యువకుడికి సహకరించిన విద్యార్థినులను యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ సస్పెండ్‌ - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,186; 104 తత్వాలు (Tatvaalu) and views 226,144.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ లోని లేడీస్‌ హాస్టల్లోకి, ఓ యవకుడు చొరబడ్డాడు. కొందరు విద్యార్థినుల సహకారంతో, కిటీకీ ఊచలు విరగొట్టి, హాస్టల్లోని ఓ గదికి చేరాడు. రోజంతా అక్కడే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం, విద్యార్థినులంతా గదికి తాళం వేసి, యథావిధిగా కాలేజీకి వెళ్లారు. ఆ గదిలో మనుషుల అలికిడి గ్రహించిన తోటి విద్యార్థులు, సెక్యురిటీ సిబ్బందికి చెప్పారు.

దాంతో తాళం పగులగొట్టి, గదిలో నక్కిన, యువకుడిని పట్టుకున్నారు. ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో విచారణ. యువకుడికి సహకరించిన 6 విద్యార్థినులను యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ సస్పెండ్‌ చేసినట్టు తెలిసింది. పట్టుబడిన యువకుడు కూడా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి. ఇది దినపత్రికలో ఫిబ్రవరి 22 న వచ్చిన వివరాలు.

కలికాలం కదూ. పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల గురించి కనుక్కుంటూ ఉండాలి, వారి ప్రవర్తన, మాట తీరు, అర్ధము చేసుకోవాలి. అనుభవము కలవారు, ఒక అరగంట మాట్లాడితే, వారి మనోగతాన్ని గ్రహించ గలరు. వారు మాయలో, మోహము లో, భయములో, నిర్లక్ష్యములో ఉన్నారా అని. చుట్టూ పక్కల పిల్లల తోను, వార్డెన్, సెక్యురిటీ, ప్రిన్సిపాల్ అందరితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. తప్పదు, దూరముగా పెట్టినా, అది మన బాధ్యతే.

ఈ వార్త చూసి, కొంతమంది, వార్డెన్ ను సెక్యూరిటీ ని, మాత్రమే తప్పుపడుతున్నారు. పూర్తి బాధ్యత వారిదే అంటే ఏలా? వాళ్ళు మనలాగే ఉద్యోగం చేస్తూ ఉన్నారు, 100 మంది పిల్లలు ఉంటారు. మనతో రక్త సంబంధం లేదు, ఆలోచన చెయ్యాలి, అంత బాధ్యత ఉంటుందా? మొదటి తప్పు ఎవరిది? మన తప్పు, మనము ఒప్పుకోం కదా.

1. తల్లి దండ్రులు మొదటి దోషులు కాదా? వారి పెంపక లోపం కాదా? డబ్బు ఉందని, విపరీత గారాబం చేసి, ఉన్న పిల్లల ను దూరంగా పెట్టి, నెలకో ఆరు నెలలకో బయలుదేరాము అని ఫోన్ చేసి జాగ్రత్తలు పడమని చెప్పి మరీ వెళితే, రక్త సంబంధం ఉన్న మనకు లేని బాధ్యత, ఉద్యోగం చేసే వారికి ఉంటుందా? వారిని నిలదీసినా, జరిగిన తప్పు ను వెనక్కు మార్చగలమా? వార్డెన్ అడిగినా, మనవారు గౌరవ ప్రదమైన జవాబు చెబుతారా?

2. ఆ వార్డెన్ తిరిగి మనల్ని అడిగితే, మీ పిల్లలు ను చూసి, మా మిగతా పిల్లలు చెడిపోరా? హస్టల్ లో ఇంత మంది మధ్యలో, అబ్బాయి ని పెట్టారు అంటే, ఎంత ధైర్యం, ఎంత తెగువ? ఆ ధైర్యం వెనుక ఉన్నది, మీరూ మీ డబ్బు మీ సంస్కారం మీ పెంపకం కాదా? అంటే మన జవాబు ఏమిటి? తప్పు అందరమూ చేస్తాం, మరీ ఇంత బహిరంగంగా, మిగతా అమాయకపు పిల్లలు చూసే విధంగా నా?

3. మామూలు ఊరు లోనే కాలేజీ హస్టల్ ఇలా ఉంటే, ఇంక పెద్ద ఊళ్ళు గుంటూరు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ పరిస్థితి ఏమిటి? దేవుడా.

4. ఇక మగ పిల్లలు పరిస్ధితి గురించి, మనం ఎంత తక్కువ అనుకుంటే అంత మేలు. ఎందుకంటే, లేని అవలక్షణం ఉండదేమో, దానికీ పూర్తి సహకారం పేరెంట్స్ నుంచి, ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఎంజాయ్ చెస్తారు అని. మత్తులో మైకం లో తూగే వాళ్ళు ఎందరో. డబ్బు తో బైకులు, కార్లు ఇచ్చి విచ్చలవిడిగా జల్సా చేయమంటారు. పేపర్లో ఎన్ని ప్రమాదాలు చదివాము.

5. ఇంకా విచిత్రం ఏమిటి అంటే, ఎదురు తిరిగి తప్పు ను సమర్దించడం ఇంకొంతమంది. ఇలానూ అంటారేమో రాబోయే రోజుల్లో, తప్పేముంది ఇప్పుడు కామనే అంటారు ఏమో. అలా చేయని వారెవరో చెప్పండి అంటారు ఏమో.

దేవుడా కాపాడు మా భవిష్యత్ తరాలను, ధన మోహములో మాకు ఎటూ తీరిక లేదు మా పిల్లల గురించి, నువ్వైనా తీరిక చేసుకుని వారిని కాపాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,186; 104 తత్వాలు (Tatvaalu) and views 226,144
Dt : 23-Feb-2020, Upd Dt : 23-Feb-2020, Category : News
Views : 919 ( + More Social Media views ), Id : 358 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : triple it , ladies hostal , student

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content