమే మనల్ని ప్రొత్సాహం చేస్తారు, నమ్ముతారు. అయినా ఆ 80 శాతం నుంచి, మన గురువులను కాపాడి బయటకు లాగి, ఈ 20 శాతం లోకి తెచ్చే ప్రయత్నం చేసి, వారి భవిష్యత్ కష్టాలను బాధలను కొంతైనా తగ్గించాలి, ఓడిపోయినా పర్లేదు సుమా, పుణ్యమే.

అందరూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పి నాలుక పై లెక్కకు చెప్పి, లేదా ఫోటోలు ఓ 2 పెట్టి చేతులు దులుపుకుంటారు. అదేనా, తండ్రికి ఇచ్చే విలువ, నోటి మాటనా లేక చేతలలో విలువలా? దానికి పితరులు సంతోషిస్తారా? లేదు, గాక లేదు. వాళ్ళే కాదు, ఇప్పుడు మన బంధువులు స్నేహితులు లో ఉన్న సాత్వికులు కూడా మెచ్చరు. మరి ఏమి చెయ్యాలి?

వారి అంటే తమ తండ్రుల గుణ గణాలు చెపుతూ, వారి అడుగుజాడల్లో మనమేమి నడిచామో, మన పిల్లలను అంటే ఆయన మనుమలను ఎలా నడిపిస్తున్నామో, ఆయన మనకు అప్పగించిన ప్రేమ త్యాగం విశ్వసనీయతలను, ఎంత పెంపొందించామో, పదిమంది కి ధైర్యగా చెప్పగలగాలి. అప్పుడే వారికి నిజమైన నివాళి.

జాకీచాన్ తన ఆస్తులు సర్వస్వాన్ని అనాధ శరణాలయాలకు రాసారంటా. అదేమిటీ, మీ పిల్లలకు కోట్లు ఇవ్వరా అంటే, నా పిల్లలు చవటలు కాదు, వారి మెదడు మొద్దుబారకూడదు. వారు కష్టపడి సొంతముగా సంపాదించే తెలివి తేటలు ఇచ్చాను అన్నారంటా. అలా ధైర్యముగా చెప్పగలిగే నిజాయితీ గల తల్లి దండ్రులు ఉన్నారా?

ద్రుతరాష్ట్రుడు లా పెంచి, ఇతరుల ను దోచి ఆస్తులు అధికారం ఇస్తే, ఓ అమ్మను 10 ఏళ్ళు గా గదిలో పెట్టి, వారానికి ఒకసారి, బిస్కెట్లు వేస్తున్నారు అంట, చదువుకున్న మూర్ఖులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ. చుట్టూపక్కల ఉన్న దయగల ఒకరు, కలెక్టరు ఫిర్యాదు చేస్తే వచ్చి విడిపించారు.

ముదుసలి వారిని సొంత వారే, ఎలా హింసిస్తున్నారో, ఎలా గాలికి వదిలేస్తున్నారో, ప్రపంచ ఆరోగ్య సంస్థ బొమ్మలతో చెప్పిన ఫోటో కూడా చూడండి.

మరి పిల్లలకు సంస్కారం నేర్పకుండా, హస్టల్ లో వేసి, అర్ధం కాని చదువు అంతులేని సంపాదన బండలు గా పెంచితే, భవిష్య జీవిత భాగస్వామికి మరియు సొంత తల్లి దండ్రులకు, గుది బండలు గా తయారవుతున్నారు, వారినే రాచి రంపాన పెడుతున్నారు.

వారి పిల్లలను, తమ కన్నా రాతి బండలు గా, పెంచుతున్నారు. రోజూ వాట్సాప్ స్టేటస్ లో ఈ వార్తలు మీరు చూసే ఉంటారు సాక్ష్యం.

2 కళ్ళు లో ఏది ముఖ్యం అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే, 9 నెలలు మోసి జన్మనిచ్చినది తల్లి అయితే, సమ్రక్షించి మంచి దోవలో, భవిష్యత్ తీర్చి దిద్దించింది మాత్రం ఇంట్లో మా నాన్నే.

బీదరికం అంటే చవిచూచి, కష్టపడుతూ పైకి వస్తూ, బిడ్డలకు కు కూడా, ఇంటి పని పొలం పని అన్ని పనులు నేర్పించి, తన బాధ్యత తాను, సంపూర్ణముగా పూర్తి చేసారు. ఉంటే తిందాము, లేకపోతే గమ్ముగా ఉందాము, ఉన్న దానితో త్రుప్తి చెందుదాము. అప్పు చేసి లేదా ఇతరులను దోచి, మనకు పరమాన్నం వద్దు, అది నిలవదు. అప్పుచేసి పప్పు కూడు, అసలే వద్దు. మంచి గుణం బాద్యత ఎప్పటికీ మారకూడదు, ఎంత నష్టపోయినా. గతం మరియు మూలాలు మరువద్దు. ఎవరి దాని గురించి ఆశించవద్దు, అత్యాశకు చేయి చాపవద్దు. ఎవరినీ, మీరు మాకు, ఇది చేయలేదని అడగవద్దు.

ఇలా నీతి నియమాలతో ఉంటే, దేవుడే కావలసినవి అన్ని అమరుస్తాడు, సరైన సమయములో కావలసినంత మాత్రమే, అని కఠిన క్రమశిక్షణలో పెంచారు. దానిని ఆచరించిన వారు ఆనందముగా ఉన్నాము, కష్టాలకు బెదరక, సుఖాలకు సంతోషాలకు పరితపించక. పాటించని వారు, వారి పాట్లు వారు పడుతున్నారు, రాబోయే శిక్షలకు ఎదురు చూస్తున్నారు. కష్టాలు ఉన్నంత కాలం, దేవుడు తోడు ఉంటారు.

తాను, ప్రతిఫలము గా ఏదీ పొందకపోయినా, మమ్మల్ని విడిచి అనారోగ్యము తో ముందే వెళ్ళినా, చక్కటి పూల బాట వేసి వెళ్ళారు. మా స్నేహితులు బంధువులు ఎవరిలో కూడా లేని భాగ్యం మా అమ్మకు కల్పించారు, 8 ఏళ్ళుగా సౌకర్యాలు ఆరోగ్య రక్షణ లో. మీ అందరి అలాగే ప్రభుత్వ సహాయం కూడా ఉంది, ఈ కల నెరవేరడంలో.

ఆదాయం 3 ఏళ్ళు పైన లేకపోయినా, ఎప్పుడు తల్లి దండ్రుల ఆస్తులు తాకలేదు, అమ్మకానికి లేదు. చేయి చాచ లేదు, సౌకర్యాలు తగ్గలేదు, నీతి నియమం తప్పలేదు. అప్పు చేసి పప్పు కూడు లేదు. ఎందుకంటే అవి, కోట్లు ఇచ్చినా తిరిగిరాని జ్ఞాపకాలు, మన సమర్ధతకు ఆత్మాభిమానము కు అరిషడ్వర్గాల సాధనకు చిహ్నాలు. దేవుని పరీక్షకు గీటు రాయి.

ఇంటర్మీడియేట్ లోనే అమ్మ కు చెప్పారు - నేను ఉన్నా లేక పోయినా, కొడుకు, నిన్ను పువ్వులలో పెట్టి చూసుకుంటాడు. ఏరోజు అయితే వాడికి దూరము అవుతావో, మిగతా వారి చేతిలో నీకు ఇబ్బందులు కనీళ్ళు అవమానాలు మొదలు. ఎప్పుడూ వాడిని, వాడి మాట ను, విడవకు, వాడే నీకు గొడుగు అని. అప్పుడు అందరమూ నవ్వుకున్నాం, ఎప్పుడో సంగతి మనకేమి తెలుసు లే అని. ఇప్పుడు సజీవ సాక్ష్యం మీరంతా, అది ప్రత్యక్షముగా చూస్తున్నారు.

ఈ పాట అచ్చం, మా నాన్న గారికి సరిపోతుంది, ప్రతి పదము. మరి మీ నాన్న గారి మంచి గురించి కూడా, కనీసం మా లాంటి వారికి చెపుతారు కదూ?

ఇప్పుడు కూడా, నేను అన్ని ఉన్న బీదవాడినే, అందుకే చాప మీద నిద్రపోతూ, శాఖాహారము తో బతికేది, 140 వారాల 108 ప్రదక్షిణలు, 27 వారాల శిరోముండనం మీకు తెలుసు. అన్ని మనవే, కానీ ఏదీ మనది కాదు, అన్న స్రుహ ఉంటే, మోక్షము కు దోవ చూపుతుంది అదే. నీటి మడుగులో ఉన్నా, తామర పువ్వును, నీరు తాకలేదు. మనము జగత్తు/ ప్రపంచము లో ఉన్నా, వాటి మాయలు బ్రమలు మనల్ని అంటకూడదు, అంటవు.

అంతులేని ఐశ్వర్యము లో పుట్టి పెరిగిన వారికి, లేదా ఇతరులను దోచి పెరిగే వారికి, లేదా ముదుసలి తల్లి దండ్రిని విడిచిన వారికి, ఈ ప్రేమలు బంధాలు ఆత్మీయతలు ఆత్మాభిమానం క్రుతజ్ఞత బాధ్యత మనసు విశ్వసనీయత అంటే తెలియవు, అందుకే సినిమాలో చూడాలి కనీసం. లోపల వీడియో కూడా ఉంది సుమా.

ఇలా మీరు ఇతరులకు ఏ మాట, ఏ పాట అయినా పంపేముందు, తెలుగు లో అత్మీయముగా మీకు అర్ధం అయినది 2 ముక్కలలో రాసి, ఆ తర్వాతనే ఫార్వార్డ్ చేయగలరు.

1) ఇది కరెక్ట్ గా మా నాన్న గారికి సరిపోయే పాట

ఓ నాన్న, నీ మనసే వెన్న, అమృతం కన్నా, అది ఎంతో మిన్న , ఓ నాన్న, ఓ నాన్న

ముళ్ళ బాటలో నీవు నడిచావు, పూలతోటలో మమ్ము నడిపావు 2
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో 2, పరమాన్నం మాకు దాచి వుంచావు

పుట్టింది అమ్మ కడుపులోనైనా, పాలు పట్టింది నీ చేతిలోన 2
ఊగింది ఉయ్యా లలో నైనా 2 , నేను దాగింది నీ చల్లని ఒడిలోన, చల్లని ఒడిలోన

ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేనినాడు చేయి సాచనన్నావు 2
నీ రాచగుణమే మా మూలధనము 2 నీవే మాపాలి దైవము

2) ఈ బాధాకర పరిస్తితి ఎప్పుడూ మనము తీసుకుని రాము, అంత విశ్వసనీయత లేని బతుకు, తర్వాత అయినా పతనము అవుతుంది.

ఎవ్వడికోసం ఎవడున్నాడు పోండిరా… పోండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా… రండి 2 ||ఎవ్వడికోసం||

ఉన్నవాడిదే రాజ్యమురా, లేని వాడి పని పూజ్యమురా
మనుషులలోనా.. మమతలు లేవు…, మంచితనానికి.. రోజులు కావు 2
అంతా స్వార్ధం… జగమంతా స్వార్ధం ||ఎవ్వడికోసం||

ఒకడికి నే తలవంచనురా, బానిసగా జీవించను రా
మిన్ను విరిగి పై పడినా కాని, అవమానాన్ని సహించనురా
ఒరే ..ఉంటే వేళకింత తింటారా…లేకుంటే పస్తులుంటా..ఒరే..ఒరే…
మిమ్ము నమ్ముకోని పుట్టానా…మీరు ఉద్దరింతురను కొన్నానా 2
పోతున్నారా…. వెళ్ళిపోతున్నారా... ||ఎవ్వడికోసం||

కాలం మారక పోతుందా, కష్టం తీరక పోతుందా
అదృష్టమన్నది ఇంటికి వచ్చి, తలుపులు తట్టక పోతుందా
అప్పుడు మీరేమంటారు…
మా నాన్నే..మా నాన్నే…మా బాబే అంటూ
నీడకు చేరే పక్షుల్లాగా, బెల్లం చుట్టూ ఈగల్లాగా 2
మూగకపోరు … నే చూడకపోను.. ||ఎవ్వడికోసం||

3) ఈ పాట మా అమ్మ ను నిద్రపుచ్చడానికి, అలాగే మా అమ్మకు కూడా సరిపోతుంది.

జో..ఓ.. లాలి, జో..ఓ.. లాలి
లాలి నా చిట్టి తల్లి.. లాలి నను కన్న తల్లి
లా.లి బంగా.రు తల్లి.. లా.లి నా. కల్పవల్లి
జో..లాలి, జో..లాలి

చరణం 1:
చిరు నవ్వు, కిరణాలు, చిందించు మో.ము, కన్నీరు, మున్నీరు,గా చూ.డలే.ను 2
నిను గన్న, నీ తల్లి, కనుమూసె గా.ని.. 2
నిను వీడి క్షణమైన నేనుండ గలనా 2
జో..లాలి, జో..లాలి

చరణం 2:
రతనాల భవనా.ల నిన్నుం.చలేను.. ముత్యా.ల ఉయ్యా.లలూగించలే.ను 2
కనుపాపలా, నిన్ను కాపాడు కో.నా2
నిరుపేద ఒడిలోన, నిను దాచుకో.నా 2
జో.లాలి,జో..లాలి, జో..లాలి

4) ఈ బాధాకర పరిస్తితి ఎప్పుడూ మనము తీసుకుని రాము, అంత విశ్వసనీయత లేని బతుకు, తర్వాత అయినా పతనము అవుతుంది.

ఓ ధర్మదాతా ఓ ధర్మదాతా
ఎవరూ నీవారు కారు, ఎవరూ నీతోడు రారు
అడిగిన వారికి లేదనక, అర్పించిన ఓ ధర్మదాతా

సగము దేహమై, నిలిచిన నీ దేవి, రగిలే చితిలో రాలింది
పుట్టెడు మమతలు, పండించు ఇల్లాలు, పిడికెడు బూడిదగా మారింది
ముత్తైదువుగా, ముగిసిన సతి మేను 2 కృష్ణవేణిగా మిగిలింది ||ఎవరూ నీవారు||

కల్పతరువు గా, వెలసిన భవనం, కడకు మోడుగా మారేనా?
కోటిదివ్వెల ను, నిలిపిన నీకే, నిలువ నీడయే కరువాయెనా?
పూవులమ్ముకొని, బ్రతికే చోట 2 కట్టెలమ్ముకొను గతి పట్టెనా?
ఓ ధర్మదాతా ఓ ధర్మదాతా
సాహిత్యం: C. నారాయణరెడ్డి, గానం: ఘంటసాల

చిత్రం: ధర్మదాత (1970) , అక్కినేని, కాంచన, సంగీతం: T. చలపతిరావు, సాహిత్యం: C. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, జయదేవ్, సుశీల

O Nanna Video Song - Dharma Daata Telugu Movie - ANR , Kanchana

Father's Day falls on June 19. And to your father, too, paying tribute or sounding thankful by singing this beautiful song.
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,628; 104 తత్వాలు (Tatvaalu) and views 226,093
Dt : 18-Apr-2022, Upd Dt : 18-Apr-2022, Category : Songs
Views : 1632 ( + More Social Media views ), Id : 1351 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : nanna , manasu , venna , amr̥utam , dharmadata , akkineni , kancana , evvadikosam , jo lali , o dharmadata
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content