Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. రేపు కార్తీక మాసం అయిపోతుంది, చాలా మంది అమ్మయ్య, ఇన్ని రోజులూ జనము కోసము ఏదో చేసాము, ఇంక నటించలేము, డబ్బు దండగ, మనసు ఎటూ లేదు. ఇంక దీపాలు పెట్టడము ఆపేస్తాము - ఇది మొక్కుబడిగా చేసేవారి ఆలోచన, వారి కుటుంబ సాంప్రదాయమును బట్టి.
ఒక దీపము పెట్టడము వెనక, ఎంత మానసిక శ్రమ ఉందో తత్వము ఉందో, తెలియదు మనకు. మనస్సు ప్రశాంతత లేని వారు, దీపము పెట్టలేరు. బాధలో ఉన్నవారు పెట్టే ప్రయత్నము చేస్తే, వారి మనసు కుదుటపడుతుంది. స్నానము చేసి లేదా కనీసము కాళ్ళు చేతులు కడిగి, దీపము వెలిగిస్తే, మనసు నెమ్మదిస్తుంది.
రోజూ నాకు మనశ్శాంతి ఉండాలి, రోజూ నేను కూడా ప్రశాంతమే. నేను చేసే ఏ పని, మొక్కుబడి కాదు. ఇలాగే కొనసాగిస్తా. రోజూ శివయ్య ను, కార్తీక మాసం లో లాగా, ఇంకో కార్తీక దీపంతో కొలుస్తా. దేవుడు ఇచ్చిన సొమ్ము తో, ఈ మంచి పని నిరాటంకముగా కొనసాగిస్తా - ఇది మంచి వారి ఆలోచన.
ధనం లేని వారు శక్తి లేని వారు బాధపడనవసరము లేదు, వారికి ఇది తప్పని సరి కాదు, పరిస్తితి శివయ్య అర్ధము చేసుకుంటారు. ఇది కేవలం, మన మనసు నియంత్రణ కు, ఒక మార్గము మాత్రమే.
ధనం ఉన్న వారు, అది లేని వారి కన్నా, మానసిక బలహీనురు. లేని వారు 4 తప్పులు చేస్తే, తమ అహంకారం తో ధనం ఉన్నవారు 40 తప్పులు దాకా, ప్రయత్నం చేస్తారు. లేని వారు 4 ని ఇబ్బందులు పెడితే, ధనం ఉన్నవారు 40 మందిని ఇబ్బంది పెట్టే, ప్రయత్నం చేస్తారు.
అందరూ అని కాదు, అరిషడ్ వర్గాలకు బానిసలైన వారు. కాబట్టి ధనం ఉన్నవారు, ఎక్కువ నీతి నియమాలను పాటించాలి. గురువులు, స్వామీజీల దగ్గర తిరిగే వారు ఎక్కువ వీరే.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,323,781; 104 తత్వాలు (Tatvaalu) and views 252,329 Dt : 24-Nov-2019, Upd Dt : 24-Nov-2019, Category : General
Views : 1694
( + More Social Media views ), Id : 228 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
kartika deepam ,
wealthy person ,
poor person Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments