దూరపు గాన కోకిల కన్నా, కావు మనే కాకి తో మేలు ఎక్కువ, మనలో మంచి మనుషులు అంతే - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1251 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1281 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

కాకమ్మ కాకి కలవళ్ళ కాకి లోకాన ఏకాకి - వారాలబ్బాయి సినిమాలో పాట విన్నారా?

బాగా పాడే వారిని గాన కోకిల అని, అలాగే బాగా తీయని మాటలను చెప్పేవారిని పొగుడుతూ, ఎక్కువ మంది ఆకర్షితులౌతారు. కానీ ఆ ఒక్క కంఠం లేదా మాట తీయదనం వలన, వారి పాటలు మాటల అర్థం, వారి నిజ జీవిత గుణగణాలు లో, వారి రోజూ ఆచరణలో, ఉందా లేదా అని చూడం.

సోషల్ మీడియా లేదా వాట్సాప్ లో తాము ఆచరణలో చేయకపోయినా, మంచి మాటలు చెపుతారు పెడుతారు. అక్కడ నే ఎక్కువ మంది మోస పోతాం, మన బలహీన మనసుతో. కోకిల వలన, ఎవరికైనా ఉపయోగం ఉందా? ఏమో తెలీదు, మీరే చెప్పాలి.

అయితే కొంత మంది నిజాయితీగా తీయగా, ఉన్నది చెపుతారు, చేసి చూపిస్తారు కూడా, కొంత మీరు తిని తీసుకుని మమ్మల్ని గెలిపించండి, రాష్ట్రం ని కంపెనీ ని, అప్పు లలో ముంచుతాం ప్రజా స్థలాలు అమ్ముతాం తాకట్టు పెడతాం, మా కుటుంబం బంధువులు అనుచరులు ను, నిత్య ఆదాయం తో కోటీశ్వరులను చేస్తాం, మీ చేతుల్లో అంతో ఇంతో విదిలిస్తాం, పధకాలకు మా కుటుంబ పేర్లు పెట్టుకుంటాం అని వారు అంటే, గతము లో కూడా చేస్తే, మనం ఉన్మాదం తో ఓటు వేసి గెలిపించి బానిస బతుకులు గా మసలుతాం. మన వారు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, కేవలం ఎదురు పార్టీ నాయకులు ను లేదా ఎదుటి వారిని మాత్రమే తిడతాం.

అంటే మోహం, వ్యామోహం లో ఏది వాస్తవం ఏది నిజం, అనేది ఆలోచన చేయం, మనము మారం. రావణుడు దుర్యోధనుడు మరియు అనుచరులు కూడా ప్రాణాలు పోయిం దాకా, వారి బుద్ధి మార్చుకోలేదు మార్చుకోలేరు. అయితే నేటి కలియుగ రాక్షసులు కన్నా, వారు ఉత్తములు. ఎన్నడూ నటించలేదు, బహిరంగంగా తమ తప్పు ను కూడా చెప్పారు, ఒప్పకున్నారు.

అదే సామాన్య కాకి కంఠం, బండగా కావు కావు మంటూ ఉంటుంది. చాలా మందికి నచ్చదు. 100 లో 80 మంది, కోకిల ను ఇష్టపడతారు, కానీ కాకిని ఇష్టపడరు రాళ్ళు వేసి తరిమి కొడతారు. కానీ మనకు పనికి వచ్చే, మనసున్న సామాన్య జీవి, కాకి. జనం దూరంగా ఉంచినా, అవమానించినా, పొగడకున్నా, తన పని తాను చేసుకుని పోతూనే ఉంటుంది. మన పొగడ్తలు, అండదండలు, దానికి అవసరం లేదు.

మన పితృ దేవతలకు పిండాలు పెడితే, కాకులు వచ్చి తినాలి అప్పుడే పుణ్యం మనశ్శాంతి, అని మన పురాణాలు చెప్పాయి, పెద్దలు చెప్పారు. అంటే మన పెద్దలు కు, మనకు అనుసంధానం, కాకి మాత్రమే. కోకిల కాదు, తీయటి మాటలు పాటలు కాదు. ఎంతమంది కి ఆ విలువ, ప్రాముఖ్యం తెలుసు? ఆ వాస్తవం అర్థం చేసుకుని గౌరవించే, ఓపిక సంస్కారం కూడా లేదు, మనకు మరియు మన తర్వాత తరాలకు.

ఏలినాటి శని అని మనం పొగిడే భయపడే, శని దేవుడు కూడా, కాకినే వాహనం గా చేసుకున్నారు కదూ? కాకితో కబురు పంపినా మేము వస్తామని, సామెతగా అంటాము. బంధువులు వస్తున్నారు అంటే, మన ఇంటి వాకిట్లో లేదా మీద, కావు కావు అని అరచి, మనకు ముందే సమాచారం ఇస్తుంది, కానీ మనం అరిషడ్ వర్గాలలో మునిగి పాడవుతూ, కాకి గోల అని అవమానిస్తాము, పరమార్ధం తెలుసుకోలేక.

ఒక కాకి చనిపోతే, కాకితత్వంతో మనకు లేని మానవత్వమును గుర్తు చేస్తూ, 100 కాకులు చుట్టూ చేరి, సానుభూతి తెలుపుతూ అరుస్తాయి గోల చేస్తాయి అందరూ వినేటట్లు. మనకు సొంత వారి మీద కూడా, ఆ కృతజ్ఞతలు కూడా లేవు. తల్లి దండ్రులు ను దూరంగా వదలి లేదా ఆశ్రమం లో పెట్టి, హాయిగా కులుకుతూ, మంచి మాటలను తీయగా నటిస్తూ చెపుతూ లేదా పట్టనట్లు దాంకుంటూ, ఇతరుల ను కాకిగోల అంటూ, చీదరించుకుంటాము తక్కువ చేసి.

కానీ కాకి కి నష్టం లేదు, అవన్నీ పట్టించుకోకుండా, తన మంచి పని, పదిమంది కి ఉపయోగపడే పని, ఆచరిస్తూ , ముందుకు సాగుతూనే ఉంటుంది, ఎవరి అండ లేకపోయినా, ఒంటరిగా అయినా.

కళ్ళు తెరువు మిత్రమా, వాస్తవం తెలుసుకుందాం, అరిషడ్ వర్గాల ను జయిద్దాం. కాకి లాంటి వారిని గౌరవిద్దాం, మనం కాకి మంచి లక్షణాలు ను, ఆచరణలో పెడదాం. మనకు మంచి లేకపోయినా, మంచిని సమర్ధన చేసి అండగా నిలిచిన, మనకూ తెలీకుండానే మంచి అలవాటు అవుతుంది, మన పిల్లల కు సంస్కారం పెరుగుతుంది.

పాపపు పనులు, మోసం కుట్ర, జూదం తాగుడు సిగరెట్ మగువ లాంటి వ్యసనాల నుంచి, బయటకు రావడం తేలిక కాదు, కఠిన సాధన లేనిదే.

ముందు చిన్న గా మంచిని సమర్ధించడం, ప్రోత్సాహం చేయడం తో మొదలు పెట్టు, ఆత్మ శుద్ది చేసుకుందాం ఇకనైనా.

కోకిలలా చాటుగా ఉండకు ఎవరికీ దేనికి ఉపయోగము లేకుండా కనీసం మంచి మాట లేకుండా, కాకిలా పదిమంది కి కనపడుతూ, మంచి చేస్తూ చెపుతూ ఉండు నిస్వార్థంగా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1281 General Articles, 47 Tatvaalu
Dt : 08-Mar-2021, Upd Dt : 08-Mar-2021, Category : General
Views : 648 ( + More Social Media views ), Id : 1011 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kav kav , house crow , useful , better , cuckoo , kokila , good people
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content