APLatestNews.com top Banner
జనతా (ప్రజల స్వచ్చంద) కర్ఫ్యూ వెనుక అసలు పరమార్ధము మీకు తెలుసా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
పల్లెటూరు లేదా పట్నమైనా, నిర్లక్ష్యము అజాగ్రత్తలు పనికి రాదు, ఈ వారము లో ఓ 5 మందితో మాట్లాడాను, వారు అసలు ఈ పరిస్థితికి భయపడటము లేదు, జాగ్రత్తలు చెప్పాను.

ప్రధాని దేశానికి, ఒక రోజు ఇలా స్వచ్చంద నిర్భందము చేయమన్నారు. కానీ మన ఇంటికి మనమే ప్రధాని, మరి ఈ 2 వారాలు కూడా, జాగ్రత్తలు తీసుకుని, మన కుటుంబాన్ని కాపాడుకుందాము. పిల్లలకు చెపుదాము. రోగం ఆపడం తేలిక, వచ్చిన తర్వాత మందు లేదు, తర్వాత మన బతుకు వైద్యులు చేతిలో.

జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం : మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు.

* ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు!
* జనతా కర్ఫ్యూ 14 గంటలు!
* కాబట్టి కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు, 14 గం.ల తరువాత కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి! అప్పుడు మనం ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదు!
* ఈ విధంగా మనం కరోనా వైరస్ వ్యాపించే లింకును అంటే పరంపరను తెగకొడుతున్నాము.

ఇది మన దగ్గరే కాదు, విదేశాలలోకూడా, అత్యవసరమైతే తప్ప 2 వారాలు బయటకు రావొద్దని ఆదేశాలు ఇచ్చారు. మనము ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటూ, ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నాము.

అత్యవసరమైనన పనులు అంటే, కూరగాయలు కొనడము లో కూడా జాగ్రత్త ఉండాలి. ప్రతి ప్రదేశము ఆ వైరస్ కు మూలమే. చూడండి కొన్ని, ఉదాహరణలు.

* ఆటో బస్సు రైల్ లో, అరుగుమీద, రచ్చబండ, సోఫాలో, కుర్చీలో ముందు కూర్చున్న వారికి వైరస్ ఉన్నాకూడా, ఆ తర్వాత కూర్చునే వారికి వస్తుంది

* పిల్లలు పక్క ఇంట్లో ఆడుకుని వస్తే, వారికి తెలీకుండానే, అది మన ఇంటికి రావొచ్చు. ఇంట్లో ఒకరికి వస్తే, మిగతా అందరికి వస్తుంది. కరెన్సీ నోటు అయినా అంతే.

* మనకు బెండకాయలు, దొండకాయలు ఏరడము అలవాటు. ముందు వారు అలాగే చేస్తే, ఆ వదిలిని కాయలకు ఉంటుంది.

* పోస్ట్ కవర్, కొరియర్, పాల పాకెట్ లేదా ఇంకో పాకెట్ తినుబండారము అయినా పైన ఉండవచ్చు

* ఫంక్షన్ లకు పోవద్దు అంటున్నారు కదా, పది మంది కూడా కలవద్దు అంటూ ఉంటే, దగ్గర ఉండవద్దు అంటుంటే, ఎలా వెళతాము

* గేటు , గడియ, తాళము కూడా బయట వారు పట్టుకుంటే, వాటికి అంటుతాయి

అందుకే వీలు అయినన్ని సార్లు చేతులు కాళ్ళు కడుక్కుంటూ, అవసరమైతే స్నానము చేస్తూ ఉండాలి. అంటే, పాత రోజులలో మడి లాగా ఉండాలి ఇంట్లో అయినా కూడా. అన్ని శుబ్రముగా కడిగి మాత్రమే తినాలి.

బయటకు వెళ్ళి మనము రోగము తెచ్చుకోకూడదు, మనము ఇవ్వకూడదు. అందరి ప్రాణాలు, ఆరోగ్యము మన కుటుంబాల లాంటివే సుమా. జాగ్రత్తలు.
 

Dt : 20-Mar-2020, Upd Dt : 20-Mar-2020 , Category : General
Views : 65 ( + More Social Media views ) ( id : 426 )
Tags :

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content