Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. నాన్న రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, పేరు హోదా, అన్ని ఉన్నవారు. రాజకీయం లేదా వ్యాపారం అంటేనే, లోగుట్టు వ్యవహారం నటన అని, అందరికీ తెలుసు. లోక జ్ఞానం వలన, ఆ పనులు మాటలు చేష్టలు నచ్చవు.
మరి మీరు, నీతి గా ఉండాలి, తల్లి దండ్రులను గౌరవించాలి, వారి మాట వినాలి, తల వంచాలి అంటారు. మీరు పాదాలు కడుగుతున్నారు.
మరి నేను ఏమి చెయ్యాలి, వారి తప్పులలో పాలు పంచుకోవాలా? మరి నాకు శిక్షలు తప్పవు, ధర్మం ప్రకారం. లేక వాటికి దూరంగా ఉండాలా?
జవాబు -
ఇది రాజకీయ నాయకులే కాదు, అధికారులు, మన ఇంట్లో పెద్దలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ పదవి హోదా కాదు ముఖ్యం, ధర్మం అధర్మం నీతి న్యాయం అంతే.
దొంగ వ్యాపారం పనుల తో, టాక్స్ లు ఎగ కొట్టిన కూడా, అది అధర్మమే. జనాల బాంక్ ధనం దోచినా, ఇతరుల సంపద దాచుకున్నా దోచుకున్నా అధర్మమే. తల్లి దండ్రులను అనాధలు గా వదిలినా, వారి నుంచి తీసుకున్న ఆస్తి, అక్రమమే అని గతము లో అనుకున్నాము.
ఇలా అక్రమంగా కోట్లు సంపాదించిన వారు, ఉసూరుమంటూ ఉత్త చేతులతోనే అకాల మరణం తో వెళ్ళారు, వాళ్ళ పిల్లలు మొద్దులు గా ఉన్నారు, అనవసర ఖర్చు చేస్తూ, నష్టపోతూ, ఇతరులతో మోసపోతూ.
పెద్దలు ఎవరైనా, ఈ జవాబులో తప్పు ఉంటే, సరి చేయాలి. నా మాటలు కాదు ఇవి, శాస్త్రం లో చెప్పబడిన ఉదాహరణలు.
పెద్దలను లేదా ఎవరినైనా గౌరవించమంటే అర్ధం, ధర్మానికి సంబందించినంత వరకు మాత్రమే. అధర్మ ఆలోచన పనులు మాత్రం అనుసరించకూడదు, ఏనాటికైనా ఎవరికైనా శిక్షలు తప్పవు.
భయపడకుండా, పాపం చేసే వారు, తర్వాత అయినా పడే ఆవేదన, మనకు తెలియకపోవచ్చు, ఎవరూ బయటకు చెప్పకపోవచ్చు.
ఇప్పుడు కూడా, మీ ఇంటి మా ఇంటి బజారులో లేదా తెలిసిన వారిలో, శిక్షలు అనుభవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
ఉదాహరణకు, మంటలో వేలు పెట్టమంటే, మేడ మీద నుంచి దూక మంటే, పెద్దలు చెప్పారు అని దూకుతామా? మనకు దెబ్బలు తగులుతాయని తెలుసు. కాబట్టి దూకము, తాకము. మంచి చెడు కూడా అంతే. దానికి పురాణాల్లో ఉదాహరణలు ఉన్నాయి.
మంమంచి తల్లి దండ్రులను గౌరవించడము అంటే 2 రకాలు గా ఉన్నాయి ఆచరణలో - పెద్దలు గా వారిని గౌరవించాలి, అందులో సందేహము లేదు. అంటే, తల్లి తండ్రి గా, వారిని సేవించడము గౌరవించడము తప్పదు. ఇది మొదటిది.
కాని వారు, అధర్మాన్ని చేస్తూ, చేయమని మనల్ని కూడా ప్రోత్సహిస్తే బలవంతము చేస్తే, దానిని తప్పు అని నచ్చ చెప్ప వచ్చును, మార్చే ప్రయత్నం చేయవచ్చును, లేదా ఆ పనులకు దూరముగా ఉండవచ్చును.
ఇది రెండవది.
నేనేడు సాధారణముగా 75 శాతం, ఆ ప్రాపంచిక ఆర్భాటాలకు ఐశ్వర్యాలకు లోబడి, ఆడంబరాలకు అక్రమాలకు అలవాటుపడి, ఎక్కువ మంది, ఆ అవినీతిలోనే కలసిపోయి ఊరేగుతూ, చివరకు పతనము పొందుతారు, నీతిగా ధైర్యము గా రాణించలేక.
కానీ మీ ప్రశ్ననే చిత్రము గా, మరియు సంతోషము గా ఉంది.
ఉదాహరణ 1 - ప్రహ్లాదుడు, బాలుడు, నీతి ధర్మం తప్పలేదు, రాక్షస జాతి లో పుట్టిన కూడా. తండ్రి హిరణ్యకశిపుడు రారాజు, దేవతలనే ఓడించిన ఘనుడు, దేవుని మెప్పించి వరాలు పొందిన సిద్దుడు.
పుత్రుని, నారాయణ స్మరణ వదలమని, ఎన్నో రకాలు గా హింసించాడు. కానీ ప్రహ్లాదుడు, తండ్రిని గౌరవిస్తూనే నమస్కరించి, అది తప్పు, నా నోట నారాయణ స్మరణ మాత్రమే వస్తుంది అని చెప్పాడు.
తండ్రిని దూషించలేదు, వదలి వెళ్ళి పోలేదు. అక్కడనే ఉండి, ఎదుర్కున్నాడు, తన దోవలోనే ఉన్నాడు.
తండ్రి వేసిన అన్ని శిక్షలను నమస్కరిస్తూనే అనుభవిస్తూనే, తన మంచి దోవలోనే ఉన్నాడు, చెక్కు చెదరకుండా.
లోక కంఠకుడైన తండ్రి, అహంకారముతో స్థంబం నుంచి రప్పించమని కోరితే, నరహరి నే పిలిచి, ప్రపంచ సంకటాన్ని, తొలగించాడు. దేవుని అండతో, చిరంజీవి గా నిలిచాడు.
ఉఉదాహరణ 2 - ఇంద్రజిత్తు, రావణుని కుమారుడు. దాదాపు నేటి తప్పు దోవలో నడుస్తున్న యువతరం కు, ఆదర్శ మూర్తి, అరిషడ్ వర్గాలకు బానిసత్వము లో, పతనం కావడం లో, వంశాన్ని నిర్వీర్యం చేయడము లో.
రారాక్షసముగా తండ్రి చేస్తున్న పనులను సమర్ధిస్తూ, తోడూ నీడగా ఉండి, తండ్రి తో పాటుగా అన్ని సుఖ సంతోషాలను భోగ భాగ్యాలను పొందుతూ, తాను మరియు తన వంశము మొత్తము, నాశనము కావడానికి, అన్ని విధాలు గా సహకరించాడు.
ప్రహ్లాదుడిలా నీతి గా ఉండి, కనీసం దొంగచాటు గా ఇతరుల ఇల్లాలిని సీతమ్మని తేవడము రాముని తో యుద్దము తప్పు వద్దు అని చెప్పి దూరము గా ఉంటే, కనీసము తాను అయినా బతికి ఉండేవాడు ధర్మముగా.
కాకాబట్టి, నిర్ణయం మనదే, ప్రహ్లాదుడిలా నీతి గా మనశ్శాంతి తో కలకాలం ఉందామా ఉన్న దానితో, లేదా, ఇంద్రజిత్తు లా చెలరేగి, విపరీత ధనం పదవులు హోదా సంపాదించి, అధర్మముగా విభ్రజించి, తర్వాత, పతనము పొందుదామా, మన ఇష్టం, మీ ఇష్టం. అంతకన్నా, బయట వారం చెప్ప గలిగింది లేదు.
ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి, కలుపుదాము గుర్తు చేస్తే.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,270; 104 తత్వాలు (Tatvaalu) and views 253,844 Dt : 29-Aug-2021, Upd Dt : 29-Aug-2021, Category : General
Views : 885
( + More Social Media views ), Id : 1239 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
father ,
dad ,
politician ,
businessman ,
respect ,
share ,
mistakes ,
stay away Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments