APLatestNews.com top Banner

Social Media links
కృష్ణవేణి - కృష్ణంరాజు వాణిశ్రీ - మానసిక జబ్బు, నటన అద్భుతం, ఉత్తమ నటి అవార్డు - Movie - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 నిమిష చదువు సమయం.

కొత్త తరానికి, పిచ్చి పట్టిన సినిమా పాత్రలు అంటే, ఈ మధ్యలో చూసిన, చంద్రముఖి లక లక లక మాత్రమే, గుర్తు ఉంటుంది.

కానీ అలా కాకుండా, ఇంకో పాత చిత్రం లో, ఒక మహిళ కు మానసిక జబ్బు అంటే హిస్టీరియా తో, ఆసుపత్రికి వెళ్లి, నయమై మంచిగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా, ఇంట్లో వారు, పని వారు మరియు సమాజం, ఆమె ను తమ అవసరాలకు లేదా తప్పులుకు సమిధగా చేసి, ఏ విధంగా వేధింపులకు గురి చేస్తే, ఆమె తట్టుకోలేక తిరిగి పిచ్చి పట్టి, ఎంత మానసికంగా కుంగి, వేదనకు గురి అవుతుందో, చక్కగా ఈ సినిమాలో చూపించారు.

అందుకే మంచివారు అందరికీ చెపుతుంటా, దేని గురించి ఎక్కువ ఆలోచన చేయవద్దు, కష్టాలు అవమానాలు నవ్వుతూ భరించాలి. ఎందుకంటే గతంలో మనం తప్పు చేసి ఉండవచ్చు. దైవ పూజతో మనసును, ధృఢ పరచుకోవాలి అని. శారీరక జబ్బు కు, మందు ఉంటుంది కానీ, మానసిక జబ్బు / బలహీనత కు మందు, ప్రేమ అభిమానం ఆప్యాయత మాత్రమే, ఇతర మందు లు ఉండవు, ఉన్నా పనిచేయవు.

కానీ పాత తరం వారికి గుర్తు ఉంటే, కృష్ణవేణి అని కృష్ణంరాజు వాణిశ్రీ నటించిన సినిమా, వీలుగా ఉంటే ఒకసారి చూడండి. అసలు ఆ సినిమా తీయాలంటే నే, ఎంతో ఓపిక సహనం మంచితనం ఉండాలి. మనము చూడాలి అన్నా కూడా అవి ఉండాలి, సగం ఆట తర్వాత చాలా సీరియస్ గా ఉంటుంది. మహానటి వాణిశ్రీ నటన అద్భుతం, ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. సహజముగా, అంతలా నటించడం కత్తి మీద సాము.

అందులోనే కృష్ణ వేణీ తెలుగుంటి విరిబోణి, శ్రీశైలం మల్లయ్య అన్న పాటలు ఉన్నాయి. ప్రజలకు తెలియాలి, ఒకసారి దెబ్బ తిన్న మనిషిని, మరలా అలా తమ స్వార్ధం కోసం హింసించడం తప్పు అని. కానీ మన సీరియల్స్ లో అవే చూపిస్తారు, మనము అదే చూస్తున్నాము, మెదళ్ళలో నాటుతున్నాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 854 General Articles, 46 Tatvaalu
Dt : 18-Oct-2020, Upd Dt : 18-Oct-2020, Category : Movie
Views : 141 ( + More Social Media views ), Id : 763 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : krishnaveni , movie , krishnamraju , vanisree , mental , illness , acting , awesome , best actress , award
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content