మాతృదేవోభవ - 6 గురు కుటుంబం, ఎలా చిన్నాభిన్నం అయింది అనుకోని సంఘటనలతో - Movie - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పాట 1. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడు లేడు లే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే.. లోకమెన్నడో..చీకటాయెలే..
నీకిది తెల్లవారని రేయమ్మా.. కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం.. గానం కీరవాణి

పాట 2. వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి..
మమతలన్ని మౌన గానం.. వాంఛలన్నీ వాయులీనం.. గానం చిత్ర.

ఈ పాటలు విన్నారా? ఆ పదాలలో అర్థం ఎంత ఉందో, మనసు తో చూడండి. సగము నుంచి, సీరియస్ గా ఉంటుంది సినిమా. వేటూరి గారు రాసిన మాటల పాట లు ఇవి, కీరవాణి సంగీతం. చిత్రం పేరు, మాతృదేవోభవ 1993, మాధవి మరియు నాజర్ మరియు 4 పిల్లలు. అందరూ అద్భుతంగా నటించారు, అలాంటి నిజ కధలు ఎన్నో మన జీవితాలలో.

మనకు చేతిలో పలుకుబడి, ధనం, అధికారం, జనం ఉంటే భూమి మీద నడవము. ఇప్పుడు ఉన్న ఒకరు లేదా ఇద్దరు కనీసం సొంత పిల్లలు ను కూడా పెంచకుండా, అమ్మమ్మ నాయనమ్మ ల దగ్గర వదిలేస్తున్నాము. మన ఆనందానికి కని, కనికరం లేకుండా పెద్దల నెత్తిన వేస్తున్నాము. మాలాంటి చవటలను కన్న మీరు, వీరిని కూడా పెంచండి అని. విడాకులతో ఇంకొంతమంది, జీవిత భాగస్వామి వద్ద పిల్లల్ని వదిలేస్తున్నారు.

బాగున్న పరిస్తితులు కూడా, భవిష్యత్తు క్షణంలో ఎలా మారిపోతుందో ఈ చిత్రం లో, చక్కగా చూపించారు. వీలైతే, మనసు ఉంటే, ఓసారి చూడండి. మన భవిష్యత్తు కోసం, ఓ కన్నీరు ఇప్పుడే కార్చండి. తర్వాత రోజుల్లో కన్నీరు రావు, కన్నీటిని చూసి తుడిచే వారు ఉండరు.

6 గురు ఉన్న కుటుంబం, ఎలా చిన్నాభిన్నం అయింది అనుకోని సంఘటనలతో, చివరకు తలోదిక్కుగా ఒక్కొక్కరుగా వేరు అవ్వడం. భార్య రోగం తో, ఇంకో 2 నెలల తర్వాత భూమిపై ఉండదని తెలిసీ, ఆ కుటుంబము అనుభవించే బాధ? పిల్లల బాధ్యత, భవిష్యత్తు, వారికి దోవ ఏమిటి? ఆ సమయంలో అనుకోకుండా భర్త పోతే, ఆ ఇల్లాలి మనోవేదన?

ఆ పిల్లల కు ఏదో ఒక దోవ చూపించాలని, ఆ తల్లి ఆరాటం? పిల్లల ను వదల్లేక తల్లి, తల్లిని వదల్లేక పిల్లల బాధ? పసి పిల్లలు ఒకరినొకరు, వదలలేక పడే బాధ?

చివరకు 4 బిడ్డలు పరిస్థితి ఏమిటి? కాలు బాగోని పిల్లవాడి ని ఎక్కడ ఉంచారు?

ఇలాంటి సినిమాలు పిల్లల కు చూపి, బాధ్యత ప్రేమ నేర్పాలి ఏమో భవిష్యత్తు లో. అబ్బో , మనసు ఉన్న వారికి, కన్నీళ్లు కాలవలుగా కారుతాయి. నేడు లేని ఆ బంధాలను, ఓ సారి కనీసం టీవీ తెరపైన చూడండి, గతములో ఇలా ఉండేవారు అని అనుకుందాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 06-Sep-2020, Upd Dt : 06-Sep-2020, Category : Movie
Views : 781 ( + More Social Media views ), Id : 679 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : matrudevobhava , family , 6 , accidental , incident , life change
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content