మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,632; 104 తత్వాలు (Tatvaalu) and views 226,177.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.1 min read time.
మనం చిన్నప్పుడు ఎంతో అల్లరి చేస్తున్న, అమ్మ నాన్న తిడితే, ఏడుస్తూ అలుగుతాము, మూలన కూర్చుంటాము. పలకకుండా, అన్నం తినకుండా, గమ్ముగా ఉంటాము.
మరి అదే మన అమ్మ బాధపడి అలిగితే, మరి మనం ఎలా బుజ్జగించాలి, నవ్వించాలి? తల్లి దండ్రుల 60 ఏళ్ల వయస్సుకు ముందు, మనం ఏమి చేసినా వాళ్ళు పట్టుకుని ఉండరు, బాధ పడరు. కానీ వయస్సు ఉడిగిన తర్వాత, ఒంటరై న తర్వాత, చిన్న పిల్లలు లాగే వాళ్ళు అలుగుతారు. అయితే కడుపు లో బాధ చెప్పుకోవాలి అంటే, ఇష్టం అయిన పిల్లలు దగ్గర ఉండరు. దగారగా లేదా దూరంగా ఉన్నా, ఇప్పుడు వినేవారు లేరు వినరు. తమకూ భవిష్యత లో, ఒంటరితనం ముదుసలి తనం వస్తుంది, అని ఆ సమయంలో అనుకోరు.
మరి మా అమ్మ షుగరు బీపీ ఉండి కూడా, బెల్లపన్నం తినవద్దు అంటే, దోసకాయ పచ్చడి మంట వద్దు అంటే, మైలు దూరం నడవ మంటే, ఎక్కువ పని వద్దు పడిపోతావు నీరసం వస్తుంది అంటే, బిళ్ళలు సమయానికి వేసుకోమంటే, ఒక్కోసారి కాసేపు అలుగుతుంది, కోపం తెచ్చుకోవడం జరుగుతుంది. ఆఖరికి బయట చిమ్మి నీళ్లు చల్లి ముగ్గు వేయవద్దు, ఈ వయస్సు లో అన్నా, రోషం వస్తుంది.
అలిగి దుప్పటి కప్పకుని పడుకుంటుంది. అన్ని రకాలుగా బతిమాలి, చివరగా పాట అస్త్రం పాడితే కాళ్ళు పట్టుకుని, పాండురంగ మహాత్యం లోనిది. అప్పుడు నవ్వుతూ, ఊరుకో ఏమిటి ఆ పాటలు మాటలు, ఇక్కడ నే ఉన్నా కదా, అని నవ్వుతుంది.
మీరూ ఆ పాట ప్రయత్నం చేయండి, అమ్మ ను నవ్వించండి. మనం మధుర బాలూ కావాల్సిన పని లేదు బయట జనం కోసం, ఇంట్లో వాళ్ళ కోసం, ఓ రెండు పలుకుల గాడిద స్వరాల గానం చేసినా చాలు, మంచి మనసు తో.
మంచి పని ఇంట్లో మన వాళ్ళ తోనే, జోవియల్ గా సంతోషం గా, ఉండటం చేతగాని బ్రతుకులు, ఎంత పదవి లో ఉన్నా ఎన్ని కోట్లు సంపాదించినా, ఇంక వారు పొందే ఆనందం ఏముంది? ఈలోకంలోనే అల్ప సంతోషం ఉచితంగా పొందలేని వారు, పోయాక పరలోకంలో సంతోషంగా ఉంటారా? మరలా పాపాల ఫలితాలు కోసం, ఇక్కడ కే వస్తారు సుమా.
ఘంటసాల గారు మధుర గాత్రములో, ఎంటీయార్ జీవించారు. ఆ పాట పాడేటప్పుడు, ఘంటసాల గారు ఏడ్చే ఉంటారు. ఇది చూస్తూ ఉంటే, సాత్విక మనసులకు కన్నీళ్ళు తిరుగుతాయి.
అమ్మా.... నాన్నా
అమ్మా.... అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా, అమ్మా ||
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,632; 104 తత్వాలు (Tatvaalu) and views 226,177
Dt : 29-Dec-2020, Upd Dt : 29-Dec-2020, Category : Songs Views : 1210 ( + More Social Media views ), Id : 893 , State : Andhra/ Telangana (Telugu) , Country : India Tags : mom , amma , mata , pita , pada , seva , madhava , panduranga , mahatyam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad. ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం. మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు. మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు