Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మెమోరియల్ డే(అమర వీరుల స్మారక/ జ్ఞాపకార్ధ దినోత్సవం) మరియు వెటరన్స్ డే(ఎక్స్-సర్వీస్మెన్/ మాజీ యుద్ధ వీరుల దినోత్సవం), ఈ రెండూ కూడా మిలిటరీని గౌరవించే అమెరికా దేశము యొక్క దేశభక్తి సెలవులు. అయితే ఈ రెండింటి మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఉంది.
మే చివరి సోమవారం నాడు వచ్చేది
స్మారక దినోత్సవం, అంటే మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు మరణించిన స్త్రీ, పురుషులను స్మరిస్తుంది. వారు ప్రేమించిన దేశాన్ని రక్షించేటప్పుడు లేదా దేశము తరుపున, పోరాటములో అంతిమ త్యాగం చేసిన, అమెరికన్ దేశభక్తుల గురించి స్మరణ చేసుకునే సందర్భము.
స్మారక దినోత్సవం రోజున, వారు తమ కమ్యూనిటీలోని స్మారక సేవలకు హాజరు కావడం ద్వారా లేదా తమ స్థానిక వెటరన్స్ స్మశానవాటికలో పువ్వులు వేయడం మరియు సమాధులపై జెండాలు వేయడం ద్వారా, దేశము కోసము ప్రాణాలను విడిచిన వీరులను గౌరవించవచ్చు.
ఇది సివిల్ వార్(పౌర యుద్దం/ అంతర్యుద్ధం) ముగిసిన ఏడాది మొదటిది జరుపుకుంది. 1971 వరకు, దీనిని అలంకరణ డే గా పిలిచేవారు.
అలాగే, ప్రతి
నవంబర్ 11 న వెటరన్స్ దినోత్సవం జరుపుతారు, అనగా గతములో సాయుధ దళాలలో పనిచేసిన అనుభవజ్ఞులు ను గుర్తిస్తుంది గౌరవిస్తుంది. ఇది వారి గౌరవార్ధము ఇచ్చే సెలవు రోజు.
వెటరన్స్ దినోత్సవం రోజు ఆ పని చేయడానికి ఒక అవకాశం, వెటరన్స్ స్నేహితులు మరియు వారి కుటుంబ సభ్యులకు, ప్రజలు ప్రశంసలను చూపించడానికి ఇది సరైన సమయం. తమ ఇంటి వెలుపల అమెరికన్ జెండాను ఎగురవేయడం, వెటరన్స్ సదుపాయాన్ని సందర్శించడం లేదా స్వయంసేవకంగా పనిచేయడం, స్థానిక కార్యక్రమానికి హాజరుకావడం మరియు వెటరన్స్ మరియు వారి కుటుంబాలకు వారి సేవకు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా తమ వెటరన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మొదటి వేడుకలు నవంబరు 11 1919 న, మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు జ్ఞాపకార్థం జరిగింది. 1954 వరకు, వెటరన్స్ డేను, అర్మిస్టీస్ డే అని పిలిచేవారు.
సేవా సభ్యులకు, ప్రజలు కృతజ్ఞతా భావాన్ని చూపించడానికి, జాతీయ సెలవుదినం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. వెటరన్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా లేదా సేవ చేసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడం కు ఏ రోజు అయినా మంచి రోజే.
చాలా పట్టణాలు పెరేడ్లను కలిగి ఉంటాయి. వందలాది మంది ప్రజలు పాల్గొని, తమ క్రుతజ్ఞతలు అభినందనలు తెలుపుతారు.
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,767; 104 తత్వాలు (Tatvaalu) and views 226,198 Dt : 10-Nov-2019, Upd Dt : 10-Nov-2019, Category : America
Views : 1063
( + More Social Media views ), Id : 215 , Country : USA
Tags :
Memorial Day ,
Veterans Day ,
America ,
USA కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments