Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఏవండీ నీతి నియమాలు, ప్రాతఃకాల ధ్యానం, దేవుడు పూజ పునస్కారాలు, పెద్దలు ను గౌరవించడం, వారి మాట వినడం మర్యాద, అంతా వ్యర్ధ మాటలు. నా ఇష్టం వచ్చినట్టు నే బతుకు తా, తప్పా? నన్నెవరూ ఆపలేరు. నాకు మంది బలం ఉంది , ధనం ఉంది.
గురువు గారు, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు, ఆపాల్సిన అవసరం ఎవరికీ లేదు. కొండ మీద నుంచి దూకుతా, అనే తెలివి గల పిచ్చి మేధావిని, ఎవరూ ఆపరు ఆపలేరు.
ఈ విషయంలో, మీరు మొదలూ కాదు, చివరా కాదు. మన గురువు లు , ధుర్యోధనుడు, రావణుడు, . . . ఆల్రెడీ అలా అని ఉండి చేసి చివరకు ఏమైనారో, పురాణములలో వివరంగా చెప్పారు. పెంపక లోపం లో, చిన్నప్పుడు మీ పెద్దలు గురువు లు చెప్పి ఆచరింప చేసి ఉండరు.
ఈనాడు కూడా రాజకీయాల్లో లేదా మన చుట్టూ పక్కల అలాంటి వారిని ఎంతో మందిని చూస్తున్నాము, వారి పతనము ను కూడా వింటున్నాము.
అలా అనుకునే వారు 80 శాతం ఉండబట్టే, మనకు ఎక్కడ చూసినా వారి గుర్తులు, అనుస(చ)రులు కనపడతారు.
జనం లేని, ఖాళీగా ఉన్న హస్పిటల్ ఒకటి చూపిస్తారా? రోగాలు, రొప్పులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఎంతమంది? అన్ని ఉండికూడా, మనశ్శాంతి గా ఉన్న వారు ఎంతమంది? ఏమీ లేని వారికి, దిక్కు ఏమిటి?
పోలీసు, లాయర్, కోర్టు ల చుట్టూ ఎంత మంది తిరుగుతూ ఉన్నారు? యాక్సిడెంట్ లు, దోపిడీ లు, హత్య లు, మోసాలు, దగాలు ఎన్ని? భులోకములోనే నరకము ఉంది అనె వారు ఎంత మంది?
తగవులు, అనుమానాలు, అవమానాలు, అరుపులు లేని కుటుంబం లు ఎన్ని ఉన్నాయి? ముసలి తల్లి దండ్రులును వదలిన వారు, ఎంత మంది? నా బిడ్డలు నా మాట వింటారు, నన్ను జీవితము చివరలో చూస్తారు అని ధైర్యంగా అనే పెద్దలు ఎందరు ఉన్నారు? పిల్లల ను మహిళలు ను, ఇబ్బందులు పెట్టేవారు ఎంతమంది?
ఇలా చెప్పకుంటూ పోతే, ఇంకో వంద రాయవచ్చు. వారంతా ఎవరు? ఇలాగే, అంటే మీ లాగే ఆలోచన చేసే, గొప్ప మేధావి తరానికి చెందిన గురువు లు.
మన ఆలోచన బట్టే మనకు ఫలితాలు కదా. కలియుగ ధర్మ మే అది, నీతి ని వదిలిపెట్టు కనులు మూసి పతనం వైపే పరుగులెట్టు. చరిత్ర లో మాత్రమే ఉంటుంది, ధర్మం ని కాపాడు అది మనల్ని కాపాడుతుంది అని. జై మోహం జైజై పతనం, అంతేనా? అవ్వ.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,881,226; 104 తత్వాలు (Tatvaalu) and views 226,239 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments