మామా అల్లుళ్ళు ఎంత ఒద్దికగా కలిసిపోయారు అని కన్ను కుట్టుకున్నారు, అవసరము తీరాక - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2178 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2213 General Articles and views 2,474,471; 104 తత్వాలు (Tatvaalu) and views 265,871.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఎవరైనా మావయ్య కు ఫార్వార్డ్ చేయగలరు లేదా చెప్పగలరు. మామయ్య ఖాళీ స్థలము, గోడల వెంట పెద్ద చెట్లు వస్తున్నాయి, గోడలు పడిపోతాయి వేరులు లోనకి చొచ్చుకుని. ఆకులు రాలుతూ ఉంటాయి. దయచేసి, పక్క ఇళ్లు గోడలకు నష్టం కలిగించవద్దు అని.

బాధ్యత గల మామయ్య, అన్ని ఫంక్షన్స్ కి ఇటువైపు తిరుగుతూ ఉంటారు, చూసి కూడా ఎందుకు గమ్ముగా ఉంటారో తెలీదు.

రెండేళ్ల క్రితం, మన మామయ్య కదా అని, గోడమీదుగా వచ్చిన ముళ్ళు చెట్టు కొడతానికి, 1200 అడిగితే 600 ఇచ్చి అద్దెకున్న వారు కొట్టిచ్చారు. పాపం సాయం చేసిన బ్రాహ్మలు ఆయన ఆఫీసుకు పోయి అక్కడ అరచి, సెంటర్లో కూలి మనిషి ని కూడా అరచారంటా, చేయించింది నేను, అల్లుడు, అని తెలిసినా, తనకు డబ్బు శ్రమ తగ్గింది అని గమ్ముగా ఉండకుండా.

పాపం అద్దెకున్న అక్క కు 600 కూడా ఇవ్వలేదు ఇప్పటికీ, మంచి బుద్ధి తో, మధ్యవర్తులు మంచికోరే వారు చెప్పినా కూడా, వినలేదు.

మాకుచెపితే, మేమే చేసుకుంటాం. మా స్థలములో మాకు చెప్పకుండా, చిల్ల చెట్లు ముళ్ళు చెట్లు మీ గోడకు ఆని పైకి వస్తే మాత్రము, మేము 3 ఏళ్ళుగా చూస్తూ గమ్మున ఉంటే మాత్రము, మా దరిద్రాన్ని మీరు తీసేస్తారా ఆయ్ అని, డబ్బు ఇవ్వమని అన్నారు అంట. మీ గోడ ముఖ్యమా, మా ముళ్ళ చెట్టు ముఖ్యమా అన్నారు అంటా. చిత్రము కదూ. గోడ పడిపోతే తనకు పెద్ద ఇబ్బంది ఏముంది, మనకు తప్ప. అవ్వ.

ఇంక మనము వేలు పెట్టకుండా, ఇప్పుడు మామయ్య కే చెపుదాం. దయచేసి గోడ వెమ్మట శుభ్రం చేసి , మీకు స్ధలం ఇప్పించిన, మామకు న్యాయం చేయమని, విన్నవించుకుందాం. మంచి మనసు గొప్ప మనసు గల మామయ్య బాధ్యతతో, అర్థం చేసుకుంటారు కదూ.


మన ఇంటి పక్కన స్ధలం, మామయ్య కు నాన్న ఇప్పించారు, కాలనీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు. నాకు వద్దు బాబోయ్ అన్నా కూడా, ఇప్పుడు దాని ఖరీదు ఎంతో తెలుసు కదా. ఎక్కడో స్మశానం పక్కన వచ్చినా లాటరీలో, పక్కనే పెట్టుకున్నారు, అల్లుడు అండగా ఉంటారు అని.

ఆ స్ధలాన్నే, నా మేన కోడళ్ళు అంటే మామయ్య పిల్లలు ఇద్దరు కూ, సగం సగం ఇచ్చారు వాళ్ళ పెళ్లి లో. ఇది అంతా గతం. ఇప్పుడు మామయ్య కు, అవి గుర్తు లేవు, గుర్తు రావు. గుర్తు చేసే వారూ లేరు.

వాళ్ళ అమ్మ అంది నాతో - ఒరేయ్ మీ నాన్న, మామయ్య చిన్నప్పుడు, ఇక్కడ కు తెచ్చి డిపో ఇప్పించి, ఒక మనిషి లాగా నిలబెట్టినది అని. సరే సొంత పిల్లలు కే ఎటూ గుర్తు లేదు, ఇంక పెద్ద ఆసాములకు గుర్తు ఉండము కదా.

గతం మరచిన వారికి, కాలమే గుర్తు చేస్తుంది, కదా నారాయణ.


మామా అల్లుళ్ళు రెండు కులాలు అయినా, ఎంత ఒద్దికగా కలిసిపోయారు అని, చాలా మంది కన్ను కుట్టుకున్నారు ఆనాడు. అవసరము తీరాక బోడి మల్లన్న కధ గుర్తు ఉంటుంది గదా. అందుకే గతము మరచిన వారికి పుట్టగతులు ఉండవు అంటారు.

నాన్న ఉన్నప్పుడు, 2007 కు ముందు, మామయ్య తో చెప్పరు. అల్లుడూ ఖాళీ స్ధలం అలా వదలద్దు, మట్టి పోపించి, ప్రహారీ కట్టించు, ఇప్పుడు తక్కువ రేట్లు. లేదంటే జనం చెత్త పోస్తారు.

అక్కడ వర్షాకాలంలో నీళ్ళు నిలిచి, పురుగు పుట్ర దోమలు చేరి, చుట్టూ పక్కన ఉన్న జనం లేదా రోడ్ న నడిచే జనము, ఇబ్బంది పడతారు అని కూడా చెప్పారు.

రోగాలు వస్తాయి. పాములు కూడా వస్తాయి అని చెప్పారు జాగ్రత్తలు. ఇంతవరకు, ఇంచె కూడా మార్చలేదు. ఇప్పుడు కరోనా కూడా.

ఇటుపక్కన అటుపక్కన ఇళ్ళ గోడలు పడుతూ ఉంటే, అందరూ ఎదురు పోటు వేసుకున్నారు, ఏమీ అనలేక. అది మామయ్య వాళ్ళు ఎత్తు లేపితే, భూమి లో కలసిపోతుంది. అయినా, నాకు చెప్పకుండా కడతారా అని వాదన.

ఊళ్ళో ఉన్నవారు, వచ్చి, అవతల వారికి ఇబ్బంది నష్టం జరుగుతుంది ఏమో అని చూడటం, కనీస బాధ్యత మర్యాద కాదా? అని రాము గోపీతో చెప్పారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2213 General Articles and views 2,474,471; 104 తత్వాలు (Tatvaalu) and views 265,871
Dt : 19-Feb-2020, Upd Dt : 19-Feb-2020, Category : General
Views : 991 ( + More Social Media views ), Id : 352 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : uncle and son in law
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content