APLatestNews.com top Banner
బొడ్డు కోసినప్పుడే కాలితో గుండెల్లో తన్నుతుంటే, ఆనందం ఆనాడు. అవసరం తీరాక, సిగ్గుతో ఈనాడు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
కృతజ్ఞతలు లేని, వ్యర్థ పనికిమాలిన వాళ్ళ ను కన్నప్పుడు, పనికిరాని ఏ పని వాళ్ళ ను కూడా, అవసరం తీరాక ఉంచరు కదా, తల్లి.

పాములు కు భక్తి తో పాలు పోసి పెంచి, తర్వాత కాటేసింది అంటే, ఎలా పిచ్చి తల్లి.

కుక్క కి ఉన్న విశ్వాసం మనిషి కి లేదు అంటే, ఛీ యదవలు తో పోల్చవద్దు మమ్మల్ని అని, అవి ఏడుస్తూన్నవి కానీ, మనిషి మాత్రం నవ్వుతూ ఇంకో మనిషి ని ఎలా ముంచాలో, అని ఆరాటపడుతుంటారు.

బొడ్డు కోసినప్పుడే కాలితో గుండెల్లో తన్నుతుంటే, ఆనందంగా నవ్వు కుంటాం ఆనాడు. మీరే కదా గుండెల్లో తన్నడం నేర్పింది అంటే పెరిగాక అవసరం తీరాక, సిగ్గుతో తలవంచుకుంటాం ఈనాడు.

ధనం తో పెళ్ళి, ధనం తో కని, ధనం తో పెంచి, ధనం తో ఆడించి, ధన సంపాదన మాత్రమే నేర్పించి, చివరకు ధనం కోసం ముసలి వాళ్ళైన మనల్ని వదిలేస్తే, తప్పు వారిదా? మనదా? మనం నేర్పింది కూడా, ధనం గురించే కదా తల్లి.

సంస్కారం, బాధ్యత, కృతజ్ఞత, ప్రేమ, అభిమానం, గౌరవం అంటే వారికి తెలీనప్పుడు, మనమెప్పుడూ నేర్పనప్పుడు, అవి వారి దగ్గర నుంచి ఆశించడం అంటే, చందమామ తో ఆడుకున్నట్టే గదా పిచ్చి తల్లి. అది అక్కడే ఆకాశములో, మనం ఇక్కడే భూలోకములో, కలవవు కదా, కల నిజము కాదు కదా.

చిన్నప్పుడు ధన మోహం లో లేదా గోల భరించలేక లేదా మనకు అడ్డు అని, పిల్లలను దూరంలో పెడితే లేదా హస్టల్ లో వేస్తే, వారు పెరిగాక మనం అడ్డు అని, ఇంక ఎవరికో ఒకరికి అంట గట్టి లేదా ఆశ్రమం లో వేస్తున్నారు కదా, ఆ త్యాగ మూర్తులు మన పెంపక మహిమతో కూడా, మనల్ని రోడ్డు మీద వేయకుండా.

తల్లి దండ్రులను వదలిన బిడ్డలు పై, కేసు పెట్టండి అని ప్రభుత్వం అండగా ఉన్నా, నెత్తి నోరు కొట్టుకుని ప్రచారము చేస్తున్నా కూడా, వారి మీద కేసులు పెట్టకుండా, రేపు తమ బిడ్డను కూడా, నడి రోడ్డు కు ఈడుస్తున్నారు, తమ మనుమలు చేత. అంటే, ఇదే మంచి తనాన్ని కొనసాగించి తన బిడ్డనూ రోడ్డున వేయడానికి వెనుకాడటము లేదు.
 

Dt : 12-Feb-2020, Upd Dt : 12-Feb-2020 , Category : General
Views : 51 ( + More Social Media views ) ( id : 333 )
Tags : old mother at elders home

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content