జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సంవత్సర స్థానిక అభివృద్ధి రిపోర్టు, ఏది జగనన్నా? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,160; 104 తత్వాలు (Tatvaalu) and views 225,124.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇది మీ జిల్లా, మీ ఎంపీ, మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కు వర్తిస్తుంది మిత్రులారా, అడుగుతారు కదూ మీ నాయకులను. మిమ్మల్ని ఇంతవారు చేసిన, మీ ప్రాంత ప్రజలను మరువద్దు. కనీసం ప్రశ్నించండి, గుర్తు చేయండి చాలు. మీ ధనం పైసా అవసరం లేదు కదా దీనికి. మా మా ప్రాంతాల్లో అభివ్రుద్ది పనులు, ఉదాహరణకు తీసుకోండి, మీ వాటితో పోల్చుకోండి.

ప్రకాశం జిల్లా మంత్రి వర్యులు బాలినేని గారు, బాపట్ల ఎంపీ సురేష్ గారు, చీరాల ఎమ్మెల్యే కరణం గారు, జగనన్న ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. దానికి, మనం జగనన్న కు, మన అనుచరులు మనకు జేజేలు పలికారు, పాలాభిషేకం చేశారు, ఫ్లెక్సీలు పెట్టారు, సోషల్ మీడియా లో అదరగొట్టారు శుభాకాంక్షలతో.

ఇవన్నీ సంబరాలు, బాబు గారి పాలనలో నూ, జరిగాయి. ఇప్పుడు, బాబు గారి పరిస్థితి చూస్తున్నాము. మరి మనము, మన పార్టీ అలా కాకుండా ఉండాలి కదా. జగనన్న నమ్మకం ను వమ్ము చేయకూడదు కదా.

అంటే పైపైన పొగడ్తలు కాకుండా, పని ఏమి జరిగిందో, అభివృద్ధి ఏమి జరిగిందో వివరంగా, ఓ ఫోటో లో మనం, చీరాల మరియు ప్రతి నియోజకవర్గంలో ని ప్రజలకు చూపిస్తే, వారు మన విశ్వసనీయత ను నమ్ముతారు. దయచేసి ఇది జగనన్న ఉప్పు తిన్న, పదవులు అనుభవిస్తున్న మరియు వారి క్షేమం కోరే అనుచరులు గా, సమాధాన పరచగలరు ఉత్తమ జవాబు ల తో. జిల్లా, రాష్ట్ర అధికారులు సహకరించక పోతే చెప్పగలరు, గట్టిగా ప్రజలతో.

ఉదాహరణకు, ఈ సంవత్సరం లో, మీ తరపున చీరాల నియోజకవర్గ అభివృద్ధి ఏమిటి, పెద్ద స్ధాయిలో, చిరస్థాయిగా నిలిచేటట్టు గా? చీరాల అంటే ప్రతిసారీ పర్చూరు, కారంచేడు, వేటపాలెం, చుట్టుపక్కల మండలాలు కలిపి అని కూడా అర్ధము.

అభివృద్ధి అంటే, చీరాలకు జిల్లా, పార్లమెంటు స్ధానం, చేనేత పార్కు, ఫిషింగ్ హార్బర్, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి హంగులు, ప్రభుత్వ కళాశాల, జీడి పరిశ్రమ అభివృద్ధి, స్మార్ట్ సిటీ, స్మార్ట్ బీచ్, కొత్త పరిశ్రమ లాంటివి తెచ్చారా?

1. బాలినేని గారు, మీరు రాష్ట్ర మంత్రి, జగన్ గారికి బంధువు కూడా, అంటే అందరికీ ఎక్కువ మంచి చేయాలి, కేవలం ఒంగోలు కు మాత్రమే కాదు. హైదరాబాద్ లో ఆరోగ్యవంతు లై వచ్చినందుకు, శుభాకాంక్షలు.

మీరు ప్రకాశం జిల్లాలో రెండవ పెద్ద పట్టణం, క్షీరపురి చిన బొంబాయి చీరాల మరియు చుట్టు పక్కల మండలాలకు, జిల్లా మంత్రి గా సాధించినది, తెచ్చినది ఏమిటి? చీరాలకు వచ్చే, ఫిషింగ్ హార్బర్ ను కూడా, ఒంగోలు పట్టుకుని పోయారని, ప్రజల భావన కరక్టే నా? ఎక్కడ అయినా, ఈ సంవత్సరం చేసిన అభివృద్ధి లిస్టు ఉందా? భవిష్యత్తు 4 ఏళ్ళ ప్లాన్ ఉందా?

2. బాపట్ల ఎంపీ సురేష్ గారు, కష్టపడి పైకి వచ్చిన మీరు, జగనన్న కు ఎల్లకాలం నమ్మకం అయిన తోడుగా నిలబడటం కోసం, పై వాటిలో, వేటినైనా తేగలిగారా? ఇన్నాళ్లు గత ఎంపీ లందరూ మోసం చేసారు, మా ప్రాంతం ను, అనుమానం లేదు. ఓట్లు అప్పుడు తప్ప, అందరూ మరచారు. మీరు అలా కాదు, కదూ? కనీసం ప్రయత్నాలు చేశారా?

ఎన్నిసార్లు ఇక్కడ పర్యటించారు, కేవలం అభివృద్ధి కోసం? చీరాల కోవిడ్ ఆసుపత్రి, సందర్శన చేశారా? మీ చేతిలో ఉన్న ఎంపీ నిధుల నుంచి, చీరాల మరియు ఇతర నియోజకవర్గ అభివృద్ధి కి, ఏ పనులు కు ఎంత ఖర్చు పెట్టారు? ఇవన్నీ ఫోటో సాక్ష్యం తో, ప్రజలకు ప్రతి నెలా విన్నవిస్తున్నారా?

3. ఎమ్మెల్యే కరణం గారు, ఆరోగ్యం గా తిరిగి వస్తున్నందుకు శుభాకాంక్షలు. ఇకనైనా చీరాలలో ఉంటానని, చిన్న హమీ ఇవ్వగలరు. పై పెద్ద కార్యక్రమాలలో ఎన్ని సాధించారు, తెదేపా నుంచి వైకాపా వచ్చి, జగనన్న అండతో? సంవత్సరం లో సాధించిన లిస్టు ప్రకటిస్తే, పై వాటిలో నుంచి, ఇక మనకు తిరుగు ఉండదు కదా.

ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా చేసే అభివృద్ధి, మీ తనయుల భవిష్యత్తు అభివృద్ధి కి, బంగారు బాట కాగలదు, మరువద్దు సుమా. లేదంటే మీరే, వారి భవిష్యత్తు ను పాడుచేస్తున్నారు, అని అభిమానుల ఆవేదన.

దయచేసి జవాబు ఇవ్వగలరు. పదిమంది కి మీ గురించి మరియు మన జగనన్న అభివృద్ధి గురించి, మనవి కేవలం మాటలు కాదు, ఇవిగో చేతలు అని అందరికీ చాటాలని, సదుద్దేశంతో ఈ మనవి. మన్నిస్తారు కదూ, జగనన్న పేరు నమ్మకం నిలబెడతారు కదూ.

ఒకవేళ ఏమీ లేకపోతే పర్లేదు, దయచేసి, ఇప్పుడు అయినా అభివృద్ధి మొదలు పెట్టండి, కొత్త జిల్లా తెచ్చి. ధన్యవాదాలు.

రెండవ భాగం. Link.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,160; 104 తత్వాలు (Tatvaalu) and views 225,124
Dt : 13-Aug-2020, Upd Dt : 13-Aug-2020, Category : Request
Views : 917 ( + More Social Media views ), Id : 647 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : district , minister , mp , mla , annual , local , development , report , jagan , balineni , suresh , karanam , bapatla , chirala , prakasam , ongole
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content