APLatestNews.com top Banner

Social Media links
ప్రతి వారిలో వీలైనంత వరకు తల్లి(తండ్రిని) ని చూసుకుంటే, వారు మన జోలికి రారు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఇంకొక కాలేజీ అబ్బాయి కొంటె ప్రశ్న, జవాబు అలాగే ఉంటుంది మరి, తిట్టవద్దు సరదాకు మాత్రమే.

మీ మాటలు వింటే , నాకూ మతి పోతుంది అండి. ఈ వయసు లో భార్య కాళ్ళు పట్టుకోవాలి గానీ, అమ్మ కాళ్ళు ఏమిటి అండి. మరి మీ మాటలు వింటే, ఎవరైనా కరుగుతారు కదా. మరి మీకు ప్రమాదం ఇబ్బంది లేదా?

ఉండదు , సహజంగా దూరంగా నే ఉంటాము కదా. ఎందుకంటే, మన వలన ఎవరికీ ఇబ్బంది కలగ కూడదు. మనము చేసేవి, వారికి పాటించడం కష్టము, దానికి లింగ బేధము లేదు. మనతో మాట్లాడే చుట్టాలను లేదా దగ్గర వారిని అడుగు. అందరినీ అమ్మా అని పలకరిస్తాము, 80 శాతం పక్కకు వెళ్ళినట్లే. కొంతమంది వీడి బొంద, నన్ను అమ్మా అంటాడేంది, తిక్కలోడు అనుకోవచ్చు.

మిగతా వారిని ఎప్పుడూ లోపాలు మాత్రమే ఎత్తి చూపుతాము, ఎందుకంటే వారి భవిష్యత్తు లో బాగుండాలి అని, మంచి పనులు ను మామూలుగా మెచ్చు కుంటాము. వాళ్ళ కీ విసుగు వస్తుంది, ఎందుకంటే ఎప్పుడూ కూడా పొగడ్తలు ఉండవు, ముఖస్తుతి ఉండదు, ఎవరైనా కూడా. వాళ్ళంతా, ఈ పిచ్చాడి తో మనకేం పని, అని సహజం గానే దూరంగా నే ఉంటారు.

ప్రతి వారిలో వీలైనంత వరకు తల్లి(తండ్రిని) ని, వీలు కాకపోతే అక్కలా(అన్నను) సినిమాలో కోవై సరళ గారిని చూసుకుంటే, వారు మన జోలికి ఎప్పుడూ రారు. వారే ఆమడ దూరంలో ఉంటారు. అది అందరికీ మంచిది, అని గతంలో పిఠాపురం పిచ్చయ్య గారు చెప్పారు అనుకుంటా.

తప్పులు అందరం చేస్తాం, గతం లో చేసి ఉంటాము కూడా, కానీ చేసిన తప్పులు మరలా మరలా చేయకూడదు. మనకు మోహం లో అది అర్థం కాదు, అర్ధము అయ్యాక, అది వ్యర్థం మాత్రమే అవుతుంది.

కానీ సత్యం ఏమిటి అంటే, తల్లి దండ్రులను (60 లలో లేదా జబ్బున పడినప్పుడు) ప్రేమించి గౌరవించే వారే, వారి భార్య/ భర్త ను, పిల్లలు ను, స్నేహితులు ను నిజముగా ప్రేమించగలరు, బాధ్యత గా ఉండగలరు, మిగతా వారిని ఉంచగలరు, తరగని నమ్మకస్తులు.

అన్నాడు రాఘవ, తన స్నేహితునితో లోకాభిరామాయణం మాట్లాడుతూ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 615 General Articles, 46 Tatvaalu
Dt : 06-Oct-2019, Upd Dt : 06-Oct-2019, Category : General
Views : 203 ( + More Social Media views ), Id : 183 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : respect everyone as mom or dad , respect parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content