Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
తూకంలో రొయ్యలు ఎక్కువగా బరువు తూగాలని ...... వాటికి ఇంజెక్షన్స్ వేసి ఎలా బరువు పెంచుతున్నారో చూస్తున్నాము, ఫోటోలు వీడియోలు ముఖ పుస్తకం లో(ఫేస్ బుక్). అలాగే చేపలు , మాంసం కూడా. మరి ఇది ఎక్కడో తెలీదు. అలాగే వాటి పెంపకం లో, ఏమి వాడుతున్నారో, ఆ దేవునికే తెలియాలి.
అయినా మనం మాత్రం మానొద్దు, ఖర్చు ఎక్కువ అయినా, పోతే విలువ లేని మన పాణం పోద్ది, మనవాళ్లు రోడ్డు మీద పడితే పడతారు, పైకి పోయాక మనకేం బాధ, దేశ జనాభా తగ్గిచ్చడం లో భాగస్వామ్యం అవుదాం. అంత మాత్రం దానికే, నోటి రుచి జిల తగ్గిచ్చుకుందామా?
ఇంజక్షన్ చేసిన బర్రె పాలు తాగితే లేని బాధ , దీనికెందుకు వయ్య అంటారా? జై కల్తీ చేప రొయ్య మాంస రుచి బద్దుడా!
ఒకరు అడిగారు , మంచి మాంసం కావాలంటే, నేరుగా గొర్రె కొంటే లేదా ఆర్గానిక్ మాంసం కొంటే సరిపోతుంది గదా అని.
అన్నిటికీ జవాబు ఒకటే, బర్రె కు మరియు దూడకు ఇంజక్షన్ ఇచ్చి పెంచు తున్నారు, వాటి పాలు పంచు తున్నారు. పాకెట్ పాలు కూడా, తక్కువ ఏమీ కాదు విషంలో.
తేలిక మార్గం, వాటికి దూరంగా ఉండటం. అమ్మో, అసాధ్యం ప్రాణం పోదూ!
చెడ్డ గుణ సంపన్నులమైన మనం , తినడం ఆపుకోలేక పోతే , పసి పిల్లలు గా వాటిని ,మన ఇంట్లో పెంచి పెద్ద చేస్తే తప్ప, నిజమైన మంచి మాంసం, చేప రాదు.
ఊకోవయ్యా, పిల్లల నే, హస్టల్ లో వేస్తే, వీటిని ఏడ పెంచ మంటావు. నాకు డబ్బు ఉంది , నా నాలుక రుచి ముఖ్యం, ఆ తర్వాతే, నా కుటుంబం పిల్లలు ఎవరైనా అంటారా?
ఇంక అడ్డు ఏముంది, అంత నిజాయితీగా ఒప్పుకుంటున్నాక, మరి లాగించేయ్ గొర్రె , వేయించేయ్ కోడి , పయనించెయ్ పైకి , నెట్టేయ్ మనవాళ్ళ ని వీధికి.
జయహో నాలుకా , జయహో కలి నాయకా! జై నాలుకా , జై జై కలి నాయకా!
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,116; 104 తత్వాలు (Tatvaalu) and views 265,989
Dt : 05-May-2019, Upd Dt : 05-May-2019, Category : News
Views : 1697
( + More Social Media views ), Id : 102
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
fish ,
meat ,
injection ,
Prawn and Shrimp
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments