Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, భావోద్వేగాల పరంగా ఆరోగ్యం గా మరియు బాగుండాలి అంటే, మనము 4 లంఘణాలు చేయాలి, అలవాటు చేసుకోవాలి. మన పూర్వీకులు ఇవన్నీ వేదాలు, శాస్త్రాలలో చెప్పి ఉన్నారు.
1. అన్న లంఘణం, ఉపవాసం పరమ ఔషధం. అంటే తక్కువ తిండి లేదా కొన్ని పూటలు మానేయడం, ఆరోగ్యం కు ఎంతో మంచిది. రోగాలు తక్కువ, ఉత్తేజం గా ఉంటారు. అన్ని శారీరక వ్యవస్థలు బాగా పని చేస్తాయి. మామూలు అప్పుడు కూడా, ఆకలైనప్పడు మాత్రమే తినాలి. అదీ పరిమితంగా, సాత్విక ఆహారం. చాలా మంది, శరీరం అంటే, కేవలం తిని జీర్ణం చేసుకునే యంత్రం, అనేట్టుగా భావించి తింటూ ఉంటారు. ఆ భావన తప్పు, దాని వలన రోగాలు, నీరసం, అధిక బరువు, లావు, ఇంకా ఎన్నో ఇబ్బందులు చూస్తున్నాము.
ముక్కులు, అంటే సూర్య నాడి, ద్వారా గాలి (శ్వాస నిశ్వాసలు) ధారాళంగా వెళ్ళేటప్పుడు మాత్రమే తినాలి. జ్వరం వస్తే, ముక్కులు గాలి పీల్చడం తగ్గుతుంది, అందుకే భోజనం వద్దు అంటారు. జంతువులు కూడా, రోగం వచ్చినప్పుడు, ఏమీ తినవు, ఎందుకంటే వెంటనే కోలుకోవాలని.
2. గాలి లంఘణం. అంటే తక్కువ గాలి పీల్చడం. యోగులు ఉఛ్వాస నిశ్వాసాలను నియంత్రణ చేస్తారు.
ఎప్పుడు అయితే శ్వాసను నియంత్రణ కలిగి ఉంటామో, అప్పుడు వయస్సు తక్కువ కనపడతాము, ఎక్కువ కాలం బతుకుతాము. మన ఆలోచన లు నియంత్రణ పెరిగి, మంచి (పాజిటివ్) ఆలోచన లు వస్తాయి, చెడు (నెగటివ్) తొలగిపోయి.
శ్వాస తో ఆక్సిజన్ లోన కి తీసుకున్నప్పుడు అల్లా, మనలో ఉండే కణాలు ఉత్తేజితం అయి, ఖర్చు చేయబడుతూ ఉంటాయి. అంటే కొన్ని వందల కణాలు పుడుతూ చస్తూ ఉంటాయి కదా, ఆ పద్ధతి ని లేటు చేస్తున్నాము. కాబట్టి, బతికే వయస్సు పెరుగుతుంది, మనసు నిలకడతో, మంచి ఆలోచనలు కు కారణం అవుతుంది.
3. మాట లంఘణం, అంటే ఆలోచన చేసి, జాగ్రత్తగా అవసరమైన వరకే, నిజమైన మంచి మాట మాత్రమే, సౌమ్యంగా మాట్లాడటం. వాక్ శక్తి పెరుగుతుంది. ఇది కొంతమంది కే సాధ్యమౌతుంది.
4. కదలిక లంఘణం, అంటే కదలిక లు తగ్గడం. అంటే తింటూ టీవీ చూడటం లేదా పడుకోవడం కాదు. కూర్చుని ధ్యానం లేదా ప్రకృతి శబ్దాలు వినడం లేదా దైవ నామ జపం. కనీసం ముందు, పది నిమిషాలు ధ్యానం లో కూర్చొని ఉన్నా, ఆ శక్తి ని గ్రహిస్తారు, చిన్నగా సమయం పెంచుకోవాలి.
ఈ నాలుగు లంఘణాలు ను చిన్నగా అలవాటు చేసుకుంటే, మనలో చాలా మార్పులు వస్తాయి భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా. సర్వేజనా సుఖినో భవంతు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2218 General Articles and views 2,490,386; 104 తత్వాలు (Tatvaalu) and views 267,103
Dt : 04-Apr-2020, Upd Dt : 04-Apr-2020, Category : General
Views : 1246
( + More Social Media views ), Id : 470
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
langhanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments