APLatestNews.com top Banner
నిత్య పూజ తప్పనిసరిగా మగవారూ చేయాలి అంటే ఎంత మంది నమ్ముతారు? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
సాధారణంగా నిత్య పూజ, ప్రతి ఇంట్లో ఎక్కువగా మహిళలే ఎక్కువ చేస్తారు. పండుగలకు అంతే చాల ఇళ్ళలో. కాని నిత్య పూజ చేయడం అనేది, తప్పనిసరిగా పురుషుడు కూడా చేయాలి. యజమాని కూడా అంటే, వింతగా చూస్తున్నారు కదూ.

మీరు ఎప్పుడైనా, పూజా పుస్తకములో సంకల్పము చదివారా? ఆ సంకల్పంలో నే ఉంటుంది, ధర్మపత్నీ సమేతస్య అని ఉంటుంది. మగవారు మాత్రమే కదా, నా భార్యతో కలసి, ఈ పూజ చేస్తున్నాను అని చెప్పేది.

కానీ పతీ సమేతస్య అని ఎక్కడా ఉండదు కదా? అంటే దాని అర్థం ఇంట్లో పూజ, ఇంటి యజమాని తప్పనిసరిగా చేయాలి అనే కదా. అంటే ఆడవారు చెయ్యకూడదు అని కాదు. మగవారు కూడా, తప్పనిసరిగా నిత్య పూజ చెయ్యాలి అని.

చాలా మంది, అది మా బాధ్యత కాదు, ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు అని బద్దకము తో నిర్లక్ష్యము వహిస్తారు. భర్త పూజ చేస్తే, భార్యకు వాటా వెళ్ళవచ్చు నేమో గానీ, భార్య పూజ చేస్తే భర్తకు వాటారాదు. భర్త లో భార్య సగము అంటారు కదా, అర్ధాంగి అని. శివుని అర్ధనారీశ్వరుడుగా చూపిస్తారు.

వాటాలు లేవు అనుకున్నా, మరి భర్త కూడా, తప్పని సరిగా చేయాలి కుటుంబ సంక్షేమము కోసము. ఎవరి ఖర్మ ఫలితము వారిదే.

భార్య సౌభాగ్య పూజతో, దేవుడు ఆమె మాంగల్యము ను లేదా సౌభాగ్యము కాపాడుతారు అంటారు కదా. అంటే, మాంగల్యము వరకు అతను ప్రాణాలతో ఉంటే చాలదు కదా? ఆరోగ్యముగా తిరుగుతూ ఉండాలి కదా, మంచములో అనారోగ్యముతో బతికి ఉన్నా కూడా, భర్త కు లేదా ఆ కుటుంబానికి మంచి కాదు కదా.

ఇప్పుడు అయినా భర్తలు కూడా, తొందరగా లెగిచి ఉదయము 5 కి, రోజూ పూజ చేసి, అరోగ్యాన్ని ఆత్మ బలాన్ని తెలివితేటలు మనశ్శాంతి, పెంచుకుంటే మంచిదే గదా తన కుటుంబానికి. అలా చేసేటట్టుగా, భార్యలు కూడా ప్రోత్సహించాలి.

దానివలన భర్త లో మార్పు వచ్చి, చాలా ఇంటి సమస్యలు తగ్గుతాయి. సంసారము అంటే ఇద్దరు లేనిదే కాదు కదా, మరి పూజ దగ్గర ఎందుకు మగవాళ్ళను వదిలేస్తున్నారు? అలా వదిలేసిన ఇళ్ళలో చాలా మంది అశాంతితోనే బతుకుతున్నారు.

ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని, యజమాని కోరుకోవాలి కదా. యజమానిగా ఉన్నవారు అది కూడా అడగడం కష్టమైతే ఎలా? అందువలన పురుషుడు కూడా, బద్దకము వదలి ప్రతిరోజూ పూజ చేయ్యాలి.

అదే విధముగా మంచి రోజులలో లేదా తిథులలో గాని, వ్రతమప్పుడు గాని యజమానితో పాటుగా, పూజ చేసేటప్పుడు ధర్మపత్నీ, పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి.

ఇక వస్త్రధారణ విషయనికి వస్తే ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ,వివాహిత అయితే చీర కట్టుకోవాలి. అమ్మవారికి అవే కదా ప్రధానం. గుడికి అయినా అంతే కదా.

మరి పురుషుల విషయనికి వస్తే, పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది - ఉత్తరీయం ఉండాలి, అలాగే గోచీపోసి పంచె కట్టుకోవాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని కచ్ఛము అంటారు.

ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలి అంటే, ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు.

కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు.

కాబట్టి చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు, మగవారు పూజ చేసేటప్పుడు. దేవాలయంలో నైనా అంతే.

ఇలా ఎందుకంటే దేవాలయం అనే మన మన శరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి, ఆత్మకు పరమాత్మ, పరమాత్మకు ఆత్మ కనపడాలి. దేవుని చేరుటకు పూజ ఒక పద్దతి మాత్రమే సుమా, ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి.
 

Dt : 02-Dec-2019, Upd Dt : 02-Dec-2019 , Category : General
Views : 113 ( + More Social Media views ) ( id : 239 )
Tags : devotional puja by house head

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content