మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1944 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1979 General Articles and views 1,677,265; 102 తత్వాలు (Tatvaalu) and views 207,678.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.1 min read time.
రచయిత సిరివెన్నెల, దర్శకుడు బాలచందర్ మరియు గాయకుడు బాలు గార్లకు నివాళులు అర్పిస్తూ, ఇళయరాజా గారి మధుర సంగీతంలో, చిరంజీవి నటిస్తూ జీవించిన, ఉత్తమ 3 జాతీయ అవార్డుల సినిమా, రుద్రవీణ లో పాట గుర్తు ఉందా (See Video)?
మీరూ పాడే ప్రయత్నము చేయండి, భావం అర్ధం చేసుకుంటూ, సంస్కారం క్రుతజ్ఞతలు పెంచుకుంటూ. 2 నిమిషాలలో, మన గొంతు జీర పోకూడదు గాత్ర స్థాయి తగ్గకూడదు, బండ గొంతు ఉన్నా పర్లేదు. శ్వాస మీద పట్టు ఉండాలి, ఊపిరితిత్తులు కరోనా దెబ్బకు లొంగలేదు, మన సాత్విక సాధన బాగుంది, అని ఆ ప్రాణవాయువు తో ఈ పాటతో వ్యాయామం చేయాలి.
ఈ వారము నుంచే జలనేతి ప్రక్రియ అని, ఈ నాసిక రంధ్రములో కాచి వడపోసి కాస్త ఉప్పు వేసిన నీరు పోసిన, ఆ రంధ్రములో నుంచి మరియు నోటి లో నుంచి, నీరు రావాలి అంటా, సాధన మొదలు పెట్టాము (See Video). కఫము తగ్గుతుంది, ముక్కు వ్యాధులు రావు. సరే పాట లోకి వద్దాము. ఫోటో వాట్సాప్ స్టేటస్ లో ఎప్పుడు లాగనే మరువద్దు సుమా.
చుట్టుపక్కల చూడరా చిన్నవాడ! చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ - నేటికీ ఆ పాటకు అర్ధం పరమార్ధం ఉంది. ఎప్పుడో చూసిన పాట, ఇప్పటికీ గుర్తు ఉంది, వినండి మన గార్ధభ గొంతుతో. అక్కడ, గుడి జపం అని ఉన్నా, ఇప్పుడు సంపాదన జపం, సంసార జపం, ఆనందాల సౌకర్యాల మత్తు జపం, సినిమా జపం, రాజకీయ జపం, అలా ఎన్ని జపాలు పెట్టుకుని ఈ పాటను పాడినా అదే అర్ధం వస్తుంది.
* చుట్టుపక్కల చూడరా చిన్నవాడ! చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ
- ఎంతో మందిమి, మన చుట్టూ జనాల చుట్టాల స్నేహితుల పరిస్థితులు గమనించకుండా, కళ్ళు మూసుకుని లేదా నేల మీద నడవకుండా గాలిలో నడుస్తున్నాము. నా వరకు బాగుంటే చాలు అని, రేపు నా పరిస్థితి అదే అని గమనించక.
- ముదుసలి తల్లి దండ్రిని అనాధాశ్రమములో లేదా ఒంటరిగా ఇంట్లో బంధువులతో వేసి, గుడికి వెళితే పుణ్యం వస్తుందా? గొప్ప సంపాదనతో బతకమని, హైదరాబాద్ ఢిల్లీ బెంగళూర్ దుబాయ్ లండన్ అమెరికా కు మనల్ని తల్లి దండ్రులు పంపిస్తే, మన తల్లి దండ్రులను, గ్రామము లేదా పట్టణము లో నే చావమని తమ్ముడి చేతిలో ఓ లక్ష పడేసి పనిమనిషిని పెడితే సరిపోతుందా, దైవ పూజలతో?
- కోట్లు సంపాదించి, పదవులు వెలగబెట్టి, ముదుసలి తల్లి దండ్రులకు ఇవ్వని చూపని క్రుతజ్ఞతలతో, అర్ధం ఏముంది?
- కరోనా తో పోతున్నారు అని తెలిసి టీకా వేసుకోకుండా ఉంటే, పూజ కు విలువ ఉందా? గుడిలో విగ్రహాన్ని తాకి, అందరూ అలాగే తాకి కరోనా పాకితే, పూజకు విలువ ఉందా?
* స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు, సాటి మనిషి వేదన చూస్తు జాలిలేని శిలవైనావు
- ముదుసలి తల్లి తండ్రిని, అత్తా మామను గాలికి వదిలి, గుడికి వెళితే యాగాలు పూజలు చేస్తే ఉపయోగము ఏమిటి?
- విగ్రహాలను తాకుతూ లేదా బయట గాలికి తిరుగుతూ, కరోనా తో ఎంతో మంది ఆసుపత్రికి పోవడానికి ప్రాణాలు పోవడానికి, జాలి లేకుండా కారణము అయ్యి, గుడికి వెళ్ళి ప్రయోజనం ఏమిటి?
- ఇంట్లో వారి లేదా పక్క వాడి బాధ వినే లేదా పలికే ఒపిక లేని మనకు, సోది అనుకునే మనకు, దైవం సహాయం చేయాలా?
* కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే
- పెద్ద చదువులు అంటే, కరుణ జాలి దయ సంస్కారం ఇంగితజ్ఞానం, అన్ని పోవడమేనా?
- చదువుకున్న వారి కన్నా, చాకలి వారు మేలు, బుద్ది నీతి క్రుతజ్ఞత లెక్కలు లో, అన్న వాక్కు నిజము కాదా? చదువులేని వారికి ఉన్న జాలి దయ మనకు ఉందా?
- పెద్ద నగరాలలో ఉంటూ, విదేశాల్లో ఉంటూ, తమ తల్లి దండ్రూలకు అక్కడి వైద్యం ఇప్పించని బండ రాళ్ళు ఎన్నో ఉన్నాయి మనలో, మరలా నీతులు చెపుతూ.
* నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది
- ఇంత స్థితికి ఈ సంఘము తీసుకు వచ్చింది, ఒక మెతుకు ఇతరులు పండిస్తే మనము తింటున్నాము అని తెలిస్తే, అబద్దాలు మోసాలు కుట్రలు చంపుకోవడాలు తన్నుకోవడాలు కల్తీలు తిట్లు ఉంటాయా?
- అబ్బే పక్కోడి విషయము మనకు వద్దు, మన స్వార్ధమే మనకు ముద్దు, ఇదే కదా మన అందరి పరిస్థితి?
- సంఘము కుళ్ళి పోతే, మన ఇల్లు కూడా కుళ్ళి పోద్ది అని ఎందుకు గ్రహించము? అడవి తగల బడితే, పచ్చని చెట్టు ఒక్కటే ఉండగలదా, తగలబడకుండా? మనము మారకుండా, సంఘము ఎలా మారుతుంది?
- చిన్న గ్రామము పట్టణము నుంచి బెంగుళూర్ లేదా విదేశాల లో ఉద్యోగము చేసే వాడు కూడా, సంఘము నాకేమి ఇచ్చింది, నేనెందుకు సంఘాన్ని పట్టించుకోవాలి అంటారు. ఆఫ్రికా లేదా నిత్యము యుద్దాలు దాడులతో కంటి మీద కునుకు లేని దేశాలలో, ఓ 10 ఏళ్ళు వీరిని వీరి పిల్లలను పెట్టి జీవించమంటే, అప్పుడు తెలుస్తుంది, మన సంఘము విలువ.
- కోట్లు సంపాదించేవాడు కూడా, అబ్బే మా ముదుసలి తల్లి దండ్రులు మా లాంటి క్రుతఘ్నుల దగ్గర నమ్మి ఉండలేరు అండి, అందుకే మా పల్లెలోనే పడి పోతాము అన్నారు అని గర్వముగా చెపుతున్నారు.
- గెలిచిన నాయకులు, ఆ ప్రజలతో నూ, ఆ పార్టీ తో కూడా ఉండటం లేదు.
- పెళ్ళి చేసుకున్న జీవిత భాగస్వామి, ఆ భాగస్వామి క్షేమం చూస్తూ, రక్షణ కవచము లా ఉండటంలేదు.
- తెలుగు నేల మీద నుంచి డిగ్రీ చదివిన లేదా సాఫ్ట్ వేర్ వాళ్ళను లేదా తెలుగు నేల పార్టీ లేదా సంఘం నాయకులను అడగండి, తెలుగులో వాట్సాప్ లో ఓ పేరా రాయమనండి? మీ ముదుసలి తల్లి దండ్రులు మీతో ఉన్నారా అని అడగండి?
వెకిలి నవ్వుతో, గర్వముగా, చీ చీ, అవసరము తీరాక మేము తెప్ప తగలెట్టే రకాలము, మాకు రాయడం రాదు, మేము రాయము, మాకు అవసరము లేదు, మా లాంటి నీచులని నమ్మి మా పెద్దలు మాతో ఉండరు ఉండలేరు అంటారు 5 ఏళ్ళుగా, పచ్చి అనైతిక క్రుతజ్ఞతలు లేని వ్యాపారులు లాగా, నిర్లజ్జగా చెబుతారు.
వీరి సంస్కారముతో పెంచిన తర్వాత తరాలు ఎంత క్రుతజ్ఞతతో ఉంటాయో కదా?
అందుకే కరోనా గురువు మన వెంటనే ఉంది సుమా, జీవిత గుణపాఠాలు నేర్పుతూ, పాప భూభారాన్ని తగ్గిస్తూ.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1979 General Articles and views 1,677,265; 102 తత్వాలు (Tatvaalu) and views 207,678
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad. ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం. మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు. మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే