Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. మా అక్క కు, ఓ ఐదేళ్ల క్రితం అనుకుంటా, ఇంత ఖాళీ చోటు ఉంది కదా, చిన్నగా రెండు పూల మరియు కూరగాయల మొక్కలు వేసుకోండి, తోట పనిలాగా ఉంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది అని చెప్పాము.
చెట్టు మరియు నాటిన వారి ఖర్చు కూడా, ఇస్తామని చెప్పాము. పూలు, కూరలు తనకు, దేవుని కి, పలకరించే జనం కు ఇచ్చినా నష్టం లేదు కదా. రోజు కు ఒక సారి పైపు తో, నీళ్ళు కొడితే సరిపోతుంది కదా, అని పైపు కూడా తెచ్చి ఇచ్చాము.
5 ఏళ్ళ క్రితము 10 చెట్లు ఉంటే, ఇప్పుడూ ఒక్కటీ బతికి లేవు. జామ చెట్టు ఒక్కటి, ఏదో అలా అలా ఉంది, నీళ్ళు అవసరము లేదు కాబట్టి ఎక్కువ.
అలాగే చిన్న చిన్న మొక్కలు గడ్డి, జాన లేదా తక్కువ ఎత్తు ఉండగాల్నే, కుర్చీ లో కూర్చుని, రోజుకు ఓ 5 పీకినా, పని వారికోసం ఎదురు చూపులు మరియు వారికి వందలు ఇవ్వ అవసరం లేదు కదా అని అనుకున్నాము.
డాక్టరు గారూ కూడా చెప్పారు, శారీరక వ్యాయామం, సమయ పాలన ఉండాలి. లేకపోతే ఒళ్ళు మరియు బరువు తగ్గదు అని, అవి తగ్గనిదే మోకాళ్ళ నెప్పులు తగ్గవు అని, అయినా అక్క వినరు పట్టించుకోరు. నేనూ ఆసుపత్రి లో, చూపించాను ఒక సారి తోడు ఉండి.
అక్క ఆలోచనలు ఇంకో వైపు ఉంటాయి. ఎవరికో ఒకరికి ఏదో విధముగా, ధనం ఇవ్వకపోతే, ఎలా ఉన్న ధనం కరగాలి? నిద్రపట్టదు ఏమో అని ఆమె బాధ.
ఇంట్లో ఉన్న ఆరుగురు (ఉత్తిత్తికే) కి తిండి వండాలి, సామాను కడగాలి అంటే కష్టము అని, పని మనిషి కోసం ఎదురు చూపులు.
నేను సన్నబడాలి అని కష్టపడి పనిచేస్తే, పని వారికి ధనం ఎలా? వారికోసము ఎదురు చూపులు వద్దా?
నేను సన్నబడితే, డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రిలు, మందుల షాపులు , ఆటోలు కు నష్టం కదా? నా మీద అన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.
నా చేత్తో అందరికీ ఉపయోగపడే మొక్కలు పెంచడమా? రామ రామ, పాపము శమించు గాక. ఎటువంటి జీవం నేను పోయను. కూరల షాపు ల కు అన్యాయం చేయను. పలకరించే జనం ని పిలిచి పూలు, కరేపాకు ఇవ్వను.
ఇలా ఉంటే ఆలోచన 5 ఏళ్లుగా, మా అక్క సన్నబడేది ఎప్పుడూ, మోకాళ్ళ కీళ్ల నొప్పులు, తగ్గేది ఎప్పుడు? మా డాక్టర్ గారి కోరిక తీరేదెప్పుడు? ఇంక, ఓ స్త్రీ రేపురా లాగా, ఇది కొనసాగుతూనే ఉంటుంది. రామా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,309; 104 తత్వాలు (Tatvaalu) and views 226,062 Dt : 17-Apr-2020, Upd Dt : 17-Apr-2020, Category : Health
Views : 841
( + More Social Media views ), Id : 501 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
home garden ,
sister weight loss Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments