APLatestNews.com top Banner
శని గ్రహ మార్పు ధనస్సు లో నుంచి మకరం లోకి - జనవరి 24 2020 - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

ఒక గురువు గారు అడిగారు, ఏ రాశులకు జనవరి 24 నుంచి, ఏలినాటి శని దేవుని చల్లని చూపు మొదలు మరియు చివర ఎవరికి అని.

ఇవి చూసి భయపడటం కు కాదు. జాగ్రత్తలు పడమని. వర్షం వస్తుంది అని తెలిస్తే, గొడుగు తో వెళతాము కదా. వడగాలి అని తెలిస్తే ఉదయం సాయంత్రం వెళతాం. అంతే గానీ, పని మానేసి ఇంట్లో ఉండము.

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

జన్మ రక్ష రాజేశ్చ గ్రహ ప్రవేశకాలొడు రాశౌ,
యది చార జంచ రుద్రేరసే జన్మని హేమమూర్తి
శ్శుభంక రాజేషు రాజితశ్చ సచాద్రి దిగ్విహ్నిషు
తామ్రమూర్తిః కష్టం గజార్కాబ్ధిషు కౌహితస్య

రవి మొదలైన గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతున్నప్పుడు, ఆ రాశిని ప్రవేశించే కాలంలో ఉన్న నక్షత్రం ఏది అవుతుందో పంచాంగాన్ని బట్టి తెలుసుకొని, జన్మరాశి లగాయితు నిత్య నక్షత్ర రాశి వరకు లెక్కించగా 1,6,11 రాశుల్లో ఒకటైన సువర్ణమూర్తి అని, 2,5,9 రాశుల్లో ఒకటైతే రజిత మూర్తి అని 3,7,10 రాశుల్లో ఒకటైతే తామ్రమూర్తి అని, 4,8,12 రాశుల్లో ఒకటైతే లోహమూర్తి అని అంటారు.

ఏ జాతకుడికి అయిన జాతకఫలితాలు చెప్పేటప్పుడు రెండు విధాలుగా పరిశీలన చేయవలసిన అవసరం వస్తుంది. అది ఒకటి గ్రహచారము , రెండవది గోచారము.

గ్రహచారము అనగా మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహముల స్థితి ఆధారముగా, గ్రహములు పొందిన రాశి(జన్మ రాశి, జన్మ నక్షత్రము) యొక్క స్వభావమును అనుసరించి, గ్రహ దశలను తెలుసుకొని, జన్మ లగ్నము లగాయితూ, గ్రహములు పొందిన ఆధిపత్యము ననుసరించి, ఆయా గ్రహముల బలాబలములను తెలుసుకొని, ఫలిత నిర్ణయం చేయటం మొదటిది. ఇది మంచి పద్దతి, పూర్తి నమ్మకమైనది. దశ అంతర్దశలు ఉంటాయి.

ఇక రెండవది గోచారము - ఈ విధానములో వర్తమాన పరిస్థితులలో గ్రహముల గతిని అనుసరించి కలుగు మార్పులకు అనుగుణముగా మానవ జీవితముపై కలుగు శుభ ,అశుభ ఫలితములను తెలుసుకొనుటకు ఉపయోగపడుతుంది. గోచారము ప్రకారము గ్రహములకు ఫలితములను తెలుసుకోవాలని అనుకొన్నప్పుడు, జన్మ లగ్నమును ప్రామాణికముగా తీసుకోకూడదు. ఇక్కడ జన్మ రాశి మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి యొక్క గోచారము ఫలితమును సులభంగా తెలుకోవడానికి మహర్షులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసినారు.


శనీశ్వరుడు ప్రతి రాశిలో 2 ½ సంవత్సరాలు సంచరిస్తాడు, అలా మూడు రాసులలో శని గోచార రీత్యా 12, 1, 2 స్థానంలో 7 ½ సంవత్సరాలు సంచరించే కాలంను ఏలినాటి శని అంటారు.

శని చతుర్ధ స్థానంలో గోచారరీత్యావున్నచో అర్దాష్టము శని(2 ½) అని, అష్టమ స్థానం లో వున్నచో అష్టమ శని(2 ½) అని అంటారు. ఒక వ్యక్తి జీవితంలో 7 ½ సంవత్సరాలు ఏలినాటి శని మూడుసార్లు వస్తుంది. మొదటి దానిని మంగు శని అని, రెండవది పొంగు శని అని, మూడవ దానిని మరణ శని అని అంటారు.

ధనస్సు లో నుంచి మకరం లోకి వెళుతుంది. అంటే కుంభ రాశి వారికి మంట మొదలు, మొదటి దశ రెండున్నర ఏళ్ళు. మకరం వారికి మధ్య మంట, రెండవ దశ రెండున్నర ఏళ్ళు. ధనస్సు వారికి పూర్తి మంట, చివరి దశ రెండున్నర ఏళ్ళు.

వృశ్చికం వారికి(శని 3 వ స్థానం లో), శని తొలగి చిన్నగా పరిస్థితి శుభముగా మారుతుంది. అనురాధ నక్షత్రం, చాలా ఎక్కువ అనుకూలము.

మీన రాశికి(శని 11 వ స్థానం ఉత్తరాభాద్ర అధిపతి శని) కి మంచిది.

ఈ సంవత్సరం మిధునరాశి కి, శని దేవుడు అష్టమ స్థానానికి చేరుకున్నప్పుడు అదృష్టం కూడా కలిసిరాదు. భవిషత్తుకి మరియు సంపదకు అవరోధాలను కలిగిస్తుంది.

తులా రాశి, జనవరి నుండి అర్ధాష్ఠమ స్థానమున ప్రతికూలుడగుట వలన కార్య భంగము, శ్రమతో కూడిన ఫలితము, అధిక శ్రమ మరియు స్వల్ప ఫలము, అనారోగ్యము, దేహ మరియు శారీరిక పీడ.

5 నవంబర్ 2019 న బృహస్పతి(గురువు), ధనుస్సు లోకి ప్రవేశించినది. మార్చి 30, 2020 నుండి బృహస్పతి, మకరం లోకి ప్రవేశిస్తుంది. జూన్ 30, 2020 నుండి బృహస్పతి రెట్రోగ్రేడ్ మోడ్‌లో కదులుతూ మళ్ళీ ధనుస్సులోకి ప్రవేశిస్తుంది. నవంబర్ 20, 2020 నుండి బృహస్పతి మళ్ళీ మకరం లోకి ప్రవేశిస్తుంది.

శని గ్రహము మనిషిని వాస్తవ పరిస్తితిలో ఉంచి, భ్రమలు తొలిగించి, సమస్యలతో బ్రతకడము నేర్పుతుంది. తట్టుకోని నిలబడగలిగితే, చివరలో మంచి చేస్తుంది. తట్టుకోలేక చెడు దోవలో పడితే, అంతా పోగొట్టుకుంటారు.

మానసికంగా, శారీరకంగా పడే కష్టం ఏదైనా మన అంతట మనము పడితే, మనకు సంతోషము, శని కూడా సంతోషపడతారు. శని మనల్ని చూసి పాపం అనుకుంటే, కొత్త ఇబ్బందులు తగ్గుతాయి. లేదంటే ఆయన వైపు కూడా కొత్త పుల్లలు వస్తాయి.

* శనివారం శని కి శివయ్యకు గుడి లో నువ్వుల లేదా ఆవు నేతి దీపం. రోజూ ఇంట్లో నువ్వుల దీపం, తులసి దీపం.
* ప్రతి వారము గుడి లో నవగ్రహ ప్రదక్షిణలు, వీలైతే శివ, ఆంజనేయ స్వామి 108 ప్రదక్షిణలు
* నేల నిద్ర, శాఖాహరం, ఉదయము 5 కి లెగిచి ధ్యానం
* రోజూ ఇంట్లో దీపం అరగంట పూజ
* కన్న తల్లి దండ్రులు ఇంట్లోనే మనతో ఉంటే ఎక్కువ రక్షణ సమస్యలనుండి, శని కనికరము
* ధ్యానం, మంత్ర ఉచ్చారణ, నవగ్రహ స్తోత్రము, శివుని లేదా హనుమాన్ అష్టోత్తరము
* రామ లేదా శివ కోటి - శ్రీ రామ, జై శ్రీ రామ, ఓం నమశ్శివాయా
* శనిదోష నివృత్తికి నలమహారాజు చరిత్ర ను పారాయణ చేయండి(see video).
* శనివారం ఉదయం అన్నం ముద్దలో నువ్వులనూనె కలిపి నైవేద్యం చేసి కొద్దిగా తిని, ఎవరూ తొక్కని ప్రదేశములో వదిలి వేయాలి. ఇలా శనివారాలు చేయాలి.

పైవి వీలయినంత చేసుకుంటే, అది మన సౌఖ్యం కోసం, మనశ్శాంతి కోసం.

శని గ్రహ మార్పు ఇబ్బందులు -

స్థాన చలనము ఉద్యోగ మార్పు
ఉద్యోగము ఆదాయము పోవడము తగ్గడము
ఉద్యోగము లేదా ఇంట్లో లేదా బయట లేదా బంధువులలో మాటలు పడటము, తగవులు
ఖర్చు ఎక్కువ, మనశ్శాంతి లేకపోవుట

శని గ్రహ మార్పు మనిషిలోని భాగాలు -

మొఖము - 3 నెలలా 10 రోజులు - హాని పీడ
కుడి భుజాలు - 1 సం 30 రోజులు, షుమారు 13 నెలలు - జయము లాభం శాంతి
పాదాలు - 1 సంవత్సరం 8 నెలలు 10 రోజులు - తిరుగుడు, అశాంతి
హ్రుదయము - 1 సం 4 నెలల 20 రోజులు, ధనం, ఉన్నతి
ఎడమ భుజ - 1 సం 30 రోజులు, రోగం, దుఖము
తల - 10 నెలలు, సంతోషము లాభం
కనుబొమ్మలు - 6 నెలల 20 రోజులు , మర్యాద మన్నన
వ్రుష్ట లేదా గుద భాగం - 6 నెలల 20 రోజులు - దుఖము, మాన హాని
 
శని గ్రహ మార్పు ధనస్సు లో నుంచి మకరం లోకి - జనవరి 24 2020 - Pic 2
చిత్రము 2







Dt : 31-Dec-2019, Upd Dt : 31-Dec-2019 , Category : General
Views : 166 ( + More Social Media views ) ( id : 273 )
Tags : shani transit , sani transit , jan 24 2020

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content