చలికాలం, మత్తు, బద్దకం, సోమరితనం - నష్టం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,602; 104 తత్వాలు (Tatvaalu) and views 266,164.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చలికాలం, అందరినీ మత్తులో, బద్దకం లో, సోమరితనం లో ఉంచుతుంది. చూడండి, ఎక్కువమంది పక్క మీద నుంచి ఉదయం 7 లేదా 9 దాకా, లెగవరు. దాని అర్థం, నష్టం తెలిస్తే, పిల్లల కు అర్థం అయేట్టు గా చెపితే, మనం ఆచరణలో చేస్తే, వారికి అర్థం అవుతుంది.

నరాలు, కండలు కుంచించుకూ పోతూ, కదలని మెదలని పరిస్థితి ఉంటుంది. 35 దాకా, వయస్సు వేడితో అర్థం కాదు. అర్థం కాకపోయినా, నష్టం ఆగదు, సోమరితనం పెరుగుతుంది వారిలో.

కానీ ఆ పైన వయస్సు వారికి, అంతా కష్టం గా, భారంగా, ఇబ్బంది గా ఉంటుంది. ఆరోగ్యం తరుగుతూ ఉంటుంది, చిన్నగా కూడా.

చలికోటు వేసుకుని స్నానం, పూజ చేయలేము కదా. చలిమంట వేసిన కూడా, ఆ కాసేపు మాత్రం ఉపయోగం, దూరంగా వస్తే మరలా మామూలు. మరి ఏమి చేయాలి?

పొద్దున్నే చలికి భయపడకుండా, లెగిచి యోగా లేదా వ్యాయామం చేయాలి. అప్పుడు, మన శరీరం లోనే ఉష్ణం జనించి, కండరాలు నరాలు వ్యాకోచం చెంది, మన శరీరం లోపల వేడెక్కి, బయట చలికి నిరోధానికి కారణం అవుతుంది. వారిని చలి ఏమీ చేయలేదు. హిమాలయాల లో సాధువులు, ఏమీ ధరించరు అంత చలికి కూడా, తెలిసిందే కదా.

మరి మన ఇంట్లో వాళ్ళు, మన మాటలు విని, ఇవి ఆచరిస్తారా? ఈ రోజుల లో చచ్చినా, వినరు, ముందే మనమే ఆచరణ లో పెట్టము. అందుకే, మన పురాణ సనాతన సాంప్రదాయాలలో వాటిని, అంటే ఆరోగ్య సూత్రాలు ను, కలిపేసారు. కార్తీక మాసం, శ్రావణ మాసం, పూజలు పునస్కారాలు పెట్టారు. సంక్రాంతి ముగ్గులు గొబ్బెమ్మలు పొద్దున్నె అలాంటివే, ఆరోగ్యకరమైనవే.

చిన్నప్పటి నుండి, ఇవి అలవాటు ఉంటే, మనసులో తెలీని భక్తి భావం, బాధ్యత తో పొద్దున్నే లెగుస్తారు, తమ ఆరోగ్యం మరియు శారీరక బలాన్ని పెంచుకుంటారు, 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యం తో బతుకు తారు. మనసు తనే లేపుతుంది, సాంప్రదాయ అలవాట్లతో.

మరి మహిళలు, పూజలు చేసినా చేయకపోయినా, వంగి చిమ్మడము, పొద్దున్నే పేడ తెచ్చి, కళ్ళాపి చల్లడం, అంట్లు తోమడం, పిల్లల ను రెడీ చేయడం అనే బాధ్యత తో, ఆటోమేటిక్ గా ఇవన్నీ గతంలో చేసేవారు 4 గంటలకే లెగిచి. దాని తో పాటే పూజలు పునస్కారాలు అదనంగా. అదో మంచి వ్యాయామము, బరువు లావు పెరగకుండా.

మరి నేటి యాంత్రిక నటనా జీవనం ల, ఇవి మనకు తెలీదు, చేసే వాళ్ళను చూసి నవ్వుతూ గేళిచేస్తూ, యుక్త వయస్సు లో ముదుసలి వారిగా మారి, రోగాలు రొప్పులతో, ఆసుపత్రిలో ఖర్చు లతో, అగమ్యగోచరంగా బతుకు ను సాగదీస్తూ ఉన్నాము.

మనం బాధ్యత గా ఉంటూ, పిల్లల ను చలికి భయపడకుండా, బాధ్యత గా పెంచుతారు కదూ.
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,602; 104 తత్వాలు (Tatvaalu) and views 266,164
Dt : 21-Nov-2020, Upd Dt : 21-Nov-2020, Category : General
Views : 1049 ( + More Social Media views ), Id : 821 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bathe , worship , coat , campfire , face , cold season , Winter , intoxication , laziness , loss
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content