రైతుల పరిహారం, వకీల్ సాబ్ మాట సీఎం సాబ్ కు, కాంట్రాక్ట్లు వ్యాపారాలు వదలండి సినిమాలు వదులుతా - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1244 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1274 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ హెచ్చరికగా చెప్పండి, వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే, జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం

కృష్ణా జిల్లాలో నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా, గుడివాడలో పవన్‌ మాట్లాడారు.

సినిమాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారన్న పవన్, వైసీపీ నాయకులు చేస్తున్నదేంటి? దేశ సేవా? ప్రజా ప్రతినిధులు అంతా, సాక్షాత్తు గాంధీ మహాత్ములా? ఖద్దరు పంచె వేసుకుని, రాజకీయం చేస్తున్నారు, పాపం. మా ప్రజలు మా ప్రజలు అని రోడ్ల మీద తిరుగుతున్నారా? పూర్తిగా రాజకీయాల కోసమే ఉన్నారా? మరి మీకు ఫ్యక్టరీలు ఎందుకు? కాంట్రాక్టర్స్ దేనికి? మీ పనులు మీరు చేసుకోవచ్చు, వేల కోట్లు దోసేచుకోవచ్చు.

మర్యాదగా వెళ్తే సరి, లేదంటే, చేప ముల్లు ఎలా తీయాలో మాకూ తెలుసు. కానీ రెచ్చగొట్టు రాజకీయం పద్దతి కాదు.

మీరు ఖాళీ సమయాలలో పేకాట ఆడుతారు. క్లబ్బులు ఆడుతారు, నడుపుతారు. పేకాట క్లబ్బులు పెట్టే మీరు కూడా మమ్మల్ని విమర్శితున్నారు.

వైసీపీ నేతలు బిజినెస్ లు చేసుకోవచ్చు, మేం సినిమాలు చేయకూడదా అని ప్రశ్నించారు. మీరు అన్ని వ్యాపారాలు వదిలేసి వస్తే, నేనూ సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తా, అని అన్నారు పవన్ కల్యాణ్.

జగన్ రెడ్డి గారికి, సిమెంట్ ఫాక్టరీలు లేవు, గనులు లేవు, పేపర్ లేదు, పాపం ఏమి లేవు. వేల కోట్లు లేవు.

తాము చాలా పద్ధతిగా మాట్లాడతాం… రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే జనసేన పార్టీ పెట్టామన్నారు పవన్ కల్యాణ్. ఓటమి ఎదురైతే కొందరు భయపడి పారిపోతారు, మేం మాత్రం నిలబడతాం.

రాజకీయం ఒక కుటుంబానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందిన సొత్తు కాదు. అన్ని కులాలు, మతాలు రాజకీయాల్లో బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తినని అన్నారు.

70శాతం కౌలు రైతులు నష్టపోతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని, కౌలు రైతులమే అని నిరూపించుకోవడానికి వాళ్లు నానా యాతన పడుతున్నారన్నారు. గ్రామ వాలంటీర్లను పెట్టి మీరు సాధించిందేంటని ప్రశ్నించారు జనసేనాని.

మరోవైపు మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి మాట్లాడారు పవన్ కల్యాణ్. అనేక మంది నానీల్లో ఈయన ఒక నాని అని అన్నారు.

అమరావతి, విశాఖ, పులివెందుల, ఎక్కడ సమావేశాలు నిర్వహించినా వస్తాం. అసెంబ్లీ ముట్టడిస్తే ఏదైనా జరగొచ్చు. దానికి మేం బాధ్యులం కాదు, అని పవన్‌ హెచ్చరించారు.

సంస్థలు అన్నీ మీకే ఉండాలా? మేం మాత్రం మీకు ఊడిగం చేయాలా? మీ దాష్టీకాలను భరించాలా? ఆ రోజులు పోయాయి. అవి పాత రోజులు. ఎదురుతిరిగే రోజులివి. ఇప్పుడు మీరు మా చొక్కా పట్టుకుంటే మేం మీ చొక్కా పట్టుకుంటాం, అంటూ తీవ్ర స్వరంతో వకీల్ సాబ్ హెచ్చరిక చేశారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1274 General Articles, 47 Tatvaalu
Dt : 28-Dec-2020, Upd Dt : 28-Dec-2020, Category : Politics
Views : 240 ( + More Social Media views ), Id : 891 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : compensation , farmers , vakil , cm , saab , leave , contracts , businesses , movies , pawan , janasena
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content