APLatestNews.com top Banner
60 ఏళ్ల తల్లి మీద లేని ప్రేమ, 6 ఏళ్ల పిల్ల మీద ఉంటుందా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఒక గురువు గారు ఇప్పుడే అడిగారు, 60 ఏళ్ల తల్లి మీద లేని ప్రేమ, 6 ఏళ్ల పిల్ల మీద ఉంటుందా?

ప్రేమ ఉండదు. ప్రేమ ఉంటే, ఇద్దరి మీదా ఉంటుంది. వయస్సు లో ఉన్న, భాగస్వామి మీద ఉండేది కూడా, మోహం మాత్రమే. అలాగే బిడ్డలు మీద కూడా. వాళ్ళ మీద ప్రేమ ఉంటే, 60 ఏళ్ల తల్లి దండ్రి ని కూడా దగ్గర గా పెడతారు.

నమ్మరు కదా, ఈ ఉదాహరణలను చూడండి. అందరినీ కాదు, తల్లి దండ్రులను దూరంగా ఉంచేవారి గురించి -

1. చిన్న గొడవలకే విడాకులు తీసుకునే జంటను అడగండి, మీ 5 ఏళ్ల పిల్ల మొఖం చూసి, సర్దుకోండి మిగతా జీవితకాలము అని. కానీ ఆగుతారా? మనల్ని చూసి నవ్వుతారు. అంటే పిల్ల మీద మోహం మాత్రమే ఉంది.

2. ఉద్యోగాలు లేదా వ్యాపారం చేస్తూ, పసి బిడ్డలు ను ఊళ్ళో వదిలే వారిని అడగండి. తల్లిని బిడ్డను విడదీయడం పాపము, అలా వద్దు అని. మనల్ని చూసి నవ్వుతారు, వారు మరియు వారి తల్లి దండ్రులు కూడా. మాకు తెలియదా, సంపాదన ముఖ్యం తర్వాతే ప్రేమ బంధాలు అంటారు. మరి ప్రేమ ఉంటే వదులు తారా? అదే మోహం.

3. నగరాల్లో లేదా విదేశాల్లో లేదా డబ్బు లో ఉన్న చాలా బంధాలు పేకమేడలు. అంటే గట్టిగా గాలి వీస్తే, కూలిపోతాయి. జీవిత భాగస్వామి, మనం మన ఊరు వెళ్లి, ప్రశాంతంగా ఉన్న దాంతో బతుకు దాము, అంటే ఏమి జరుగుతుంది?

వెంటనే ప్రళయం వస్తుంది జంటలో, రణరంగం విడాకులు. అన్నేళ్ళ మోహం, భ్రమ, నటన వీడి పోతుంది. నువ్వు పో, నేను రాను ఈ నగరం సౌకర్యాలు ఆడంబరాలు వదిలి, అని వింత వింత వాదనలు.

4. కష్టాలు లేదా, శని రాహు కేతువులు పట్టినపుడు, డబ్బు లేదా సంపాదన పోయినప్పుడు, ఇక ఆ జంట పరిస్థితి చూడాలి. ఊరు మొత్తం, వాళ్ళ అరుపులు ఉచితం గా, అందరూ కనవచ్చు. ఆ బంధము, మోహమే కాబట్టి.

నూటికి 80 శాతం పేక మేడ బంధాలే. వారే ముసలి తల్లి దండ్రులు ను దూరంగా లేదా బయట వదిలేస్తారు. చాలా మంది మోహం ను ప్రేమ అని భ్రమ పడి, జీవితాన్ని నాశనం చేసుకుంటారు.

ధృతరాష్ట్రుడు, గాంధారి కీ వంద మంది బిడ్డలు. మరి బిడ్డల మీద ప్రేమ ఉందా, మోహం మాత్రమే ఉంది. బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా సరిచేయలేదు. పసి తనములోనే, భీముడికి మందు పెడితే, దండించలేదు. కౌరవ కుల నాశనం దాకా తెచ్చారు. అందరూ పరలోకము పోయినాక కూడా, పాండవులును కృష్ణుని తిట్టారే గానీ, తమ పెంపకం లోపము ను గానీ తమ బిడ్డలు తప్పులు గానీ ఒప్పుకోలేదు. అదే మోహం.

ఈరోజు న మన పక్కన, ప్రతి మూడు ఇళ్ళు లో రెండు ఇళ్ళు, ఇలాంటి ధృతరాష్ట్ర దంపతులవే, కౌరవ బిడ్డలు వే. అనుమానమా? నిండు మనసు తో కళ్ళు మూసికుని గుండెల మీద చెయ్యివేసుకుని, మన చుట్టూ లేదా మన ఇంట్లో చూసుకోండి.
 

Dt : 29-Nov-2019, Upd Dt : 29-Nov-2019 , Category : General
Views : 30 ( + More Social Media views ) ( id : 234 )
Tags : taking care of older parents and kids

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content