APLatestNews.com top Banner
శనయ్య భగవంతుని తో ఇలా అన్నారు - సామాన్య మానవునికి ఇది కష్టం, మీ దీవెన అండ లేకుండా - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
స్వామి, నా ప్రభావానికి పని చేయకుండా, మీరు అడ్డు పడుతున్నారు కదా. అప్పుడు దేవుడు, నేనెప్పుడూ అలా చేయలేదు, చేయను. నీ కర్తవ్యం నీది , నా కర్తవ్యం నాది. ఏమి జరిగిందో వివరముగా చెప్పు.

ఒకని కి నేను పట్టాను, ఏడున్నర ఏళ్లుగా, బండ కేసి బాదుతున్నట్లుగా బాదుతున్నా. కానీ, వాడి మొఖం లో బాధ గానీ, ఇబ్బంది కానీ కనిపించడం లేదు. సామాన్య మానవునికి ఇది కష్టం, మీ దీవెన అండ లేకుండా.

వాడికి అన్ని సుఖాలు దూరము చేస్తున్నాను అనుకుంటున్నాను, వాడు నాకంటే ముందే వాటికి దూరంగా ఉంటున్నాడు. వాడికి చీమ కుట్టినట్లు లేదు. నాకే అర్ధము కావడము లేదు, శిక్ష వాడు వేసుకుంటున్నాడా లేక నేను వేస్తున్నానా? నాకు మీ మీదే అనుమానముగా ఉంది.

సరే చెప్పు శని దేవా, ఏమి జరుగుతోంది అక్కడ అతనితో. స్వామీ అన్నీ తెలిసీ నన్ను అడుగుతున్నారు.

వానికి రోగము తెప్పించి డాక్టర్ తో చెప్పించి, నేల మీద పండ వేయాలి, మాంసం జీర్ణం కానీయక, మానిపించాలి. ఆ రెండూ భరించలేక వదుకోలేక, వాడు బాధపడాలి. అలాగే అరిషడ్ వర్గాలు పట్టి పీడించాలి, వాటిలో మునిగి పోవాలి.

కానీ మీరు ఏమి చేస్తున్నారు. వాడికి 20 ఏళ్లుగా అవి రెండూ అలవాటు చేశేసారు. ఇప్పుడు వాడు హయిగా, శాఖహరం తిని, నిద్ర పోతున్నాడు నేల మీద. బాధ ఏది? నాకన్న ముందే, అన్ని శిక్షలు వేసుకుంటున్నాడు. అరిషడ్ వర్గాలు కు బదులు, వాడు నారాయణుడు అయిన మిమ్ము, కన్న తల్లిని పట్టుకుని వేళాడుతున్నాడు.

శని దేవా, మరి మీ కోరిక నెరవేరింది కదా, నన్ను ఎందుకు తప్పు పడతావు. నిగ్రహం పెంచడం తప్పు కాదు కదా? మోహం కు దూరం తప్పు కాదు కదా?

సరే, అందరి చేతా తిట్టించి, తగువులు పెంచుదాము అంటే, ఎవరితో పెద్దవి కాకుండా, దూరంగా జరుగుతున్నాడు. లేదా వారు పెట్టిన అవమానాలు, బాధలు, తిట్లు ఓపిక గా భరిస్తున్నాడు.

అంటే నీ ప్రభావం పనిచేస్తుంది కదా, సంతోషించక, నన్ను ఆక్షేపిస్తావు ఏమిటి.

కానీ, వాడు పెద్దగా ఇబ్బందులు లేకుండా, తలవంచుకుని భరిస్తూ తప్పుకుంటున్నాడు, అన్ని కష్టాలు.

సరే , ఇంకా ఏమున్నాయి శని దేవా?

ఆదాయం లేకుండా, అప్పులు పాలు చేద్దాం అనుకున్నా. రెండేళ్ల క్రితం ఇల్లు కొనేదాక తెచ్చా కష్టపడి. ఏం వైష్ణవ మాయో మరి, ముందు జాగ్రత్తగా దానిని ఆపేశారు మీరు. వాడికి ఇప్పుడు టెన్షన్ లేదు. లేకపోతే నేనెంత ఆనందపడేవాడిని, ఇల్లు కొని ఉంటే.

ఒక రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టా. కొత్త రాష్ట్రంలో మంచి ఎండ, గాలీ, ఆరోగ్యం, సౌకర్యాలు ఇచ్చారు మీరు. అమ్మ ను నెత్తిన వేస్తే, ఇబ్బంది పడతాడు అనుకున్న, వెంటనే వెనక్కు పంపుతాడు అనుకున్నా, కానీ ఆమె కు తోడుగా మీరు వస్తున్నారు. ఆ రాష్ట్రం కూడా అండగా ఉంది వారికి.

యాక్సిడెంట్ చేయించా, కానీ ఆమె ఉన్నది అని, కారు మీద గీత లతో కానిచ్చారు మీరు. ఆదాయం ఆపేశా స్నేహితుల సహాయం ఆపేశా, తల్లి ని వదులుతాడు అని ఎదురు చూస్తున్నా, తనకి పాపం పెరగాలి అని.

కోటి పైగా నష్టము చేయించా. అదేదో నాది కాదు, నేను వస్తా తెచ్చానా అన్నట్లు, ఇష్టముగా వదులుకున్నట్లు ఉంటాడు. మీ ధైర్యము లేకపోతే, ఎవరైనా అలా ఉంటారా?

రెండు ఏళ్ళు గా ఏది మొదలు పెట్టినా, అన్ని పనులు నోటిదాకా తెచ్చి ఆపేసాను. ఊళ్ళో ఇళ్ళు ఖాళీగా ఉంచాను. కానీ, మీ మీద భారముతో అన్ని మామూలుగా జరిగిపోతున్నాయి.

బయట తింటే రోగము గా పట్టుకుందాము అంటే, పెరుగు అన్నముతో అరటికాయతో ఊరేగుతున్నారు. ఆపిల్, కారెట్, వేరుసనగ వెంట కూడా పెట్టుకుని వెళుతున్నారు.

వళ్ళు నొప్పి, వెన్ను నొప్పి, తల నొప్పి తెప్పిస్తే, ఆసనాలు వేసి తగ్గించుకుంటున్నాడు, మందులు వాడకుండా. పద్మాసనముతో మీతో మాట్లాడుతున్నాడు ధ్యానములో ఆనందముగా.

కానీ మీరు, ముందు జాగ్రత్తగా, 20 ఏళ్లుగా వాడి ఖర్చులు, అదుపు లో ఉంచి తగ్గించి, సిద్ధం చేశారు. వాడు, వెనక్కి ఊరు వెళ్ళడానికి కూడా సిద్ధం అంటున్నాడు, అమెరికా ను వదలను అని అందరిలా మోహములో ఏడవకుండా.

ప్రభుత్వ ఉద్యోగం కోసం, అధికారులు కాళ్ళు పట్టుకుని లేదా తలవంచి, నిలుపుకుంటాడు అనుకున్నా. అదేదో తేలికగా తాంబూలం ఇచ్చినట్టు గా, రాజీనామా వారి చేతిలో పెట్టి వచ్చాడు, అమ్మకు తోడు ఉండాలి అని. 2 ఏళ్ళ ముందు పోటీ గా మనిషిని తెచ్చి పెట్టా, అప్పుడు మీ అనుమతి లేదేమో, గమ్ముగా ఉన్నాడు బయటకు వెళ్ళకుండా, ఇబ్బందులు పడుతూ కూడా.

తల్లి ని వదులుతాడు అనుకుంటే, రోజూ ఆమె చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. తల్లి ఆరోగ్యం దెబ్బ తీసా భయపడి వెనక్కు పంపుతాడు అని, కానీ వేప కాకర అల్లం వెల్లుల్లి అని, ఇంటి వైద్యం మొదలు పెట్టాడు. ఆమె ఆరోగ్యము మెరుగు అవుతున్నది.

అనారోగ్యంతో, పది ఇరవై నిమిషాలు నడిస్తే, కష్టం లే అనుకుంటే, ఆ రకంగా 18 వారాలు ప్రదక్షిణలు చేయించావు స్వామీ, ఇంకా ఆత్మ బలాన్ని పెంచుతున్నావు. ఇదంతా మీ అండ లేకుండా జరగదు.

ఇబ్బందులు పడుతున్నారు కానీ, బాధ ఏడుపు కనపడటం లేదు. సరే ఇన్ని ఇబ్బందులు ఇస్తే, స్వార్థం తో బయట జనం బాధలు వినరేమో పట్టించుకోరేమో అనుకుంటే, బయట జనానికీ ముందు జాగ్రత్తలు, గంటలు గంటలు నీతి సూత్రాలు వదలడం లేదు. వారినీ మోహం నుంచి బయట వేసే ప్రయత్నము చేస్తున్నారు. అని తన బాధ చెప్పుకున్నారు.

శని, అర్థం అయింది. నీ ప్రయత్నం కు, నేను అడ్డు రాలేదు నువ్వే ఒప్పుకున్నావు. నేను వస్తే, ఇవన్ని, చేయనీయకుండా ఆపేవాడిని. కానీ ఆపలేదు. కేవలము వాళ్ళ ను అవి ఎదుర్కోటానికి సిద్ధం చేశాను, అది తప్పకాదు కదా. గాయం తగిలితే, వైద్యులు మందు ఇస్తారు, తల్లి దండ్రులు ముందు జాగ్రత్తలు చెపుతారు, మంచి చెడూ నేర్పుతారు. మనమూ అంతే కదా.

ఇంకోటి గుర్తు తెచ్చుకో, వాళ్ళు గుడిలో నీకు, శివయ్య కు మాత్రమే 5 ఏళ్లుగా దీపం పెట్టారు. బాధలు తగ్గిచ్చమని అడగలేదు. నీకు తలవంచారు, నీకు దాసోహం అన్నారు, ఎదురు తిరగలేదు, అన్ని అనుభవిస్తున్నారు. నాకు దీపం పెట్టకపోయినా, మన ముగ్గురమూ ఒకటే, దేవుళ్ళు అందరూ ఒకటే, కాబట్టి నాకు పెట్టినట్లే, మరి నేను కొంత కాపాడాలి కదా. కాబట్టి, విషయ వాసనలకు దూరంగా ఉన్నంతకాలం, దైవ నియమాలను పాటించినంత కాలం, నీ ఇబ్బందులు ఎదుర్కొన్నంత కాలము, మనం కొంచెము దయ చూపాలి.

వీళ్ళ ను చూసి, ఇంకొంత మంది మారితే, కలి మాయాజాలం కు, కూడా దూరం అవుతారు. నీ పాత్ర 7 1/2 సంవత్సరాలు మాత్రమే, కానీ కలి పురుషుడు పడితే ఆ బాధ జీవితాంతం, చీకట్లో ఉంచుతుంది, ఎవరిమాట విననీయదు. ఎందరో కలి పురుషుడి మాయలో తూగుతున్నారు.

ఈ మిగిలిన కాలం, నీ పని నువ్వు చెయ్యి. అలాగే, నా పని నన్ను చెయ్యనివ్వు. తల్లి ఎవరికైనా తల్లే, నా బాధ్యత తప్పదు. బాధపడకు, దయతో ఉండు, నిన్ను శరణు జొచ్చారు అన్నారు దేవుడు. శని దేవుడు సంతోషించారు.

కాబట్టి, కర్మ ఫలం విడువదు. జాగ్రత్తలు. మోహానికి, తప్పుడు పనులకు దూరముగా ఉండండి. తల్లి దండ్రులు దగ్గర ఉంటే, మీకు శని ప్రభావము కొంచెము అయినా తగ్గుతుంది.

ఏది పోయినా పరవాలేదు, కానీ నీతి ని దైవాన్ని విడువద్దు. అన్ని ఆయన ఇవ్వగలడు, అన్ని వెనక్కి తీసుకో గలడు. చెడుకు, మోసముకు, అరిషడ్ వర్గాల బానిసకు, శని కర్తవ్యము శిక్ష తప్పదు.

అలాగే మన పురాణాలు, మన పెద్దలు అనుభవం తో, రాసిన ప్రమాణాలు, జీవిత ఉదాహరణలు. కర్మఫలం తప్పదు. తప్పులు బాధించడం మోసం వద్దు, మనమూ పడాలి.
 

Dt : 25-Oct-2019, Upd Dt : 25-Oct-2019 , Category : Devotional
Views : 86 ( + More Social Media views ) ( id : 198 )
Tags : Shani , God , karma phalam

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content