ఏ తల్లి కి ఇవ్వని గొప్ప వైద్యం సౌకర్యాలు 7 ఏళ్ళు, దేవుడు ఇచ్చి ఆశీర్వదించారు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,024; 104 తత్వాలు (Tatvaalu) and views 226,128.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇంట్లో ఉంచుతావో, వీధిలో వేస్తావో, నీ వెంటో లేదా ఇంకొకరు వెంటో, చంపుకుంటావో బతికించు కుంటావో, నీ ఇష్టం. మాకు సంబంధం లేదు, మాకు రావాల్సిన స్ధలం కూడా వచ్చింది కదా.

మా పనులే మాకు వల్ల కావడం లేదు, మా రోగాలు తెలుసు కదా, వండ లేక కూరలు కూడా బయట తెస్తున్న, కావాలంటే మా వాళ్ళ ను అడుగు, మాకే ఇంకో మనిషి ఉండాలి ఆఫీస్ లో దింపడానికి మరలా తేవడానికి, ఎక్కడ ఉంటామో ఏ ఊరు తిరుగుతామో. . . .

చూడండి, 2014 లో, వయస్సు ఉడిగిన తల్లి తో, ముత్యాల కుటుంబాలు ఏక కంఠంతో, కృతజ్ఞతలు జాలి దయ కనికరం బంధం రుణం బాంధవ్యం తల్లి ప్రేమ విశ్వసనీయత బాధ్యత, వారి మాటల్లో చేతల్లో చూచారు, చూస్తున్నారు కదా.

ఇప్పుడు కూ, ఆ జాలి దయలో, ఇంచె కూడా మార్పులు లేవు, తల్లి కి కోటి ఖర్చు అని తెలిసినా కూడా. నీ తల్లి కి నువ్వు పెట్టుకుంటే, మాకేంటి.

మనలో కూడా, ఇంత మంచి కనికరం, ఇన్నేళ్లు ఉన్నవారు, చాలా మంది ఉన్నారు కదూ, సమయం వచ్చినప్పుడు బయట వేస్తాం కదూ, మన బుద్ధి.

ఈ మాటలు, షుమారు 2013 వి అనుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు పరిస్థితి అర్థం అయి, హైదరాబాద్ తీసుకుని వెళ్లి, ముద్ర వేయించి, ఆ తర్వాత సంవత్సరం, 2014 నవంబరు తెచ్చాము కదా.

2013 మరియు 14 లో అందరూ అమ్మ ను వద్దు అన్నాక, నా పరిస్థితి ఏమి చేయాలో తెలీదు. అగమ్యగోచరంగా ఉంది. కనికరం చూపే వారు, ఎవరూ లేరు.

ఇక్కడ పరిస్థితి, 6 నెలల కు మించి ఉంచరు. మొదలు ముద్ర వేస్తారో లేదో తెలీదు. లోనకి వచ్చేటప్పుడు కూడా వెనక్కి పంపవచ్చు. 6 నెలలో ఇక్కడ ఉండలేక, వెనక్కి రావచ్చు. తర్వాత ఇంకా ఉండనిచ్చే అనుమతి వస్తుందో రాదో?

6 నెలల తర్వాత అయినా, సంవత్సరం మధ్యలో వచ్చి, ఎక్కడ పెట్టాలి ఏమి చేయాలి? మనం కూడా అక్కడ నే ఆగిపోదామా, మరి ఉత్తమ వైద్యం దాని ఖర్చు ఎవరు ఇస్తారు?

ఆ సంకష్ట సంక్లిష్ట పరిస్థితి నుంచి, ఆ ఏలినాటి శని జీవితం గుణపాఠం నుంచి, అమ్మ తోడు తో దేవుని దయతో, ఇప్పుడు 7 వ సంవత్సరం.

రేపు ఉదయం, ధనం లేక వెనక్కు వచ్చిన కూడా, జీవితంలో మనకు తెలిసిన వారి పరిధిలో, ఏ తల్లి కి ఇవ్వని గొప్ప వైద్యం సౌకర్యాలు 7 ఏళ్ళు, దేవుడు మనస్ఫూర్తిగా ఇచ్చి, ఆశీర్వదించారు.

తల్లి ని వద్దు అన్న వారికి తగిన రోజులు, శని దేవుడు చూపిస్తారు.

నష్టపోయిన కూడా, కృతజ్ఞతలు నీతి నియమాలను తప్పవద్దు. మోసం తో నేడు రారాజు ల మైనా, రేపు అనాధలుగా ఉండాలి సుమా. కాలచక్రం మరలా మన దగ్గరకు వస్తుంది. తప్పించుకోలేము, అని తన గత బాధ గోపీ రాము తో చెప్పాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,024; 104 తత్వాలు (Tatvaalu) and views 226,128
Dt : 07-Feb-2021, Upd Dt : 07-Feb-2021, Category : General
Views : 772 ( + More Social Media views ), Id : 957 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 7 years , medical facilities , mother , mom , god , blessed
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content