Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. చూడండి, ఈ పాత పాట, డాక్టర్ గా శోభన్ బాబు (బాలు) పాడే పాట, ఈరోజు కి ఎంత అర్థం ఉందో ప్రతి పదాన, మనంలో ఇప్పుడు మంటగలసి పోతున్న మానవత్వాన్ని మేల్కొలపడానికి.
- కరోనా వచ్చింది అని కోటీశ్వరుడు ని కూడా కుటుంబ సభ్యులు వదిలేసిన అనాధ, వార్తలు చూస్తున్నాము. ఊళ్ళో కి ఇంట్లో కి రానీయకుండా ఆపుతున్నారు, ఆ ఊరి తోటి మనిషి, ఆ ఇంటి మనిషి ని.
- ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు మాత్రమే, ఈ పొగడ్తలకు పాత్రులు ఈ కరోనా నెలల/ సంవత్సర సమయంలో. కాదనగలమా? ప్రవేటు డాక్టర్లు తాళాలు వేసి, ఇంట్లో ఉన్నారు, ఎక్కువమంది.
ఒక వైపు మనిషిని మనిషే నాశనం చేస్తూ, ద్వేషం విషమై ఉచితము గా ఎక్కడ బడితే అక్కడ కురుస్తున్న సమయం లో కూడా, కష్టాలను భరిస్తూ, వాస్తవాలను నిజాలను తెలుపుతూ, చల్లని మనసుతో, మమతలను పంచిన ఎందరో గొప్పవారు అమరులైనారు, వారిని తలుద్దాం.
మనలోని ద్రోహులు చేసిన మోసానికీ, అందరమూ బలి అయ్యి, మన జాతికి గ్రహణం పట్టిన వేళ, ప్రజల కష్టాలు అవమానాలు బానిసత్వం చూడలేక, మాతృ భూమి మొరపెట్టిన వేళ, మనకోసం ఎంతో మంది త్యాగ మూర్తులు, అన్ని వదిలిపెట్టి, స్వరాజ్య సమరం సాగించి, స్వాతంత్ర్యమును సాధించారు. వారిని తలుద్దాము.
మనలో పెరుగుతున్న మోసాలను అరికట్టడానికి, పంచభూతాలే ప్రక్రుతి సహాయముతో కొన్ని సార్లు, దుష్ట శిక్షణ చేస్తాయి. ఇంకొన్ని మనమే అహంకారం తో, కరోనా లాగా స్రుష్టిస్తాము. అలాంటి విపత్కర వ్యాధులు బాధలు ముసిరే వేళ, మృత్యువు కోరలు చాచే వేళ, త మ ప్రాణాలనే పణం గా పెట్టి, గుండెకు బదులుగ గుండెను పొదిగీ, కొన ఊపిరులకు ఊపిరిలూదీ, మనల్ని బతికించిన ఎన్నో త్యాగ వైద్య కుటుంబాలను తలుద్దాం.
ఇంట్లో తమ్ముడుకి, అన్నం పెట్టే వసతి లేక, మనకు ఇంకో లోకం ఉంది, అక్కడ ఆకలి దప్పులు ఉండవు, నాన్న అక్కడ కే వెళ్ళారు, అని ధైర్యం చెపుతూ, ఖాళీ కడుపుతో, నిద్రపోతూ, ఆలోకం గురించి కలలు కనమని, బుజ్జ గిస్తూ, కన్నీళ్ళు ఆపుకుంటూ చెపుతుంది.
మనకు కడుపునిండి ఉంటే, ఇలాంటి విషయాలు కష్టాలు తెలీదు. అన్నానికి నోచుకోని నిర్భాగ్యులు ఎందరో. వారిని కూడా మోసం చేస్తూ, వారికి ప్రభుత్వ ఇచ్చిన ఆస్తులు కాజేస్తూ, పెద్ద మనుషులు గా చలామణి అయ్యే పెద్దలు ఎందరో మనచుట్టూ.
ఒక్క సారి ఆ పాటలు వినండి వీడియోలో, మనసు తో పాడే ప్రయత్నం చేయండి, కరుడుగట్టిన హృదయాలు కరుగుతాయేమో, ఓ కన్నీటి చుక్క రాలుతుంది ఏమో.
1)పల్లవి:
అణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా || అణువును ||
చరణం 1:
మనిషిని మనిషే కరిచే వేళ, ద్వేషం విషమై కురిసే వేళ
నిప్పుని మింగి నిజమును తెలిపి, చల్లని మమతల సుధలను చిలికి
అమరజీవులై వెలిగిన మూర్తుల ఆ....ఆ....ఆ....ఆ...
అమరజీవులై వెలిగిన మూర్తుల,
అమృతగుణం మాకందించ రావా - 2 || అణువును ||
చరణం 2:
జాతికి గ్రహణం పట్టిన వేళ, మాతృ భూమి మొరపెట్టిన వేళ
స్వరాజ్య సమరం సాగించి, స్వాతంత్ర్య ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల ఆ....ఆ....ఆ...ఆ...ఆ..
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మా కందించ రావా - 2 || అణువును ||
చరణం 3:
వ్యాధులు బాధలు ముసిరే వేళ, మృత్యువు కోరలు చాచే వేళ
గుండెకు బదులుగ గుండెను పొదిగీ, కొన ఊపిరులకు ఊపిరిలూదీ
జీవన దాతలై వెలిగిన మూర్తుల ఆ....ఆ....ఆ....ఆ....ఆ...
జీవన దాతలై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించ రావా - 2 || అణువును ||
2)
అమ్మ లాం..టి చల్లనిది, లోక మొకటీ ఉందిలే..
ఆ.కలి ఆలోకంలో..., లేనే లేదులే, లేనే లేదులే ||అమ్మ లాంటి||
నిజంగానా అక్కా అలాంటి లోకం ఉంటుందా?
ఉంది బాబు,
ఆకలి లేని ఆ లోకం, ఎంత బాగుంటుందో
మమతలే.. తేనెలు గా, ప్రేమలే.. వెన్నెలగా
చెలిమి, కలిమి, కరుణా.., కలబోసిన లోక మది
కలబోసిన లోక మది ||అమ్మ లాంటి||
అక్కా, మనం కూడా అక్కడకు వెళ్ళొచ్చా
వెళ్ళోచ్చు బాబు, నాన్న అక్కడకే వెళ్ళారు, మనము వెళతాము, కొంచెము వెనకా ముందు, అంతే
పిడికెడు మెతుకులకై..., దౌర్జన్యం దోపిడీలు
కలతలూ. కన్నీళ్ళూ., కనరా.ని లోకమది
కనరా.ని లోకమది ||అమ్మ లాంటి||
ఆకలితో.. నిదురపో.., నిదురలో.. కలలు కను
కలలో ఆలోకాన్ని, కడుపు నిండ నింపుకో 2
కడుపు నిండ నింపుకో||అమ్మ లాంటి||
చిత్రం : మానవుడు - దానవుడు (1972), సంగీతం : అశ్వద్దామ, గీత రచయిత : సినారె, నేపధ్య గానం : బాలు
Manavudu Danavudu - Anuvu Anuvuna Velasina Deva Lyrics - Devotional Telugu Songs Lyrics, shoban babu
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,588,352; 97 తత్వాలు (Tatvaalu) and views 199,715 Dt : 11-Aug-2020, Upd Dt : 11-Aug-2020, Category : Songs
Views : 3655
( + More Social Media views ), Id : 643 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Manavudu ,
Danavudu ,
Anuvu ,
Anuvuna ,
Velasina ,
Deva ,
amma ,
challanidi ,
Lyrics ,
Devotional ,
Telugu Song ,
shoban babu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments