APLatestNews.com top Banner
ఇంకా వారం కాలేదు, అప్పుడే అలా బాధ అంటే ఎలా? ఇంకా ఏప్రిల్, మే నెల కూడా - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఓ గురువు గారి ప్రశ్న, ఏవండీ పూర్తిగా ఇంట్లో ఉండాలి అంటే చాలా కష్టం గా ఉంది. సంపాదన కూడా లేకుండా చాలా కష్టం. ఇంట్లో సమస్యలు అన్ని రకాలుగా ఎక్కువ అవుతున్నాయి. మీకు ఇన్ని కష్టాలు లేవేమో, తీరికగా బాగా రాస్తున్నారు.

ఏవండీ గురువు గారు, ఇంకా వారం కూడా కాలేదు, అప్పుడే అలా బాధ అంటే ఎలా? ఇంకా ఏప్రిల్, మే నెల కూడా ఉంది. అదే మరి జీవితం, అందుకే దేనికి తొందరపాటు వద్దు, ఈ రోజు స్దితి చూసి మురిసిపోవద్దు అని మొత్తుకున్నా, మీ అందరి దగ్గర ఎన్నో ఏళ్లుగా.

మీరు నేడు చూసే కష్టాలు అన్ని, మా జీవితంలో ఇంకా ఎక్కువ చూసాము, చూస్తున్నాము, ఇంకా ఎక్కువ చూస్తాము. ఎందుకంటే, శిక్షలు ఇక్కడ పూర్తి అయితే నే, ఆనందంగా అనుభవిస్తేనే, పునరావృతం తగ్గుతుంది కదా.

మా ఇంట్లో రెండు ఏళ్లుగా, ఇదే పరిస్థితి లో, ఉంటున్నాము అని అందరికీ తెలుసు. కాబట్టి, వారం కన్నా, రెండు ఏళ్ళు ఎక్కువ కాదా? ఆ నరకం మాకు ఇంకా ఎక్కువ కాదా?

వారం సంపాదనకు బాధ పడితే, మరి రెండు ఏళ్ల సున్నా సంపాదన? వదలిన ప్రభుత్వ ఉద్యోగం మరలా తేలికగా వస్తుందా? కాబట్టి, మన అందరికీ కష్టాలే.

కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది అంటారు కదా, అదే. అందుకే బతికి ఉంటే బలుసాకు తినొచ్చు అన్నారు. ధైర్యం కోసము, నలుడు, పాండవులు, సీతా రామ వనవాసం చదవండి.

కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి ఎవరికైనా. పరిస్థితి మారుతుంది కదా అనుకునే ఈ సమయంలో, ఈ లాక్ డౌన్, మీ కన్నా మాకే ఎక్కువ కష్టం నష్టం. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు గా. కానీ తప్పదు ఎదుర్కోవాలి, మన ప్రయత్నం కొనసాగిస్తూ, మంచి దోవ వీడకుండా, నీతి తప్పకుండా ఉండాలి మరి.

ఆల్రెడీ అక్కడ లేదా ఇక్కడ ఉందామా అనుకున్న పరిస్థితి నుంచి, అసలు లోకం లో ఉంటామా ఉండమా అనే పరిస్థితి కి వస్తుందా అని అనిపిస్తుంది. అయినా భయం వద్దు తప్పు, మనలో లేకపోతే. నేను పంపిన ప్రతిదీ చదివి ఉంటే, మీకూ మానసిక బలం పెరిగే ఉంటుంది.

కానీ ప్రతి దానికి ఒక కారణం ఉంది, అది లేకుండా జరుగదు. కాబట్టి మానసిక బలం పెంచుకుని, జరిగే అనర్ధాలలో మన పాత్ర చెడు వైపు ఉండకూడదు. పాపం వైపు వద్దు. అందుకే యోగా, ధ్యానం, ప్రదక్షిణలు, పురాణాలు లాంటివి, మానసిక ధైర్యం కోసం.

షష్ట గ్రహ కూటమి షుమారు డిసెంబర్ 26 న అనుకున్నాం గుర్తు ఉందా? ఫిబ్రవరిలో ఇది మొదలు. సీనియర్ అమ్మతో, బిపి షుగర్ వర్టికో తో, ఎక్కువ డేంజర్ మాకే. అయినా నారాయణుడు ఉన్నాడు, నర గురువు లు మీరున్నారు. దిగులు లేదు, చేయగలిగినదీ లేదు కదా.

బాధ ఉంటే కుంగిపోవద్దు. కాగితం మీద రాయండి రాసుకోండి. స్నేహితులు బంధువులు తో పంచుకోండి. వాళ్ళు తీరుస్తారు అని కాదు, బాధ బయటకు కక్కితే, మనసు తేలిక పడుతుంది, పరిష్కారం దొరకవచ్చు నేమో కూడా.

సాత్వికుల కుటుంబాలు, ఈ కష్ట సమయంలో కూడా, ధైర్యముగా సంతోషం గా ఉంటాయి, ధనం లేకపోయినా.

రాజస తామస కుటుంబం లు కొన్ని, ఒత్తిడికి గురు అవుతాయి. భగవంతుని ధ్యానం తప్ప, రెండో మార్గం లేదు, ధైర్యంగా ఉండండి. వీలైతే, మన లోకం తీరు, తత్వాలు చదివి, మనసు ను గట్టి పరచుకోండి.

నలుగురు తో నవ్వుతూ ఫోన్ లో మాట్లాడండి, పాత కక్షలు పగలు విడిచి. దయ కరుణ పెద్దలు అంటే గౌరవం భక్తి ప్రశాంతత మనశ్శాంతి పెంచుకోవాలి. ధన్యవాదాలు, సర్వేజనా సుఖినోభవంతు.
 

Dt : 25-Mar-2020, Upd Dt : 25-Mar-2020 , Category : General
Views : 46 ( + More Social Media views ) ( id : 442 )
Tags : corona , kovid 19 , staying at home , yoga , reading purana

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content