APLatestNews.com top Banner
నూతన సంవత్సరము లో మనసు పై పట్టు పెంచి, భగవంతునిపై మక్కువ పెంచుదామా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

పాత సంవత్సరం కు వీడ్కోలు, కొత్త సంవత్సరం కు ఆహ్వానం. పైన గ్రహ రాశులు మారవు, మన తల రాతా మారదు. ఎప్పుడు లాగే, రోజు డేటు మారుతుంది, తూర్పు వైపునే సూర్యుడు వస్తాడు.

బాంక్ బాలన్సు మారదు, ఇంట్లో గొడవలు తగ్గవు. గంతులు వేసి ఊగాల్సినంత విషయము ఏముంది? మన మనసు పై పట్టు మనకు వచ్చిందా? పరమాత్మ పై మక్కువ పెరిగిందా?

నూతన సంవత్సరము లో అయినా మనసు పై పట్టు పెంచి, భగవంతునిపై మక్కువ పెంచుదామా?

ఇప్పటకీ జ్ఞానముతో ఆత్మ బలం పెరగకపోతే, శని దేవుడు వివిధ కాలములలో అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ కాలంలో, బెత్తం పట్టుకుని నేల మీదకు దింపి, మరీ గుణపాఠం చెపుతారు.

గురు గ్రహం సంవత్సరము పాటు ఆ కష్టాలను ఎదుర్కునే ధైర్యం ఇస్తుందే కానీ, శని దేవుని పాఠం దెబ్బ ల ను ఆపదు. ఎందుకంటే అది మన మంచి కే, కరమ ఫలము అనుభవించి, భవిష్యత్ సరిచేసుకోవాలి. అలాగే రాహు కేతువు కాలంలో కూడా.

సంవత్సరం పొడవునా, ఏవి తప్పులు ఏవి ఒప్పులు అని, కుటుంబం మొత్తం కూర్చుని చర్చించి, భవిష్యత్ నిర్ణయం మార్పులు చేర్పులు చేసుకోవాలి.

సంవత్సరం పాటుగా, సంక్షిప్త సందేశాలను వివరణలు జవాబులు (270 పేజీల లింకుల లోకం తీరు , 40 పేజీ ల పైగా తత్వాలు) ఆనందం గా, బాధగా, లేదా అయిష్టంగా అందుకున్న గురువు లకు, ప్రతి రోజూ నమస్కార వందనాలు వీలు కల్పించిన గురువు ల కు ధన్యవాదాలు.

కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబం కు దేవుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉంచి, భ్రమలో ఉంటే దాని నుంచి వాస్తవానికి తెచ్చి, దేవుని వైపు చూపు మరలే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.

ఉదయం 5 కు లెగుద్దాం, కుటుంబమంతా ఆరోగ్యంగా ఉందాం. రోజూ దైవ పూజ చేద్దాం, మనసు ను అదుపులో ఉంచుదాం. రోజూ 3 పూటలా తింటేనే శక్తి వస్తుంది, రోజూ 30 సార్లు తలిస్తేనే దైవం పై భక్తి నిలబడుతుంది.

జగమంతా మన కుటుంబం మే. జీవ నారాయణులందరికీ, ఈ పిచ్చి శిష్య నారాయణ నమస్కారములు.
 


Dt : 31-Dec-2019, Upd Dt : 31-Dec-2019 , Category : General
Views : 101 ( + More Social Media views ) ( id : 272 )
Tags : happy new year

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content