Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.
రమేష్, సురెష్ తో తన తల్లి గురించి ఇలా చెపుతున్నాడు ఫోటో చూపించి. శ్రద్ధగా ఓపికగా వంట ఇంట్లో అట్లు(దోశ) పోసుకుంటన్న, 74 ఏళ్ల నా కూతురు (అమ్మ), ఆత్మ విశ్వాసం చూడండి, దేవుడు ఉన్నారు అని నాకేమి కాదులే అన్న ధైర్యము.
* ఆ ధైర్యం నాకు లేదు. ఆ చెప్పులు, పాంటు, చొక్కా, జడ ముడి, చూడు ఇక్కడకు తగ్గట్టుగా వస్త్రధారణ వంట చేసేటప్పుడు.
* బీపీ, షుగర్, తల తిరుగుడు తో, రెండు సార్లు ఎమర్జెన్సీ కి వెళ్ళి, రోజూ 7 బిళ్ల లు మింగుతూ, మైలు దూరము నడుస్తూ, మనం 74 లో అలా ఉండగలమా? మన వల్ల కాదు, ఉండలేము.
* చీర కాలికి తగిలినా పడి పోతుంది. మన చేతిలో గాజు బొమ్మ లాగా, ప్రతి క్షణం గండం నూరేళ్ళు ఆయుషు లాగ. మీరు, నడక నేర్చే సంవత్సరం పిల్లలని పెంచి ఉంటారు కదా, ఆ బాధ కష్టము ఓర్పు, మీకు తెలుసు.
* బయట వారిని కలిసేటప్పుడు, గుడి కి వెళ్ళేటప్పుడు, తప్పనిసరిగా చీర కడుతుంది. మిగతా అప్పుడు జారి పడకుండా, తేలికగా అమెరికా పాంటు షర్ట్. మన సాంప్రదాయం తప్పేది లేదు - కళ్ళాబి, ముగ్గు, రామకోటి, నేతి దీపం, ఇంకా ఎన్నో.
* సాధ్యమైనంత వరకు చెయ్యి, కర్రతో నడిపిస్తా నడిపిస్తా పడకుండా. 5 ఏళ్లుగా నడవాలి, కాయ కూర రసాలు తాగాలి, ఆరోగ్యము ముఖ్యము. అందులో కనికరం లేదు, ప్రాణం నిలవాలి కదా.
* అమెరికా దేశము, మా రాష్ట్రము గర్వంగా అడగొచ్చు, పెద్ద ఆమెను మేము గౌరవం గా, సదుపాయాలు అండ ఇచ్చి, ఇన్ని రోజులు బంగారముగా చూసాము కాపాడాము, మా పౌరు రాలు కాకపోయినా.
మరి మీ దేశం, మీ జనాలు, విదేశీ లేదా కనీసము స్వదేశీ పెద్దలు ను, ఇంత గౌరవం గా భద్రత గా ఉంచుతారా చూస్తారా అని? జవాబు మనందరికీ తెలుసు, కడుపు చించుకుంటే, కాళ్ళ మీద పడుతుంది అంటారు అదే.
* ఇప్పుడు చెప్పండి, నాకు పిల్లలు లేరా? నా కూతురు కన్నా, మీరు మీ పిల్లల(తల్లి దండ్రులు) ను బాగా చూసారా? చూస్తారా? చూస్తే మీ పిల్లలూ ధన్యులే, మీరు సంస్కారులే.
* రూపాయి ఆస్తి లేని, నా కూతురు ని కాపాడుతుంది సంతానమా, లేక తల్లి దండ్రులు నేర్పిన సంస్కారమా?
* దీనిని కృతజ్ఞత బాధ్యత అంటారా? లేక డబ్బు కోసం గడ్డి తినడము నటించడం అంటారా, కన్న తల్లి దండ్రులను విడిచి?
* ఆత్మ త్రృప్తి , ఐశ్వర్యం అంటే ఇదా, లేక మీరు భ్రమపడే, శాశ్వతం కాని, భోగాలు ఆస్తులా? లేక వాటివలన వచ్చే రోగాలు రొప్పులా?
ఆత్మ విమర్శలు చేసుకోండి. అప్పుడు మీరే దేవుడు. బయట గురువు, దేవుడు, పూజ అవసరం లేదు.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 951 General Articles, 46 Tatvaalu
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments