APLatestNews.com top Banner
చందమామ కార్తీక పౌర్ణమి తర్వాత, కనపడటం లేదు. దేవ లోకములో అలజడి? అలిగారా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

చందమామ కార్తీక పౌర్ణమి తర్వాత, మా ఊళ్ళో మా సమయం రాత్రి 6pm 7pm, దగ్గర కనపడటం లేదు. తర్వాత ఎప్పుడో లేటుగా వస్తున్నారు. మీ ఊర్లో గమనించారా? దేనికి అలిగారు , మనసు కు కారకులు అయిన మన మామ.

ట్రంప్ మీద ఎదురు పార్టీ ఆరోపణలు తట్టుకోలేక మొఖం చాటు చేశారా? అయోధ్యలో గెలిచామని రామయ్య దగ్గరకు వెళ్ళారా? ఇంకేదైనా పెద్ద సమస్య? చదవండి మరి ఈ కధ.

అమ్మ, నేను రోజూ నడిచే దోవలో, సాయంత్రము చీకటిపడే వేళలో, పౌర్ణమికి నిండు చందమామను తూర్పు వైపు చూసి, నమస్కారము చేసాము. చంద్రుడు మనసును ప్రభావితము చేస్తారు అందరికి. సంతోషముగా ఇంటికి వచ్చాము మైలు తిరిగి. పొద్దున్నే, లెగిచే సరికి పడమర వైపు దిగిపోతూ ఉంటారు, సూర్యుని చూసి.

తర్వాత రోజు, మరలా సాయంత్రము టైం కి వెళ్ళుతూ మరలా తూర్పు వైపుకు చూసాము. అంతా చీకటి, ఒక వేళ మబ్బు అడ్డు వచ్చింది ఏమో అని, తిరిగి వెళ్ళేటప్పుడు చూసాము. కనపడలేదు. అయ్యో పాడ్యమి రోజే, చంద్రయ్య ఎక్కడకి వెళ్ళారు అనుకున్నాము.

తర్వాత రోజు విదియ, కనపడలేదు, తదియా అంతే, అలా వరుసగా 5 రోజులు కనపడలేదు. ఏదొ జరుగుతుంది అనిపించింది. స్నేహితులకు మెస్సేజ్ పెట్టా, వారు కూడా కనపడలేదు, లేటు రాత్రి లేదా పొద్దున్న చూసాము అని చెప్పారు.

ఏదో జరుగుతుంది, మొన్న ఏదొ సినిమాలో ఇల్లు కనపడటము లేదు అని ఒక పిల్లవాడు పొలీసుల దగ్గరకు వెళ్ళాడు, అదొక విచిత్రమైన సినిమా (వీర భొగ వసంత రాయలు, 2018). మరి మనము అలాగే చేద్దామా? నవ్వుతారా? ఏమి చేద్దాము అనుకొని, నవ్వినా పర్లేదు అనుకొని, పొలీసు స్టేషన్ కు వెళ్ళి 5 రోజుల నుంచి జరిగింది చెప్పాము.

వాళ్ళు ముందు నవ్వి, కొన్ని ప్రత్యేక పరిస్తితిలో, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాము. అంతరిక్షము లో జరిగే కొన్ని మార్పులు, జనము కు వచ్చే చిన్న చిన్న సందేహాల ద్వారా, ఎక్కువ సమాచారము దొరుకుతుంది. దేనినీ తేలికగా తీసుకోకూడదు అన్నారు. మీకు రేపు ఫొన్ లో చెప్తాము ఏమన్నా తెలిస్తే అన్నారు. నమస్కారము చేసి వచ్చేసాము.

పోలీసులలో చర్చ సాగింది, మనది ఊరు పరిధి మాత్రమే, దీనిని జిల్లా మరియు రాష్ట్ర పోలీసులకు చెపుదాము అని, వారికి తెలియచేసారు. వారు, ఇది రాష్ట్ర పరిధి కాదు, దేశము మరియు అంతరిక్ష శోధనా సంస్థకు తెలియాలి అని వారికి సమాచారము ఇచ్చారు. ఆ రోజు రాత్రి, ఆ సంస్థ వారు కూడా పరిశీలించారు, రాజధాని నుంచి ఆజ్ఞతో. వారికీ కనపడలేదు.

ఆందోళన ఎక్కువ అయ్యింది. ఏమి చెయ్యాలి. కొద్ది గంటల పాటు చందమామ కనపడుట లేదు. లేటుగా తర్వాత వస్తున్నారు. ఇంకా బాగా గమనించాలి అని, భూమి నుంచి కాకుండా, ఆకాశములో ని అంతరిక్ష స్టేషన్ నుంచి పరిశీలిద్దాము అని, వారికి సమాచారము ఇచ్చారు. అక్కడ వారు అప్రమత్తము అయ్యారు. టెలెస్కోప్ ల తో తీవ్రముగా పరిశీలించ సాగారు. ఆరోజూ అలాగే లేటుగా వచ్చారు.

ఏమి చెప్పాలి, మనకు కూడా ఏమి అర్ధము కావడము లేదు. కనపడటము లేదు. ఉపగ్రహాల సాయముతో కూడా కనిపెట్టలేక పోతున్నాము, ఎలా అని ఆలోచన చేస్తున్నారు. సైన్స్ వల్ల కానిది, యోగుల వల్ల అవుతుంది అంటారు అని, తమ టీం లో ఉన్న భారతీయుని అడిగారు, ఏమి చేద్దాము అని. నాకు హిమాలయాలలో ఒక సాధవు తెలుసు, డిల్లీ కి మెస్సేజ్ పెడతాను అని పెట్టారు. భారత్ లోని వారు, హిమాలయాలలోని సిద్ద గురువును కలిశారు. విషయము చెప్పి, వేడుకున్నారు, సహాయము చేయమని.

అప్పుడు ఆయన, మనో నేత్రము లో భగవంతుని ధ్యానించి, చంద్రయ్య గురించి సమాచారము తెలుసుకున్నారు. చిరునవ్వుతో ఆయన ఇలా చెప్పారు. దేవ లోకములో అలజడి ధర్నాలు జరుగుతున్నాయి అంట.

అదేమిటి స్వామీ, భూలోకములో ధర్నాలు విన్నాము గానీ, దేవలోకములో అంటే ఎలా, దేని గురించి, అసలు విషయము ఏమిటో కనుక్కోండి అన్నారు.

మరలా తన దివ్యశక్తితో చూసారు. పూర్తిగా అర్ధము అయ్యింది, ఇలా చెప్ప సాగారు. చంద్రుని ధర్నా జరుగుతుంది అంట రోజు కొన్ని గంటలు, తమకు మానవుల వలన ఇబ్బందులు వస్తున్నాయి అని. అందులో ముఖ్యముగా చంద్రుడు, సూర్యుడు కూడా ఉన్నారు. మనము చంద్రుడి గురించి అలోచన చేస్తున్నాము కాబట్టి, ఆయన నివాసానికి ముప్పు వస్తుంది అని భావిస్తున్నారు.

మానవులు గతములో ఎన్నో ప్రయత్నాలు చేసి, చంద్ర మండలము చేరుకున్నారు, నడిచారు, జెండా పాతారు. చంద్రుడు తన నివాసమును, చంద్రమండలము వెనుక వైపుకు మార్చారు. ఇప్పుడు భారత్ కు చెందిన ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగముతో, జూలై 22 2019, చంద్రమండలం వెనకవైపు చీకటి ప్రాంతము లోకి రోవర్ ను పంపింది, కానీ ఆ ప్రయత్నము విఫలము అయ్యింది.

ఈ విధముగా, వెనుక ప్రాంతము నకు కూడా మానవులు వస్తూ ఉంటే, మరి మా రక్షణ మరియు నివాసము ఎక్కడ? ఇది చంద్రుని ధర్నాలో ముఖ్య ఉద్దేశ్యము. గత కొన్ని నెలలుగా మనసులో బాధపడి, మరలా చంద్రయాన్ 3 వస్తుందేమో అని, తగు రక్షణ చర్యలు చేపట్టాలి అని ఇంద్రునితో మొరపెట్టుకున్నారు. అలాగె సూర్యుడు కూడా, తన వైపు పరిశోధనలు కోసము ఉపగ్రహాలు పంపుతున్నారు అని బాధపడుతున్నారు.

ఇంద్రుడు, వారిని బుజ్జగిస్తున్నారు, ఏమీ కాదులే ఇప్పుడల్లా. రామాయణ భారత కాలములో నేరుగా ఋషులు వచ్చేవారు ఎలాంటి ఆర్భాటము లేకుండా, మనతో కలసిపోయారు. కానీ కలియుగ మానవులు, కోట్లు ఖర్చు పెట్టి రాకెట్లలో వస్తున్నారు.

ఇంకా ఎంతో ఎదగాలి వారు, మనలను చేరటానికి, ఈ లోపల వారిలో వారే కలహాలు స్రుష్టించుకొని, ఈ ప్రయత్నాలు ఆపవచ్చు కూడా. కలి ప్రభావము చాలా ఉంది వారి మీద, మీరు తొందరపడవద్దు అని బుజ్జగిస్తున్నారు.

అప్పుడు అర్ధము అయ్యింది వీరికి ఎందుకు చందమామ కొన్ని గంటలు కనపడటము లేదో. ఆ సమాచారాన్ని వెనుకకు చేరవేసారు. అలా అది మాకు చేరింది. మరి మానవుల ప్రయత్నము, దేవతల సహకారముతో మంచిగా సాగాలని ఆశిద్దాము.
 
చందమామ కార్తీక పౌర్ణమి తర్వాత, కనపడటం లేదు. దేవ లోకములో అలజడి? అలిగారా? - Pic 2
చిత్రము 2

చందమామ కార్తీక పౌర్ణమి తర్వాత, కనపడటం లేదు. దేవ లోకములో అలజడి? అలిగారా? - Pic 3
చిత్రము 3


Dt : 19-Nov-2019, Upd Dt : 19-Nov-2019 , Category : General
Views : 84 ( + More Social Media views ) ( id : 223 )
Tags : moon disappeared , chandamaama , kartika purnami

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content