APLatestNews.com top Banner

Social Media links
విగ్రహం లేదా రధం పాడు చేసిన, కొత్త ది పెడతారు? ఆందోళన ఎందుకు, అనడం సబబేనా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 923 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఏవండీ, ఓ విగ్రహం లేదా రధం పాడు చేసిన, కొత్త ది పెడతారు కదా? ఆందోళన ఎందుకు అనడం లేదా గమ్ముగా ఉండటం స్పందించకుండా సబబేనా?

జవాబు, మన పిల్లాడు ఇంట్లో బొమ్మలు తో చిన్న కట్టడం కట్టాడు, పక్కింటి పిల్లాడు వచ్చి పడేసాడు, మన పిల్లాడు ఏడ్చాడు. వెంటనే మనం వచ్చి, పక్కింటి వాళ్ళ ను పిలిచి, దుమ్మెత్తి పోస్తాం, బుద్ది ఉందా ఇదేనా పిల్లల పెంపకం అని, ఎందుకు?

బొమ్మలు కట్టడం మరలా కట్టవచ్చు తేలికగా కదా? కానీ మన సొంత పిల్లలు అంతసేపు కష్టపడి కట్టారు, దానిని గౌరవించాలి, అన్న ప్రేమ. అదే పని మన పిల్లలు పడేసిన, ఏదో తెలీక చేశాడు, పసోడు అని బుజ్జగింపు. అక్కడ నే మన స్వార్థం స్పష్టం.

కృతజ్ఞతలు ఉన్న పిల్లలు ఇంట్లో, బతికి ఉన్న తల్లి దండ్రుల ఫోటో గోడ మీద ఉంటుంది. బంధువు వచ్చి, నేలపై వేసి కొట్టారు ఫోటో ని. మనం మరలా ఫోటో తీసుకుని కట్టించుకోవచ్చు కదా లేదా అతను ధనం ఇస్తామంటున్న గమ్ముగా ఉంటామా? దులిపి పారేయమా, సంస్కారం పెద్దా చిన్నా లేవా అని? అదే మన పిల్లలు అలా చేసిన, నాలుగు తగిలించమా, బాధ్యత గల పెద్దలు గా?

ఫోటోనే కదా? ఇంకా బతికే ఉన్నారు కదా, పేరెంట్స్? కోపం, అరుపులు, అలగడం ఎందుకు? అక్కడ ఫోటో ఫ్రేం విలువ కాదు ముఖ్యం, తల్లి దండ్రలు అంటే గౌరవం. అది కేవలం ఫోటో కాదు, మన తల్లి దండ్రలు సజీవంగా మన ఎదురు ఉన్నారు అని భావిస్తాము, దండం పెడతాము. అన్ని వర్గాలు మతాలు తల్లి దండ్రలు ఫోటోల కు అదే విలువ ఇస్తాయి.

గతంలో అమెరికా ఫ్లోరిడా లో, ఒకరు మత గ్రంధం తగలు పెట్టారు అని, ప్రపంచం అంతా నిరసనలు వ్యక్తం చేశారు. ఎందుకు అలా అంతమంది నిరసన, ఆందోళనలు చేశారు? ఆ పుస్తకం ఉచితం గా ఇస్తారు లేదా మరలా కొనుక్కోవచ్చును గదా? అక్కడ ఖరీదు లేదా మరలా కొనడం కాదు ముఖ్యం, వారి పవిత్ర గ్రంధానికి జరిగిన అవమానం.

అలాగే, హైందవులకు విగ్రహం అంటే రాయి కాదు. పై ఉదాహరణ లో మత పుస్తకం అంటే ఉత్త కాగితం కాదు కదా, అది తమ నమ్మకం అని ప్రపంచం లో వారి తరపున అంగీకరించారు కదా. అలాగే విగ్రహం అంటే, హిందువుల నమ్మకం, తమ దేవుడు ఆ రూపంలో, తమ విన్నపాలు అందుకుంటారు అని.

కొందరు క్రాస్ లేదా మూన్ రూపంలో చూసుకుంటారు, మెడలో వేసుకుని గౌరవిస్తారు, అది వారి విశ్వాసం. దానిని అగౌరవ పరిస్తే ఊరుకుంటారా? ఓ పిచ్చి దండే గదా అంటారా?

అంతెందుకు ఓ రాజకీయ నాయకుని విగ్రహాన్ని ఎవరైనా ఏమైనా చేస్తున్న, అనుచరులు ఊరుకుంటారా? దేశమంతా ధర్నా లు చేయరా? ఓ సిమెంట్ విగ్రహమేలే అంటారా?

ఏ మతంలో అయినా, ప్రేయసి ప్రియులు ఇచ్చుకునే బహుమతులు జ్ఞాపకాలను, ఎవరైనా ధ్వంసం చేసిన, ఊరుకుంటారా? కనీసం సమాధిని ధ్వంసం చేసినా, మనోభావాలు దెబ్బతిందని అంటాము కదా?

అలాగే మనకూ హిందువులకు కాబట్టి, మన విశ్వాసం నమ్మకం మీద జరుగుతున్న ఇబ్బంది కర పరిస్థితి ని, మనందరం చక్కదిద్దేందుకు ప్రయత్నం చేయాలి, ప్రభుత్వం కు చట్టం కు సహకరిస్తూ.

కాబట్టి బాధ్యత గల ప్రతిపక్షాలు, శాంతి యుత నిరసనలు తెలుపుతున్నారు. అలాగే ప్రభుత్వం, దర్యాప్తు చేస్తోంది నిందితులను పట్టుకోవాలి అని.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 951 General Articles, 46 Tatvaalu
Dt : 02-Jan-2021, Upd Dt : 02-Jan-2021, Category : General
Views : 58 ( + More Social Media views ), Id : 905 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : hindu statue , chariot , damaged , new one , dont worry , calm down , ap , jagan , chandra , pawan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content