ఎన్నికలు, సంవత్సరంన్నర అభివృద్ధి రిపోర్టు - ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1399 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1431 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఎన్నికలు వచ్చాయి, నాయకులు మాయ మాటలు, చెప్పడానికి వస్తారు. నవరత్నాలు లేదా డబ్బులు పంచే కార్యక్రమాలు కు, ఎమ్మెల్యే మరియు ఎంపీలు కు, వారు కష్టపడి మన ప్రాంతానికి తెచ్చే అభివ్రుద్దికి వాటికి, సంబంధం లేదు. అధికారులు కూడా పంచగలరు, వారు లేకుండా.

ఆటోమాటిక్ గా, తెదేపా గెలిచిన చోట కూడా, అవే పధకాలు, ఇవే డబ్బులు పంచుతారు. కొత్త జిల్లాలు కూడా వాటంతట అవే వస్తాయి కొన్నిటికి, స్ధానిక ఎమ్మెల్యే కష్టం లేకుండా నే. ఉదాహరణకు బాపట్ల జిల్లా, చిత్తూరు జిల్లా.

అవి కాకుండా కొత్త వి, మన జిల్లా మంత్రి, మన స్థానిక ఎంపీ, మన స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రిని బతిమిలాడి ఏమైనా తెచ్చారా? వీటిని బట్టి, మీ ప్రాంత నాయకులు ను అడుగుతారు కదూ? రేపు 3 ఏళ్ల లో ఏమి తెస్తారు, భవిష్యత్తు ప్లాన్ ఉందా అని కూడా?

ముఖ్యంగా మీ నాయకులు గెలిచిన తర్వాత అయినా, నెలలో 15 రోజులు అయినా, స్ధానికంగా నివాసం ఉంటున్నారా? ఫోటోలు ఫేస్బుక్ లో, రోజూ స్ధానికం వి ఉన్నాయా? వారి వారసులకు ఆదర్శంగా, స్ధానికం గా ఉంటే, మంచిది కదూ.

ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని, ఎంపీ సురేష్, ఎమ్మెల్యే కరణం గార్లను, సంవత్సరం అభివృద్ధి రిపోర్ట్, ప్రజలకు తెలియచేయమని కోరాము గతంలో, జవాబు లేదు. link. కొన్ని విషయాలు చూడండి.

1. బాలినేని గారు, రామాయపట్నం పోర్టు తెచ్చారు అన్నారు, కానీ అనుబంధ పరిశ్రమ లు నెల్లూరు జిల్లా లో పెడుతున్నారు అని సమాచారం. అంటే సగం లేదా కొంత అభివృద్ధి అటుపోతుంది కదా? అంటే బాలినేని చేతగాక నిస్సహాయత గా, గమ్ముగా ఉన్నారా? లేదా నెల్లూరు మంత్రి తో కలసి, కావాలనే మన జిల్లా కు అన్యాయం, చేస్తోంది తెలీలేదు.

ఇక చీరాల చుట్టుపక్కల ప్రాంతాలకు లేదా మిగతా జిల్లా కు ఏమి చేశారో తెలీదు, సంవత్సరం న్నర రిపోర్టు కార్డు ఆయన పెడితే, చీరాలకు అన్ని ప్రాంతాలకు తెచ్చిన కొత్త అభివృద్ధి తెలుస్తోంది కదా?

చీరాలకు రావాల్సిన ఫిషింగ్ హార్బర్ ను, కొత్తపట్నం తీసుకుని వెళ్ళింది కూడా మీకు తెలుసు. మన చీరాల నాయకులు గమ్ముగా ఉన్నారు, మన పదవి ఉంటే చాలులే అని, మన అబ్బాయిని మీటింగ్ కు పిలిస్తే చాలు అని.

ఒంగోలు ఎంపీ మాగుంట గారు కూడా, ఇతర నగరాలలో వ్యాపారాలు చూసుకుంటూ, ఓ 3 రోజులు మాత్రమే, ఒంగోలు పార్లమెంట్ ప్రజలకు, అందుబాటులో ఉంటున్నారు అని తెలిసింది. ఆ 3 రోజులు మాత్రం, మాగుంట అభిమానులు కు పండగే.

కానీ మనకు ముఖ్యం, జిల్లా మంత్రి గారి అభివృద్ధి, ప్రతి ప్రాంతానికి ఎంత చేశారు, జగనన్న బంధువులు గా తన కున్న పలుకుబడి ఉపయోగించి?

ఇక జిల్లా ఇంఛార్జి మంత్రి తో ఉపయోగం ఉందా, ఉత్సవ విగ్రహమే కదా? ఆయన తెచ్చిన చేసిన అభివృద్ధి అనుకోవడం, అనవసరం.

2. బాపట్ల పార్లమెంటు స్ధానం ఏ పాపం చేసిందో కానీ, దగ్గుబాటి నేదురుమల్లి నుంచి ఏ ఎంపీ కూడా, చీరాల లేదా మిగతా ప్రాంత అభివృద్ధి గురించి అసలు పట్టించుకోరు. స్ధానికం గా అందుబాటులో అద్దెకు కూడా ఉండరు. చీరాలకు ఏమి తెచ్చారు, ఏమి చేశారు అనే రిపోర్ట్ కార్డు సంవత్సరం న్నర ది ఇవ్వలేదు.

ఎంపీ సురేష్ గారు, జగనన్న భజనలో నిమగ్నమై అదొక్కటే బాపట్ల ఎంపీ బాద్యత అని, రాష్ట్రం మొత్తం మీద, ముందు వరుసలో ఉంటారు.

జగనన్న కూడా, నన్ను పొగిడితే ఉపయోగం లేదు, బాపట్లలో ఇల్లు తీసుకుని నివాసం ఉంటూ, అందరూ ప్రజలను కలిసి, సమస్యలు తీర్చు అని గట్టిగా చెప్పరు, మోహమాటంతో, తనే తెలుసుకుంటారు అని.

జగనన్న ఇచ్చిన మంచి అవకాశం ని, దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజలకు దూరంగా ఉండి, గొప్ప నాయకుడు గా ఎదగకుండా. ఎప్పుడు పూర్తి అభివృద్ధి పనులు లో దిగుతారో, జగనన్న మాత్రమే చెప్పగలరు.

3. చీరాల ఎమ్మెల్యే కరణం గారు - గతి లేక నన్ను గెలిపించిన చీరాల లో నేనెందుకు ఉండాలి, అని ప్రజలు కు దూరంగా, ఒంగోలు లో ఉంటున్నారు. అతిధిగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని, మాయం అవుతారు. అద్దంకి లో చేసిన పొరపాటు పనే, ఇక్కడ మరలా చేస్తున్నారా, అని అభిమానుల ఆశ్చర్యం.

మొన్న జాలర్లు సమస్య వస్తే, బాపట్ల ఎంపీ మరియు చీరాల ఎమ్మెల్యే ఇద్దరూ వెంటనే ఆ రోజే రాలేదు. తనయుడు వెంకటేష్ భవిష్యత్తు కు ఇది అడ్డు అని తెలిసినా, ఆయన తీరు మార్చుకోవడం లేదు. చీరాలకు రావాల్సిన జిల్లా లేదా జిల్లా శాఖలు, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు, నిమ్స్ లాంటి ఆసుపత్రి, లాంటి పెద్ద ప్రయత్నాలు లేవు.

వైసీపీ ఇంఛార్జి ఆమంచి కూడా, పెద్ద అభివృద్ధి పధకాలను, తేవడానికి ప్రయత్నం చేయడం లేదు.

ఒకవేళ మేము చెప్పిన దాంట్లో తప్పు ఉంటే, సంవత్సరం న్నర అభివృద్ధి రిపోర్టు, వారి ఫేస్బుక్ లో పెట్టి, ఆ లింక్ మాకు పంపితే, అందరితో పంచుకో గలము.

మరి మీ ప్రాంతంలో కూడా ఏ పరిశ్రమలు, కొత్త జిల్లా శాఖలు, ఏమేమి తెచ్చారో, మీ ఎమ్మెల్యే మరియు ఎంపీలు ఇన్నాళ్లు గా, అడుగు తారు కదూ.

మీ మంచి నాయకులు ఫేస్బుక్ లింక్, పంపుతారు కదూ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1431 General Articles, 48 Tatvaalu
Dt : 28-Jan-2021, Upd Dt : 28-Jan-2021, Category : Politics
Views : 432 ( + More Social Media views ), Id : 942 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ap , elections , year , half , development report , mps , ministers , mlas , jagan , balineni , suresh , karanam , chirala , bapatla
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content