అమ్మ భాష (తెలుగు) తల్లికి మల్లెపూదండ, కన్నతల్లికి మంగళారతులు - ఉగాది శుభాకాంక్షలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1495 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1530 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 3 min read time.

మాలాంటి అజ్ఞాన శిష్యులను, ఎల్లవేళలా కాపాడే, అండగా ఉండే గురువులకు, హ్రుదయపూర్వక శుభకృతు నామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు. గురు, శని, రాహు, కేతు, గ్రహాల మార్పులు, జాగ్రత్తలు సుమా.

ఈ రోజు సజీవ గురువు అమ్మకు, అలాగే అమ్మను కన్న తెలుగు నేలకు, అమ్మ భాషకు రాతలతో, మాటలతో, పద్యాలతో, పాటలతో ఏళ్ళు గా సేవ చేసే స్మరించే భాగ్యం, కలిగించడం లో, కొనసాగించడం లో, మీకూ భాగం భాగ్యం (పుణ్యం) ఉంది.

ఆ తెలుగు శుభాకాంక్షలు కావాలి, సున్నితమైన దైవ నమ్మకం గల, హృదయాలు నుంచి. ఎందుకంటే మన మాతృభాష, మాతృమూర్తి, మాతృదేశం పై, కృతజ్ఞతలు చూపడం కు, మన తల్లి తండ్రులు పెంచిన పెరిగిన ఉత్తమ సంస్కారం తో.

ధన్యవాదములు, మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్యాలు తో అరిషడ్వర్గాలు ను జయించే శక్తి తో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.

అమ్మ మాటంటే వేదం, అదే మన జీవన నాదం, సజీవ గురోప దేశం. పిల్లల సంస్కారం బట్టి, ఆ తల్లి ఎంత పుణ్యాత్మురాలో చెప్పవచ్చు, వారి పాదాలకు నమస్కరించవచ్చు. అందుకే మాత్రు దేవోభవ అంది, అమ్మ కూడా గురువే దేవతే, దేవుడు గురువు కూడా ఆ అమ్మ తర్వాతే అంది, వేదం. త్రిమూర్తులను కూడా బిడ్డలను చేసి ఆడించింది ఆ అమ్మే (అనసూయ).

అమ్మను తలచుకుంటేనే ఏదో తెలియని ఆనందం, ఏదో ఆత్మీయ అనుభూతి, ఏదో అతీంద్రీయ బంధం, ఏదో జన్మ జన్మ ల బంధం.

నవ మాసాలు మాంసపు ముద్ద గా మనల్ని, భద్రము గా సంచి లో పెంచి, తన ఆహారము ప్రాణవాయువు లో భాగమిచ్చి బతికించి, పోషించి రక్షించి తాను క్షీణిస్తూ, మన బరువును ఆనందముగా శరీర భాగముగా మోసి, చివరకు పేగు తెంపి, భూమి పై వేసిన రోజున,

అమ్మా నన్నెందుకు వదులుతున్నావమ్మా వేరుచేస్తున్నావమ్మా అన్ని గుక్కపెట్టి ఏడుస్తుంటే,

బిడ్డా ఏడవకు, నువ్వు ఈ భూమిపై, మన తర తరాల వంశాల పేరు నిలబెడుతూ, పంచభూతల తోడుతో, వాటి రుణం తీర్చుకుంటూ, కన్న రుణం, పిత్రు రుణం, భాష రుణం, దేశ రుణం, కొంతైనా తీర్చుకుంటూ తలచుకుంటూ, దేవుడిచ్చిన సత్ కార్యాన్ని,

పదిమంది కి పంచి సాత్వికులు మెచ్చుకునే విధముగా, పూర్తి చేయడానికి కావల్సిన, కనీస సదుపాయాలు ఇవ్వడానికి, నేనున్నా, మరి నీవు అవి నెరవేర్చాలి, నారాయణుడి లో నిమిడి ఉన్న ఈ జగమంత కుటుంబములో చిట్టి కన్నా,

అని బుజ్జగిస్తూ ముద్దు పెడుతుంటే, ప్రపంచంలో ఏ శక్తి వచ్చినా, అమ్మ ఉందనే ధైర్యముతో మనశ్శాంతి గా నిద్రపోతాము.

మరి అలాంటి దేవతతో మనము మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది, మన తీయటి తేనెల తెలుగు భాష. సారి అని 10 సార్లు అంటాము, కానీ క్షమించు అని ఒక్కసారి అనాలన్న, గుండె లోతుల్లో నుంచి సంస్కారం పెల్లుబికాలి మరి. అది భాష గొప్పతనం.

దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ, ఏ దేశమేగినా పొగడరా నీ జాతిని అంటూ, ఆ భాషను మనము మాట్లాడటానికి, సోషల్ మీడియాలో రాయడానికి, స్నేహితులకు చెప్పడానికి, సిగ్గుపడుతున్నాము అంటే, మనసు రావడం లేదు అంటే, 5 ఏళ్ళుగా అమ్మ నాన్న లాగా వెంటపడుతున్నా కూడా, ఇక మన అంత, నీచుడు క్రుతఘ్నుడు ఇంకొకరు ఉంటారా?

ఆ పాపం మనకు వద్దు, ఆ ద్రోహం మనకు వద్దు భవిష్యత్ లో, తప్పక అది వెంటపడుతుంది, మన పిల్లల రూపములో. 5 ఏళ్ళ నుంచి, గురువులైన మిమ్మల్ని వేడుకుంటుంది ఇదే.

విష్ణు మాయలో మీకు అర్ధము కావడము లేదు, కనపడే బ్రమలే మీరు నిజం అనుకుంటున్నారు.

మన ప్రతి ఆలోచన, కదలిక, సంకల్పం, క్రుతజ్ఞత, త్యాగం, పుణ్యం, పాపం, అన్ని పంచభుతాలు రికార్డ్ చేస్తున్నాయి, వాటిని ఎవరూ తప్పించుకోలేరు.

మనకు శక్తి లేనప్పుడు కర్ర ఎలా పట్టుకుంటామో, మనకు ఈ జ్ఞానం లేనప్పుడు అర్ధం కానప్పుడు, అవి తెలిసిన వారిని పట్టుకుని, అరిషడ్వర్గాలను సాధించి, దేవుని దగ్గరకు గర్వముగా తిరిగి వెళ్ళాలి, కొత్త పని ఇస్తావా తండ్రీ అని, రాఘవేంద్ర స్వామి లా, వీర బ్రమ్మములా, యోగి వేమనలా, ఆదిశంకరుని లా, ప్రహ్లాదుడిలా, రామానుజునిలా.

మీరు పాడుతూ పిల్లలతో పాడిస్తారు కదూ, శ్వాస ప్రక్రియ, ఆరోగ్యం. (Video)

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

గలగలా గోదారి కదలిపోతుంటేను 2
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ.. 2
మురిపాల ముత్యాలు దొరులుతాయి.. ||మా తెలుగు తల్లికి ||

అమరావతి గుహల అపురూప శిల్పాలు 2
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై, నిలచి వుండేదాకా

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.

Jasmine flower garland for mother language Telugu mother, Mangalarats for mother-Ugadi greetings  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1530 General Articles, 51 Tatvaalu
Dt : 01-Apr-2022, Upd Dt : 01-Apr-2022, Category : General
Views : 198 ( + More Social Media views ), Id : 1324 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jasmine , flower , garland , mother , language , telugu , talli , mangalarati , ugadi , greetings
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content